ఫాదర్స్ డే స్పెషల్.. కూతురితో రామ్ చరణ్ క్యూట్ ఫొటో | Klin Kaara With Ram Charan, Father's Day Special Pic | Sakshi
Sakshi News home page

Ram Charan Klin Kaara: కూతురితో చరణ్.. ఇది కదా మెగా హ్యాపీనెస్

Published Sun, Jun 16 2024 1:33 PM

Klin Kaara With Ram Charan, Father's Day Special Pic

మెగా హీరో రామ్ చరణ్ నుంచి ఫాదర్స్ డే స్పెషల్ ఫొటో వచ్చేసింది. ఇప్పటికే కూతురు క్లీంకార బుడిబుడి అడుగులు వేస్తుండగా.. తాజాగా ఆమెని ఎత్తుకుని, అలా గాల్లోకి ఎగరేస్తూ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పిక్ చూస్తుంటే చరణ్- క్లీంకార మధ్య బాండింగ్ చూస్తుంటే మచ్చటేస్తోంది.

(ఇదీ చదవండి: Society Of The Snow Review: కన్నీళ్లు ఆపుకునే శక్తి ఉంటే ఈ సినిమా చూడండి)

2012లో రామ్ చరణ్‌కి పెళ్లవగా.. గతేడాది జూన్‌లో కూతురు పుట్టింది. ఈమెకు క్లీంకార అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుతున్నారు. ఇప్పటివరకు ముఖాన్ని చూపించకుండా దాచేశారు. సైడ్ లేదా బ్యాక్ నుంచి తీసిన కొన్ని ఫొటోలు మాత్రం వైరల్ అవుతున్నాయి. అలా ఇప్పుడు ఫాదర్స్ డే సందర్భంగా చరణ్-క్లీంకార ఫొటో సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్‌కి తెగ నచ్చేస్తోంది.

(ఇదీ చదవండి: ఊహించని పనిచేసి షాకిచ్చిన హీరో విశ్వక్ సేన్)

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement