ఎన్నికల ముందు బిగ్ షాకిచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ! Bigg Boss Fame Sambhavna Seth QUITS Aam Aadmi Party Before Elections | Sakshi
Sakshi News home page

Sambhavna Seth: ఎన్నికల ముందు బిగ్ షాకిచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ!

Published Sun, Mar 10 2024 12:10 PM | Last Updated on Sun, Mar 10 2024 12:26 PM

Bigg Boss Actress Sambhavna Seth QUITS Aam Aadmi Party Before Elections - Sakshi

లోక్‌సభ ఎన్నికల ముందు ప్రముఖ నటి సంభవనా సేథ్ బిగ్ షాకిచ్చింది. గతేడాది అరవింద్ కేజ్రీవాల్ సమక్షంలో ఆమ్ ఆద్మీ పార్టీలో చేరిన నటి సంభవనా సేథ్ తాజాగా ఆ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని ఆమె తన ట్విటర్ వేదికగా వెల్లడించారు. ఆమె తన తప్పును గ్రహించానని.. అందువల్ల ఇకపై ఆప్‌లో  భాగం కాలేనని పేర్కొంది. దీంతో లోక్‌ సభ ఎన్నికల ముందు ఆప్‌కు గట్టి షాక్ తగిలింది. 

సంభావన సేత్..  "నా దేశం కోసం సేవ చేయాలనే ఉత్సాహంతో సంవత్సరం క్రితం ఆమ్‌ ఆద్మీ పార్టీలో చేరాను.  మనం ఎంత తెలివిగా నిర్ణయం తీసుకున్నా సరే. మనుషులం కాబట్టి చివరికీ ఏదో ఒక తప్పు చేస్తాం. నా తప్పు తెలుసుకుని ఆప్ పార్చీ నుంచి నిష్క్రమిస్తున్నా' అని ట్వీట్‌లో రాస్తూ అరవింద్ కేజ్రీవాల్‌ను ట్యాగ్ చేసింది. ఇది చూసిన కొందరు నెటిజన్స్ గుడ్ డెసిషన్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. 

కాగా.. సంభావన సేత్ బాలీవుడ్‌లో పలు చిత్రాలతో పాటు రియాలిటీ షోలలో కూడా కనిపించింది. బిగ్‌బాస్‌ సీజన్-8లో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టింది. 2006లో '36 చైనా టౌన్'లో అనే సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది. ఈ చిత్రంలో కరీనా కపూర్, షాహిద్ కపూర్ జంటగా నటించారు. ముఖ్యంగా బాలీవుడ్ సినిమాల్లో ఐటమ్‌ సాంగ్‌లతో పేరు సంపాదించుకుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement