ఫిబ్రవరిలో ప్రారంభం? | kamal haasan and maniratnam shifting gears to kick start thug life regular shooting | Sakshi
Sakshi News home page

ఫిబ్రవరిలో ప్రారంభం?

Published Mon, Jan 8 2024 2:06 AM | Last Updated on Mon, Jan 8 2024 2:07 AM

kamal haasan and maniratnam shifting gears to kick start thug life regular shooting - Sakshi

‘నాయకన్‌’ (1987) (తెలుగులో నాయకుడు) వంటి హిట్‌ ఫిల్మ్‌ తర్వాత హీరో కమల్‌ హాసన్, దర్శకుడు మణిరత్నం కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమా ‘థగ్‌ లైఫ్‌’. ఈ సినిమాలో త్రిష, దుల్కర్‌ సల్మాన్, ‘జయం’ రవి కీలక పాత్రలు పోషించనున్నారు. కాగా ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ ఫిబ్రవరి చివరిలో లేదా మార్చి మొదట్లో ప్రారంభం కానుందనే టాక్‌ కోలీవుడ్‌లో వినిపిస్తోంది.

ఈ సినిమా ప్రీప్రోడక్షన్‌ వర్క్స్‌ పూర్తి కావచ్చాయని, ఇప్పటికే సెట్‌ వర్క్‌ జరుగుతోందని టాక్‌. కమల్‌ హాసన్, మణిరత్నం, మహేంద్రన్, శివ అనంత్‌ నిర్మించనున్న ఈ సినిమాకు ఏఆర్‌ రెహమాన్‌ సంగీత దర్శకుడు. మరోవైపు కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో రూపొందిన ‘ఇండియన్‌ 2’విడుదలకు సిద్ధమవుతోంది. అలాగే హెచ్‌ వినోద్‌ దర్శకత్వంలో కమల్‌హాసన్‌ హీరోగా నటించాల్సిన సినిమా ప్రకటన వచ్చిన సంగతి గుర్తుండే ఉంటుంది. అయితే ఈ సినిమాపై మరో అప్‌డేట్‌ రావాల్సి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement