Kalyaan Dhev Interesting Post On Sreeja Konidela Birthday, Post Viral - Sakshi
Sakshi News home page

Kalyaan Dhev: శ్రీజ బర్త్‌డే.. ఆసక్తికర పోస్ట్‌ను షేర్‌ చేసిన కల్యాణ్‌ దేవ్‌

Published Thu, Nov 10 2022 10:15 AM

Kalyaan Dhev Pens Quote On Sreeja Konidela Birthday Goes Viral - Sakshi

మెగాస్టార్‌ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ కొణిదెల గురించి ‍ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. మెగా ఫ్యామిలీ మెంబర్స్‌ అందిరిలాగే శ్రీజకు కూడా సోషల్‌ మీడియాలో మాంచి ఫాలోయింగ్‌ ఉంది. దీనికి తగ్గట్లే శ్రీజ కూడా సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన డైలీ రొటీన్స్‌తో పాటు ఫ్యామిలీ ఫోటోలను షేర్‌ చేస్తుంటుంది.

ఈ మధ్య కాలంలో శ్రీజ వ్యక్తిగత జీవితంపై నెట్టింట ఎప్పుడూ ఏదో ఒక చర్చ నడుస్తూనే ఉంది.ఇదిలా ఉండగా శ్రీజ బర్త్‌డే సందర్భంగా ఆమె భర్త కల్యాణ్‌ దేవ్‌ షేర్‌ చేసిన ఓ పోస్ట్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. నిన్న(నవంబర్‌9)న శ్రీజ బర్త్‌డే సందర్భంగా ప్రతిసారి ఆమెకు విషెస్‌ చెప్పే కల్యాణ్‌ దేవ్‌ ఈసారి మాత్రం​ ఎలాంటి పోస్ట్‌ చేయలేదు.

కానీ తన వెకేషన్‌కు సంబంధించిన ఓ ఫోటోను షేర్‌ చేస్తూ..లైఫ్‌  అంత ఈజీగా సాగదు.. మనమే స్ట్రాంగ్‌ అవ్వాలి అంటూ ఓ ఆసక్తికర పోస్ట్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. కల్యాణ్‌ దేవ్‌ షేర్‌ చేసిన ఈ పోస్ట్‌ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.  

Advertisement
 
Advertisement
 
Advertisement