లపతా లేడీస్‌ అచ్చం నా సినిమాలా ఉంది: డైరెక్టర్‌ తీవ్ర ఆరోపణలు Kiran Rao Laapataa Ladies similar to Ananth Mahadevan claims his 1999 film | Sakshi
Sakshi News home page

Laapataa Ladies: నా సినిమాను కాపీ కొట్టారు.. ఆ సీన్‌ సేమ్ టూ సేమ్: డైరెక్టర్‌

Published Sun, May 26 2024 6:34 PM | Last Updated on Mon, May 27 2024 9:15 AM

Kiran Rao Laapataa Ladies similar to Ananth Mahadevan claims his 1999 film

అమిర్‌ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు దర్శకత్వంలో వచ్చిన చిత్రం లపతా లేడీస్. థియేటర్లలో రిలీజైన ఈ చిత్రానికి ఆడియన్స్‌ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీ ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవుతోంది. మంచి టాక్‌ రావడంతో ఓటీటీలో దుమ్ములేపుతోంది. ఇటీవలే యానిమల్‌ చిత్రాన్ని దాటేసి అత్యధిక వ్యూయర్‌షిప్‌ను సొంతం చేసుకుంది. ఈ సినిమాకు అమిర్‌ ఖాన్‌ కూడా నిర్మాతగా ఉన్నారు. అయితే సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళ్తోన్న ఈ సినిమాపై ప్రముఖ డైరెక్టర్‌, జాతీయ అవార్డ్ గ్రహీత అనంత్‌ మహదేవన్‌ చేసిన కామెంట్స్‌ వైరలవుతున్నాయి. ఈ సినిమాలో సీన్స్‌ అచ్చం గున్‌గట్‌ కే పట్‌ ఖోల్‌ లాగే ఉన్నాయని అన్నారు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో అనంత్ మహదేవన్ మాట్లాడుతూ.. 'లపతా లేడీస్‌ చూశా.. ప్రారంభం నుంచి సినిమాలో చాలా సీన్స్‌ ఓకేలా ఉన్నాయి. మా సినిమాలో సిటీకి చెందిన ఓ అబ్బాయి పెళ్లి చేసుకోవడానికి గ్రామానికి వెళ్తాడు. ఘున్‌ఘట్‌ రైల్వే స్టేషన్‌లో  వధువును బెంచ్‌పై వేచి ఉండమని చెప్పి బయటికి వెళ్తాడు. ఆ తర్వాత తిరిగి వచ్చి మరో వధువుతో చేరతాడు. ఆ మహిళ ఘున్‌ఘట్‌లో ఉన్నందున పోలీసులు ఆమె ఫోటోను చూసే సన్నివేశం నా సినిమాలో ఉంది. ఇందులో పోలీసు పాత్రలో మరొకరు ఉన్నారు అంతే. మిగిలినదంతా సేమ్ టూ సే మ్. అంతే కాకుండా రైల్వే స్టేషన్‌లో వధువు ముసుగుతో కప్పి ఉన్న సీన్‌ అంతా మా సినిమాలాగే ఉంది.' అని అన్నారు. కొన్ని నెలల క్రితం వరకు యూట్యూబ్‌లో అందుబాటులో ఉన్న ఘున్‌ఘట్ కే పట్ ఖోల్ చిత్రం ఇప్పుడు లేదన్నారు.

స్పందించిన రైటర్

ల‌పతా లేడీస్ క‌థ రాసిన బిప్ల‌బ్ గోస్వామి ఈ విష‌యంపై స్పందించారు. నేను దశాబ్దం క్రిత‌మే ఈ కథ రాశానని తెలిపారు. నా క‌థ, స్క్రిప్ట్, డైలాగ్స్, క్యారెక్ట‌ర‌జేష‌న్, సీన్స్ అన్నీ వంద శాతం ఒరిజిన‌ల్‌గా ఉన్నాయని పేర్కొన్నారు. ఈ కథను ఎక్కడి నుంచి స్ఫూర్తి పొంద‌లేదని అన్నారు. అంతేకాకుండా అనంత్ మహదేవన్ జీ సినిమాని చూడలేదని వెల్లడించారు. ఈ చిత్రాన్ని 2001లో జరిగిన లపాతా లేడీస్ రైలు ప్రయాణంలో విడిపోయే ఇద్దరు యువ వధువుల కథ ఆధారంగా తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్, కిండ్లింగ్ పిక్చర్స్, జియో స్టూడియోస్ బ్యానర్‌పై అమీర్ ఖాన్, కిరణ్ రావు, జ్యోతి దేశ్ పాండే నిర్మించారు. ఈ చిత్రం మార్చి 1న థియేటర్లలో విడుదలైంది. ఆ తర్వాత నెట్‌ఫ్లిక్స్ స్ట్రీమింగ్ అవుతోంది.

 

 

 

 

 

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement