List of Upcoming Movies and Web Series Release On OTT And Theatres in June 4th Week - Sakshi
Sakshi News home page

Upcoming Movies: జూన్‌ నాలుగో వారంలో విడుదలవుతున్న సినిమాల లిస్ట్‌ ఇదిగో!

Published Mon, Jun 20 2022 6:56 PM | Last Updated on Tue, Jun 21 2022 8:59 AM

List Of 20 Upcoming Movies, Web Series Releasing In OTT And Theatres This Week - Sakshi

సమ్మర్‌ హాలీడేస్‌ అయిపోయాయి. స్కూళ్లు, కాలేజీలు తెరవడంతో పిల్లలు, యువత పుస్తకాలు తిరిగేసేందుకు రెడీ అవుతున్నారు. దీంతో బాక్సాఫీస్‌ దగ్గర పెద్ద సినిమాల సందడి తగ్గినట్లే కనిపిస్తోంది. భారీ బడ్జెట్‌ సినిమాలతో పోటీపడలేక వాయిదాపడ్డ చిన్న చిన్న సినిమాలు ఇప్పుడు రిలీజ్‌కు రెడీ అంటూ బాక్సాఫీస్‌ బరిలో దూకుతున్నాయి. ఈ క్రమంలో జూన్‌ నాలుగో వారంలో అటు థియేటర్‌లో, ఇటు ఓటీటీలో రిలీజ్‌ అవుతున్న సినిమాలేంటో ఓ లుక్కేయండి..

కొండా
సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ తెరకెక్కించిన చిత్రం కొండా. కొండా మురళి- సురేఖ దంపతుల జీవితకథ ఆధారంగా ఈ బయోపిక్‌ రూపుదిద్దుకుంది. సురేఖ పాత్రలో ఇర్రా మోర్‌, మురళి పాత్రలో త్రిగుణ్‌ నటించారు. ఈ సినిమా ఈ నెల 23న విడుదల కానుంది.

సమ్మతమే
తన ప్రతి సినిమాకు తెలుగు టైటిల్స్‌నే పెట్టుకుంటూ వస్తున్నాడు కిరణ్‌ అబ్బవరం. తాజాగా సమ్మతమే సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్నాడు. గోపీనాథ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో చాందినీ చౌదరి కథానాయిక. శేఖర్‌ చంద్ర సంగీతం అందిస్తున్నారు. జూన్‌ 24న ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది.

చోర్‌ బజార్‌
ప్రముఖ డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌ తనయుడు ఆకాశ్‌ పూరి కథానాయకుడిగా నటించిన చిత్రం చోర్‌ బజార్‌. జీవన్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం గెహాన సిప్పీ హీరోయిన్‌. సురేశ్‌ బొబ్బిలి సంగీతం అందించిన ఈ మూవీ జూన్‌ 24న రిలీజ్‌ కానుంది.

7 డేస్‌ 6 నైట్స్‌
తెలుగు చిత్రసీమకు ఎన్నో హిట్స్‌ అందించారు దర్శకనిర్మాత ఎంఎస్‌ రాజు. ఆయన దర్శకత్వం వహించిన తాజా చిత్రం 7 డేస్‌ 6 నైట్స్‌. సుమంత్‌ అశ్విన్‌ హీరోగా నటిస్తుండగా మెహర్‌ చాహల్‌ హీరోయిన్స్‌గా కనిపించనున్నారు. ఈ సినిమా జూన్‌ 24న రిలీజ్‌ అవుతోంది.

గ్యాంగ్‌స్టర్‌ గంగరాజు
లక్ష్‌ చదలవాడ హీరోగా నటించిన చిత్రం గ్యాంగ్‌స్టర్‌ గంగరాజు. వేదిక దత్‌ కథానాయిక. ఇషాన్‌ సూర్య దర్శకత్వం వహించిన ఈ మూవీ జూన్‌ 24న తెలుగు, తమిళ భాషల్లో విడుదలవుతోంది.

సదా నన్ను నడిపే
లంకా ప్రతీక్‌ ప్రేమ్‌ హీరోగా వైష్ణవి పట్వర్దన్‌ హీరోయిన్‌గా నటించిన చిత్రం సదా నన్ను నడిపే. ఈ సినిమాకు హీరో ప్రతీకే దర్శకుడు కావడం విశేషం. జూన్‌ 24న ఈ మూవీ బాక్సాఫీస్‌ దగ్గర సందడి చేయనుంది.

ఇవే కాకుండా సాఫ్ట్‌వేర్‌ బ్లూస్‌, కరణ్‌ అర్జున్‌ సహా తదితర సినిమాలు రిలీజవుతున్నాయి.

ఈ వారం ఓటీటీలో సందడి చేసే సినిమాలేంటంటే...

అమెజాన్‌ ప్రైమ్‌
సర్కారువారి పాట - జూన్‌ 23

ఆహా
మన్మథ లీల - జూన్‌ 24

సోనీ లివ్‌
నెంజుక్కు నీది (తమిళ్‌) - జూన్‌ 23
అవరోధ్‌ (హిందీ వెబ్‌ సిరీస్‌) - జూన్‌ 24

నెట్‌ఫ్లిక్స్‌
లవ్‌ అండ్‌ గెలాటో - జూన్‌ 22
మ్యాన్‌ వర్సెస్‌ బీ - జూన్‌ 24
కుట్టవుమ్‌ శిక్షాయుమ్‌ (మలయాళం) - జూన్‌ 24
గ్లామర్‌ గాళ్స్‌ - జూన్‌ 24
మనీ హెయిస్ట్‌ (కొరియన్‌)- జూన్‌ 24

హాట్‌స్టార్‌
డాక్టర్‌ స్ట్రేంజ్‌ - జూన్‌ 22

జీ5
ఫోరెన్సిక్‌ - జూన్‌ 24

చదవండి: హనీమూన్‌కు చెక్కేసిన నయనతార దంపతులు
‘విరాట పర్వం’ మూవీపై ప్రముఖ తమిళ డైరెక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement