Mahesh Babu Guntur Karam Movie Shooting Postponed To July, Deets Inside - Sakshi
Sakshi News home page

Guntur Karam Movie: 'గుంటూరు కారం' కష్టాలు.. ఏం జరుగుతోంది?

Published Fri, Jun 16 2023 3:48 PM | Last Updated on Fri, Jun 16 2023 4:42 PM

Mahesh Babu Guntur Karam Movie Shooting Problems - Sakshi

సూపర్ స్టార్ మహేష్ బాబు చివరగా 'సర్కారు వారి పాట'లో కనిపించాడు. ఆ సినిమా వచ్చి ఏడాది పైనే అయిపోయింది. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో 'గుంటూరు కారం' మూవీ చేస్తున్నాడు. చాలా రోజుల క్రితమే షూటింగ్ మొదలుపెట్టినప్పటికీ.. ఎందుకో ఆ కష్టాలు మాత్రం వదలట్లేదు. దీంతో ఇప్పుడు ఫ్యాన్స్ కి లేనిపోని సందేహాలు వస్తున్నాయి.

మహేష్-త్రివిక్రమ్ కాంబోలో హ్యాట్రిక్ సినిమా గతేడాది అనౌన్స్ చేయగానే అందరూ తెగ ఎగ్జైట్ అయిపోయారు. 'అతడు', 'ఖలేజా'కి మించి ఉండబోతుందనే అంచనాలు పెంచేసుకున్నారు. కానీ రియాలిటీలో మాత్రం షూటింగ్ నత్తనడకన సాగుతోంది. గతంలో ఓ షెడ్యూల్ చేశారు ఆ తర్వాత నుంచి షూటింగ్ అస్సలు కుదరట్లేదు.

(ఇదీ చదవండి: Adipurush Review: ‘ఆదిపురుష్‌’ మూవీ రివ్యూ)

రీసెంట్ గా మహేష్ తండ్రి కృష్ణ జయంతి సందర్భంగా 'గుంటూరు కారం' టీజర్- ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. యూట్యబ్ లో ఇది ఫ్యాన్స్ ని ఎంటర్ టైన్ చేస్తోంది. మరోవైపు జూన్ 7న కొత్త షెడ్యూల్ మొదలవ్వాల్సి ఉంది. ఏమైందో ఏమో గానీ జూన్ 12కి, ఆ తర్వాత జూన్ 20కి వాయిదా వేశారు. ఇప్పుడు ఏకంగా జూలైకి షిఫ్ట్ చేసినట్లు తెలుస్తోంది.

హీరో మహేష్ బాబు రెడీగా ఉన్నాసరే కొందరు కీలకమైన యాక్టర్స్ డేట్స్ దొరకలేదని, అందుకే షూటింగ్ వరసగా వాయిదా పడుతుందని తెలుస్తోంది. ఇప్పటికే జనవరి 13న సంక్రాంతికి రిలీజ్ అని ప్రకటించారు. కానీ ఈ వాయిదాలు చూస్తుంటే మాత్రం అది కష్టమేనేమో అనిపిస్తుంది. మరి మహేష్-త్రివిక్రమ్ కలిసి ఏం చేస్తారో చూడాలి?

(ఇదీ చదవండి: Jee Karda Review: 'జీ కర్దా' వెబ్ సిరీస్ తెలుగు రివ్యూ)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement