Bigg Boss 6 Telugu: RJ Surya Eliminated From BB Show - Sakshi
Sakshi News home page

Bigg Boss Telugu 6: భార్యాభర్తలు సేఫ్‌, అతడు ఎలిమినేట్‌..

Published Sat, Oct 29 2022 3:26 PM | Last Updated on Sat, Oct 29 2022 4:00 PM

Bigg Boss 6 Telugu: RJ Surya Eliminated From BB Show - Sakshi

బిగ్‌బాస్‌ రియాలిటీ షోలో అన్నీ మనం అనుకున్నట్లు, ఊహించినట్లు జరగవు. కొన్నిసార్లు సడన్‌ ట్విస్టులు, షాకులిస్తుంటాడు బిగ్‌బాస్‌. ఈవారం కూడా అదే జరగబోతోంది. ఊహించని కంటెస్టెంట్‌ ఎలిమినేట్‌ కాబోతున్నాడట. ఎనిమిదో వారం నామినేషన్‌లో 14 మంది కంటెస్టెంట్లు ఉన్నారు. దీంతో డబుల్‌ ఎలిమినేషన్‌ ఉండొచ్చేమోనని ఊహించారు. కానీ బిగ్‌బాస్‌ టీమ్‌ సింగిల్‌ ఎలిమినేషన్‌కే మొగ్గు చూపిందట. మెరీనా, రోహిత్‌, రాజ్‌, వాసంతి, కీర్తి.. వీరిలో ఎవరైనా ఎలిమినేట్‌ కావొచ్చని అంతా అనుకున్నారు.

అనూహ్యంగా వీరందరూ సేవ్‌ అయ్యి సూర్య ఎలిమినేట్‌ అయ్యాడట. ఈ విషయాన్ని లీకువీరులు సోషల్‌ మీడియాలో దరువేసి మరీ చెప్తున్నారు. నిజానికి ప్రస్తుతం ఉన్న చాలామంది కంటెస్టెంట్ల కంటే సూర్య కొంత బెటర్‌. కానీ ఆరోహి, ఇనయలతో లవ్‌ ట్రాక్‌ నడిపి అతడు తన పేరును చెడగొట్టుకున్నాడు. పులిహోర రాజాగా పేరు తెచ్చుకున్నాడు. ఎంత గేమ్‌ ఆడినా, ఎంటర్‌టైన్‌ చేసినా కేవలం ఈ ట్రాకుల వల్లే అతడి గ్రాఫ్‌ దారుణంగా పడిపోయింది. ఫలితంగా అతడు ఎలిమినేట్‌ అయ్యాడు. మంచి పేరుతో హౌస్‌లో అడుగుపెట్టిన సూర్య చెడ్డ పేరు మూటగట్టుకుని బయటకు వస్తున్నాడు.

చదవండి: ఇనయ- శ్రీహాన్‌ మధ్య మళ్లీ లొల్లి.. ఇలాగైతే సీజన్‌ హిట్‌ అంటున్న గీతక్క

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement