Bigg Boss 6 Telugu Episode Highlights: Serious Fight Between Rohit And Inaya Sultana In Ticket To Finale Task - Sakshi
Sakshi News home page

Bigg Boss 6 Telugu: ఆ ముగ్గురూ వేస్ట్‌, అంత భయమున్నప్పుడు బిగ్‌బాస్‌కు రాకూడదు: రేవంత్‌

Published Fri, Dec 2 2022 11:30 PM | Last Updated on Sat, Dec 3 2022 9:11 AM

Bigg Boss Telugu 6: Bigg Fight Between Rohit and Inaya Sultana - Sakshi

Bigg Boss 6 Telugu, Episode 90: 'టికెట్‌ టు ఫినాలే' ఛాలెంజ్‌ రేసులో రేవంత్‌, ఫైమా, ఆదిరెడ్డి, శ్రీహాన్‌, రోహిత్‌ ఐదుగురు మిగిలారు. అయితే తదుపరి ఛాలెంజ్‌లో వీరిలో నుంచి ముగ్గురు మాత్రమే పోటీపడాలన్నాడు బిగ్‌బాస్‌. దీంతో ఎవరికి వారు నేను తప్పుకోనంటే నేను తప్పుకోనంటూ వాదులాటకు దిగారు. దీంతో ఆ ముగ్గురు ఎవరో డిసైడ్‌ చేయండంటూ సంచాలకులైన ఇనయ, కీర్తి, శ్రీసత్యలపై భారం వేశాడు బిగ్‌బాస్‌. ఈ ముగ్గురు.. స్కోర్‌ బోర్డులో చివర్లో ఉన్న ఫైమా, రోహిత్‌, రేవంత్‌లను సెలక్ట్‌ చేశారు.

టాప్‌లో ఉన్నవాళ్లను తీసేసి వేరేవాళ్లకు ఛాన్స్‌ ఇవ్వడమేంటి? ఈ సీజన్‌లో ఇదే వరస్ట్‌ డెసిషన్‌ అని చిరాకుపడ్డాడు ఆది. ఆలోచనలో పడ్డ రోహిత్‌.. టాప్‌ పొజిషన్‌లో ఉన్న వాళ్లను తీసేసి చివర్లో ఉన్న తనను ఆడేందుకు సెలక్ట్‌ చేయడం కరెక్ట్‌ కాదని భావించి గేమ్‌ నుంచి స్వచ్ఛందంగా తప్పుకున్నట్లు ప్రకటించాడు. అంటే గేమ్‌ ఆడనని చెప్తున్నావా? అని ఇనయ అడగడంతో శ్రీహాన్‌ ఫైరయ్యాడు. ఆటలో నుంచి తప్పుకుంటున్నవాళ్లను ఎందుకు బతిమాలుతున్నావు? అందరికీ ఛాన్స్‌ ఇవ్వడానికి ఇది ఫన్‌డే గేమ్‌ కాదని చురకలంటించాడు. 

దీంతో వెనక్కు తగ్గిన సంచాలకులు తమ నిర్ణయం మార్చుకుని రేవంత్‌, శ్రీహాన్‌, ఆదిరెడ్డి ఆడుతున్నారని చెప్పారు. చివర్లో ఉన్న రోహిత్‌ ఆడను అన్నందున చివరి నుంచి రెండో స్థానంలో ఉన్న ఫైమాను కూడా తొలగించామని ఇనయ స్పష్టతనిచ్చింది. ఈ ఒక్కమాటతో గేమ్‌లో ఉన్నవాళ్లంతా నిప్పులు చెరిగారు. ఇంతకుముందు ఓమాట ఇప్పుడో మాట అంటూ సంచాలకులను తిట్టిపోశారు. రోహిత్‌ అయితే నా వల్ల ఫైమాను తొలగించామంటారేంటి? అంటూ ఇనయ మీద మండిపడ్డాడు. అయితే టాప్‌ 3 లేదంటే లాస్ట్‌లో ఉన్న 3 మెంబర్స్‌నే ఆడించాలనుకున్నాం అని సంచాలకులుగా చెప్తున్నా.. అది మీరెలా డిసైడ్‌ చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ గొడవ చిలికి చిలికి గాలివానలా మారింది.

అసలేం సంచాలకులు వీరు, ముగ్గురూ వేస్టే.. అంత భయమున్నప్పుడు బిగ్‌బాస్‌కు రాకూడదు అంటూ రేవంత్‌ మరోసారి తన నోటిదురుసు ప్రదర్శించాడు. అనంతరం బిగ్‌బాస్‌ ఇచ్చిన ఛాలెంజ్‌లో రేవంత్‌ గెలవగా శ్రీహాన్‌, ఆది తర్వాతి రెండు స్థానాల్లో నిలిచారు. సెకండ్‌ లెవల్‌ ముగిసే సమయానికి రేవంత్‌ 15, శ్రీహాన్‌, ఆది 14, ఫైమా 7, రోహిత్‌ 6 పాయింట్లతో వరుస స్థానాల్లో ఉన్నారు. సమాన పాయింట్లు వచ్చిన ఆది, శ్రీహాన్‌లకు ఓ గేమ్‌ ఇవ్వగా అందులో శ్రీహాన్‌ గెలిచాడు. దీంతో మొదటి రెండు స్థానాల్లో ఉన్న రేవంత్‌, శ్రీహాన్‌ టికెట్‌ టు ఫినాలే రేస్‌ కోసం పోటీపడ్డారు. ఇకపోతే శ్రీహాన్‌ టికెట్‌ టు ఫినాలే సొంతం చేసుకుని మొదటి ఫైనలిస్టుగా ఎంపికైనట్లు తెలుస్తోంది.

చదవండి: జూబ్లీహిల్స్‌లో ప్రభాస్‌కు 84 ఎకరాల ఫామ్‌హౌస్‌
ఈ సీజన్‌లో అన్నింటికన్నా పరమ చెత్త నిర్ణయం ఇదే: ఆది

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement