ప్రభాస్ కల్కి 2898 ఏడీ.. ఆరో షోకు అనుమతిచ్చిన ఏపీ ప్రభుత్వం | Andhra Pradesh Government Gives Permission 6 Shows For Kalki 2898 AD | Sakshi
Sakshi News home page

Kalki 2898 AD Movie: కల్కి 2898 ఏడీ.. ఆరో ఆటకు అనుమతిచ్చిన ఏపీ ప్రభుత్వం

Published Wed, Jun 26 2024 8:10 PM | Last Updated on Wed, Jun 26 2024 8:59 PM

AP Govt Gives Permission To Prabhas Kalki 2898 AD Benefit Shows

ప్రభాస్ కల్కి 2898 ఏడీ సినిమాకు ఏపీ ప్రభుత్వం ఆరో ఆటకు అనుమతులిచ్చారు. ఈ నెల 27న రిలీజవుతోన్న ఈ సినిమాను గురువారం ఉదయం 4.30 నుంచి 8 గంటల వరకు  బెనిఫిట్ షోలు ప్రదర్శించేందుకు పర్మిషన్ ఇచ్చారు. ఈ మేరకు  హోంశాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ హరీష్ కుమార్ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు.

టికెట్ ధరల పెంపు

ఇప్పటికే ప్రభాస్ కల్కి 2898 ఏడీ చిత్రానికి రెండు వారాల పాటు టికెట్స్ ధరలు పెంచుకునేందుకు ‍అనుమతిచ్చారు.  మల్టీప్లెక్స్‌లో ఒక్కో టికెట్‌పైన అదనంగా రు.125 వసూలు చేయనున్నారు. సింగిల్ స్క్రీన్‌ థియేటర్లలో అదనంగా రూ.75 పెంచుకునేలా ఉత్తర్వులిచ్చారు. అయితే గత ఐదేళ్ల లో ఎన్నడూ లేని భారీ ప్రయోజనాలు చేకూరుస్తూ ఏపీ ప్రభుత్వం ఏకంగా 2 జీవోలు జారీ చేయడం గమనార్హం. రాబోయే రెండు వారాల పాటు ఏపీలో అదనపు ధరలతో పాటు కల్కి సినిమాను 5 షోలు ప్రదర్శించనున్నారు.

భారీ అంచనాలు

ప్రభాస్- నాగ్ అశ్విన్‌ కాంబోలో వస్తోన్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. వైజయంతి మూవీస్ బ్యానర్‌లో అశ్వనీదత్‌ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఈ మూవీలో అమితాబ్, దీపికా పదుకొణె, కమల్ హాసన్, దిశా పటానీ లాంటి సూపర్ స్టార్స్ నటించారు. సైన్స్‌ ఫిక్షన్‌గా వస్తోన్న ఈ సినిమా కోసం రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement