దర్శన్‌కి ఆ సమస్య.. అందుకే అతడితో జాగ్రత్తగా మాట్లాడతారు: నటి అనూష | Actress Anusha Rai Comments On Darshan's Arrest And His Behaviour | Sakshi
Sakshi News home page

Darshan: హత్య కేసులో దర్శన్.. మరో కన్నడ నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Published Sat, Jun 22 2024 12:36 PM | Last Updated on Sat, Jun 22 2024 1:27 PM

Actress Anusha Rai Comments On Darshan Arrest And His Behaviour

కొన్నిరోజుల క్రితం కన్నడ హీరో దర్శన్ అరెస్ట్ కావడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తనని అభిమానించే ఓ వ్యక్తిని అత్యంత కిరాతకంగా చంపాడనే ఆరోపణలతో పోలీసులు అరెస్ట్ చేశారు. జైల్లో పెట్టి దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే సంచలన నిజాలు బయటకొస్తున్నాయి. మరోవైపు దర్శన్‌తో కలిసి పనిచేసిన కొందరు లేడీ యాక్టర్స్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేస్తున్నారు. మొన్నీ మధ్యే హీరోయిన్ సంజనా గల్రానీ దర్శన్ ప్రవర్తన గురించి చెప్పగా, తాజాగా నటి అనూష రాయ్.. దర్శన్ ఇతరులతో ఎలా ఉంటాడో చెప్పుకొచ్చింది.

(ఇదీ చదవండి: ప్రభాస్ 'కల్కి'.. ఎవరెవరికీ ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారు?)

'హత్య కేసులో దర్శన్ అరెస్ట్ కావడం ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. ఎందుకంటే ఆయన(దర్శన్) అందరినీ కేరింగ్‌గా చూసుకుంటాడు. కాకపోతే ఆయనకు అప్పుడప్పుడు కోప్పడటం లాంటి సమస్య ఉంది. దీంతో అందరూ చాలా జాగ్రత్తగా మాట్లాడతారు. నేను మాట్లాడినప్పుడు కూడా నా ఫరిది దాటకుండా మాట్లాడాను. తనకు ఈ సమస్య ఉందని దర్శన్ గతంలో ఓ ఇంటర్వ్యూలోనే చెప్పాడు. అయితే దర్శన్‌కి సంబంధం ఉందనే విషయం మాత్రం నాకు తెలియదు. దర్శన్‌పై కోపం ఉంటే ఏమైనా అనుకోండి గానీ ఆయన భార్య, కొడుకుని మాత్రం తిట్టడం కరెక్ట్ కాదు.' అని అనుష రాయ్ చెప్పుకొచ్చింది.

కర్ణాటకలోని చిత్రదుర్గకి చెందిన రేణుకాస్వామి.. దర్శన్‌కి వీరాభిమాని. అయితే తన అభిమాన హీరో కుటుంబంలో కలహాలకు కారణం పవిత్ర గౌడనే అని భావించిన రేణుకాస్వామి.. ఆమెకు అసభ్య వీడియోలు పంపించాడు. ఈ విషయాన్ని పవిత్ర దర్శన్‌కి చెప్పగా.. ఇతడు దారుణంగా టార్చర్ పెట్టి మరీ చంపేశాడు. పోస్ట్ మార్టం రిపోర్ట్స్ ప్రకారం రేణుకాస్వామి శరీరంపై 15కి గాయాలు, కరెంట్ షాక్ ఇచ్చినట్లు గుర్తులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఈ కేసులో దర్శన్, పవిత్రతో పాటు దాదాపు 11 మందికి పైగా జైల్లో ఉ‍న్నారు.

(ఇదీ చదవండి: కాబోయే భర్తకు కారు గిఫ్ట్ ఇచ్చిన బిగ్‌బాస్ శోభాశెట్టి.. రేటు ఎంతో తెలుసా?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement