అభిమాని వింత కోరిక తీర్చిన 'గ్యాంగ్ లీడర్' హీరోయిన్! Actress Priyanka Mohan Nails Pic Request By Unknown Fan | Sakshi
Sakshi News home page

Priyanka Mohan: అలాంటి ప్రశ్న.. ఊహించని ఫొటో పోస్ట్ చేసిన హీరోయిన్

Published Mon, Feb 26 2024 9:21 PM | Last Updated on Mon, Feb 26 2024 9:21 PM

Actress Priyanka Mohan Nails Pic Request By Unknown Fan - Sakshi

హీరోయిన్ ప్రియాంక మోహన్.. అభిమాని అడిగిన వింత ప్రశ్నకు సమాధానమిచ్చింది. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సాధారణంగా ఇన్ స్టాలో పలువురు సెలబ్రిటీలు అప్పుడప్పుడు 'ఆస్క్ ఎనీ థింగ్' పేరు ఫన్ సెషన్ లాంటిది పెడుతుంటారు. అయితే కొందరు ఆకతాయులు ఫన్నీ ప్రశ్నల్లాంటివి అడుగుతుంటారు. తాజాగా ప్రియాంక మోహన్ విషయంలో అలాంటి అనుభవమే ఎదురైంది. ఇంతకీ అసలేం జరిగింది?

(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'ఊరు పేరు భైరవకోన'.. స్ట్రీమింగ్ అప్పుడేనా?)

నాని' గ్యాంగ్ లీడర్' సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ ప్రియాంక మోహన్.. ఆ తర్వాత 'శ్రీకారం' అనే మూవీలో నటించింది. ఆ తర్వాత ఏమైందో ఏమో గానీ పూర్తిగా తమిళంకే పరిమితమైపోయింది. మళ్లీ ఇప్పుడు 'ఓజీ', 'సరిపోదా శనివారం' లాంటి తెలుగు చిత్రాలు చేస్తోంది. ఈ ఏడాది ఆగస్టు, సెప్టెంబరులో ఈ రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. 

సరే ఇదంతా పక్కనబెడితే తాజాగా ఇన్ స్టాలో ప్రియాంక మోహన్.. 'ఆస్క్ ఎనీథింగ్' అని చిన్న ఫన్ సెషన్ పెట్టింది. ఇందులో ఓ నెటిజన్/అభిమాని.. 'మీ గోళ్లు చూపించండి మేడమ్' అని అడిగాడు. దీనికి బదులిచ్చిన ప్రియాంక.. తన చేతిని స్క్రీన్ షాట్ తీసి పోస్ట్ చేసింది. దీంతో సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి. 'వాడు ఏ ఉద్దేశంతో అడిగాడో ఏంటో' అని పలువురు నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 32 సినిమాలు.. అవేంటో తెలుసా?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement