'వెనకవైపు నుంచి అనుచితంగా తాకాడు'.. టాలీవుడ్ హీరోయిన్! | Avika Gor Recalls Inappropriately Touched From Behind By Her Bodyguard | Sakshi
Sakshi News home page

Avika Gor: వెనక వైపు అసభ్యంగా తాకాడు.. రెండోసారి కూడా!

Published Mon, Jun 17 2024 7:28 PM

Avika Gor Recalls Inappropriately Touched From Behind By Her Bodyguard

ఉయ్యాలా జంపాలా చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ముద్దుగుమ్మ అవికా గోర్. ఈ సినిమాలో రాజ్ తరుణ్ సరసన మెప్పించింది. ఆ తర్వాత లక్ష్మి రావే మా ఇంటికి, సినిమా చూపిస్తా మావ, తను నేను, ఎక్కడికీ పోతావు చిన్నవాడా, రాజుగారి గది-3 సినిమాలతో మెప్పించింది. గతేడాది వధువు అనే వెబ్ సిరీస్‌తో అలరించింది. 

బాలికా వధు(చిన్నారి పెళ్లికూతురు) సిరీయల్ గుర్తింపు తెచ్చుకున్న అవికా గోర్.. ప్రస్తుతం బాలీవుడ్‌లో బిజీగా ఉంది. ఆమె ప్రస్తుతం  బ్లడీ ఇష్క్‌లో అనే చిత్రంలో నటిస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన బాలీవుడ్ భామ ఒక ఈవెంట్‌లో ఎదురైన చేదు అనుభవాన్ని పంచుకుంది. తాను వేదికపై వెళ్లే క్రమంలో వెనకవైపున అసభ్యంగా తాకాడని తెలిపింది. తిరిగి చూస్తే అక్కడ కేవలం తన బాడీగార్డ్‌ మాత్రమే ఉన్నారని వెల్లడించింది. అతను సారీ చెప్పడంతో ఆ సంగతి వదిలేశానని చెప్పుకొచ్చింది.

అయితే ఇదే సంఘటన రెండోసారి కూడా జరిగిందని అవికా గోర్ తెలిపింది.  అయితే ఈసారి నన్ను పట్టుకోకముందే బాడీగార్డ్ చేయి పట్టుకున్నానని అవికా పేర్కొంది. అసలేం ఏం చేస్తున్నావ్ గట్టిగా నిలదీయడంచో క్షమాపణలు చెప్పాడని వెల్లడించింది. దీంతో అతన్ని వదిలిపెట్టాటని వివరించింది. అలాంటి వ్యక్తులను ఎదుర్కోవడానికి ధైర్యం ఉండాలని ఆమె అన్నారు. నాకే గనుక ధైర్యం ఉంటే ఈపాటికి చాలా మందిని తిరిగి కొట్టేదానినని అవికా గోర్ నవ్వుతూ చెప్పింది. 
 

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement