ఆ సూపర్‌ హీరో ఆకలి కష్టాలు తెలుసా? | Sakshi
Sakshi News home page

ఆ టైంలో ఆక్వామ్యాన్‌ చాలా కష్టాలు పడ్డాడంట! 

Published Wed, Nov 11 2020 7:16 PM

Jason Momoa Problems After Game Of Thrones - Sakshi

న్యూయార్క్‌ : జాసన్‌ మొమోవా అంటే గుర్తురాకపోవచ్చు గానీ, ఆక్వామ్యాన్‌ అంటే మటుకు టక్కున గుర్తుపడతాం. ఆక్వామ్యాన్‌ సినిమా తర్వాత జాసన్‌కు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఏర్పడ్డారనటంలో ఎలాంటి సందేహం లేదు. సూపర్‌ హీరో అవతారమెత్తిన తర్వాత బాగానే సంపాదించారు కూడా. అయితే తను నటించిన ‘గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్’‌ టీవీ సిరీస్‌ అయిపోయిన తర్వాత తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నానని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన వెల్లడించారు. ( బిగ్‌బాస్‌: దీపావ‌ళికి హోస్ట్ ఎవ‌రంటే? )

‘‘గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌ అయిపోయిన తర్వాత నాకు పని లేదు. దీంతో మేము(కుటుంబం) తినడానికి లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాము. ఇద్దరు పిల్లలు, పీకల దాకా అప్పులు ఉన్నప్పుడు బ్రతుకు సాగించటం ఓ ఛాలెంజ్‌’’ అని చెప్పుకొచ్చారు. జాసన్‌ చాలా కాలం నుంచి కాలిఫోర్నియాలోని తన సొంత ఇంట్లో భార్య, నటి లీసా బోనెట్..‌ ఇద్దరు పిల్లలతో కలిసి ఉంటున్నారు. గ్రేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌లో ఖాల్‌ డ్రోగో పాత్రను చేశారాయన. 11 ఎపిసోడ్ల ఈ టీవీ సిరీస్‌కు 2012లో శుభం కార్డు పడింది. ( ‘ఉప్పెన’ మరో సాంగ్‌.. మెస్మరైస్‌ చేసిన దేవిశ్రీ )

Advertisement
 
Advertisement
 
Advertisement