ఈమె తెలుగు హీరోయిన్, పక్కనే ఉన్నది స్టార్ డైరెక్టర్.. ఎవరో గుర్తుపట్టారా? Actress Sangeetha Movies And Family Details | Sakshi
Sakshi News home page

Guess The Actress: తెలుగులో బోలెడన్ని సినిమాలు చేసిన బ్యూటీ.. ఇప్పుడేమో అలా!

Published Thu, Nov 16 2023 9:47 PM | Last Updated on Fri, Nov 17 2023 9:15 AM

Actress Sangeetha Movies And Family Details - Sakshi

ఈ బ్యూటీని గుర్తుపట్టారా? కచ్చితంగా గుర్తుండకపోవచ్చు. ఎందుకంటే ఈ ఫొటో అప్పుడెప్పుడో 28 ఏళ్ల క్రితం తీసుకున్నది. ఈ బ్యూటీ తెలుగులో దాదాపు పదేళ్ల పాటు సినిమాలు చేసింది. కెరీర్ పరంగా మంచి ఫామ్‌లో ఉన్న టైంలోనే ఓ సింగర్‌ని పెళ్లి చేసేసుకుంది. ఆ తర్వాత కారణమేంటో తెలీదు గానీ తెలుగు మూవీస్‌ని పక్కనబెట్టేసింది. ఇంతలా చెప్పాం కదా.. మరి ఈమె ఎవరో కనిపెట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా?

పైన ఫొటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు సంగీత. అవును మీరనుకున్నది కరెక్టే. ఖడ్గం, పెళ్లాం ఊరెళితే, సంక్రాంతి తదితర సినిమాల్లో కనిపించిన బ్యూటీనే ఈ సంగీత. తమిళనాడులోని చెన్నైలో పుట్టిపెరిగిన ఈ ముద్దుగుమ్మ.. 1997లో 'గంగోత్రి' అనే మలయాళ మూవీతో నటిగా పరిచయమైంది. అదే ఏడాది కన్నడ, తర్వాతి సంవత్సరం తమిళంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇండస్ట్రీలోకి వచ్చిన రెండేళ్ల తర్వాత అంటే 1999లో తెలుగులోకి ఎంటరైంది.

'ఆశల సందడి' సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సంగీత.. ఆ తర్వాత నవ్వుతూ బతకాలిరా, మా ఆయన సుందరయ్య తదితర చిత్రాల్లో నటించింది. కాకపోతే 'ఖడ్గం'తో మంచి ఫేమ్ తెచ్చుకుంది. అనంతరం పెళ్లాం ఊరెళ్తే, ఆయుధం, ఖుషిఖుషీగా, విజయేంద్రవర్మ, సంక్రాంతి, మా ఆయన చంటిపిల్లాడు తదితర చిత్రాలు చేసింది. 2010లో 'కారా మజాకా' చేసిన తర్వాత తెలుగు సినిమాలు చేయడం తగ్గించేసింది. మళ్లీ 2020లో 'సరిలేరు నీకెవ్వరు'తో రీఎంట్రీ ఇచ్చింది. 'ఆచార్య'లో సాంగ్, 'మసూద'లో ఫుల్ లెంగ్త్ పాత్రలో నటించింది. 

సంగీత వ్యక్తిగత జీవితానికొస్తే.. 2009లో తమిళనాడుకు చెందిన సింగర్ క్రిష్‌ని పెళ్లి చేసుకుంది. వీళ్ల ప్రేమకు గుర్తుగా శివయ్య అనే కొడుకు పుట్టాడు. తెలుగు సినిమాల్లో ఈమె పేరు సంగీత అయినప్పటికీ.. మలయాళంలో రషిక, కన్నడలో దీప్తి అనే స్క్రీన్ నేమ్‌తో సినిమాలు చేసింది. ఇకపోతే పైన ఫొటోలో ఈమెతో పాటు ఉన్నది తమిళ స్టార్ డైరెక్టర్ వెంకట్ ప్రభు. వీళ్లిద్దరి ఫ్రెండ్స్ కావడంతో అప్పట్లో ఈ ఫొటో తీసుకుంది. తాజాగా వెంకట్ ప్రభు పుట్టినరోజు సందర్భంగా ఈ పిక్ పోస్ట్ చేసింది. సో అదన్నమాట విషయం.

No comments yet. Be the first to comment!
Add a comment
1
India
7020 / 58
odi
2
Australia
5309 / 45
odi
3
South Africa
4062 / 37
odi
4
Pakistan
3922 / 36
odi
5
New Zealand
4708 / 46
odi
6
England
3934 / 41
odi
7
Sri Lanka
4947 / 55
odi
8
Bangladesh
4417 / 50
odi
9
Afghanistan
2845 / 35
odi
10
West Indies
3109 / 44
odi
View Team Ranking
Advertisement
 
Advertisement
 
Advertisement