Kalyan Ram Wife Swathi Background Details And Rare Facts Goes Viral - Sakshi
Sakshi News home page

Kalyan Ram: కల్యాణ్‌ రామ్‌ భార్య బ్యాక్‌గ్రౌండ్‌ గురించి తెలుసా?

Published Mon, Aug 8 2022 11:10 AM | Last Updated on Mon, Aug 8 2022 11:59 AM

Hero Kalyan Ram Wife Swathi Background Details Goes Viral In Social Media - Sakshi

నందమూరి కల్యాణ్‌ రామ్‌ హీరోగా నటించిన 'బింబిసార' సినిమా బాక్సాఫీస్‌ వద్ద కళకళలాడుతుంది.విడుదలైన రోజు నుంచే హిట్‌ టాక్‌తో దూసుకుపోతున్న ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. నందమూరి ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీకి వచ్చినా విభిన్నమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు కల్యాణ్‌ రామ్‌. అయితే ఆయన పర్సనల్‌ లైఫ్‌ గురించి చాలా మంది​కి తెలియదు. ఈ క్రమంలో పలువురు ఆయన వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకునేందుకు నెట్టింట సెర్చింగ్‌ మొదలుపెట్టారు.

ఇక ఆయన భార్య స్వాతి ఎవరు, ఆమె బ్యాక్‌గ్రౌండ్‌ ఏంటి అన్న వివరాలపై సోషల్‌ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.  కల్యాణ్‌రామ్‌కు 2006 ఆగస్టు 10న స్వాతి అనే అమ్మాయితో వివాహం జరిగింది. వీరిది పెద్దలు కుదిర్చిన సంబంధం. పెళ్లి చూపుల్లోనే స్వాతిని చూసి ఇష్టపడిన కల్యాణ్‌ రామ్‌ ఆమెనే పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టారట. ఇక ఆమె వృత్తిరీత్యా డాక్టర్‌.

కల్యాణ్‌ రామ్‌ భార్య ఫ్యామిలీ విషయానికి వస్తే వారిదీ సంపన్న కుటుంబమే. ఆమె తండ్రికి ఫార్మా రంగంతో పాటు పలు పరిశ్రమలు ఉన్నాయట. ఇక స్వాతి కూడా బిజినెస్‌ రంగంలోనే ఉన్నారు. ఆమెకు సొంతంగా వీఎఫ్‌ఎక్స్‌ సంస్థ ఉంది. బింబిసార సినిమాకు సంబంధించి పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు ఎక్కువ శాతం ఈ సంస్థలోనే జరిగినట్లు తెలుస్తోంది. ఇక కల్యాణ్‌రామ్‌-స్వాతి దంపతులకు అదైత, శౌర్య‌రామ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. చదవండి: 'బింబిసార' సినిమాపై అల్లు అర్జున్‌ రివ్యూ.. ‍ట్వీట్‌ వైరల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement