మీకు మీరే నిజమైన స్నేహితుడు, మీరే అసలైన శత్రువు | Best friend and Biggest Enemy Both Are In Yourself | Sakshi
Sakshi News home page

మీకు మీరే నిజమైన స్నేహితుడు, మీరే అసలైన శత్రువు

Published Sun, Aug 6 2023 9:17 AM | Last Updated on Sun, Aug 6 2023 11:11 AM

Best friend and Biggest Enemy Both Are In Yourself - Sakshi

సమాజం ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య మానసిక రోగం. నిజమైన బయటకు చెప్పుకోలేం కానీ.. చుట్టున్న ప్రపంచంలో ఎంతో మంది మానసిక రోగులు... నాతో సహ. అయితే ఒక్కొక్కరిలో ఒక్కో రకమైన సమస్య ఉంది. కొందరు నియంత్రించుకోవచ్చు. మరికొందరు సమస్యలో పీకల్లోతులో ఇరుక్కుపోవచ్చు. ఎలా అర్థం చేసుకోవాలి? ఎలా బయటపడాలి? 

మన చుట్టున్న ప్రపంచంలో భౌతికంగా ఒక్కొక్కరు ఒక్కోలా కనిపిస్తారు. కొందరు ఎత్తుంటారు, మరికొందరు చిన్నగా ఉంటారు. కొందరు అందంగా కనిపిస్తారు. మరికొందరు అందంగా కనిపించేందుకు ఆరాటపడతారు. భౌతికంగానే కాదు, మానసికంగా కూడా చాలా తేడాలుంటాయి. భౌతికంగా గొప్పగా కనిపించడం వేరు, మానసికంగా వ్యక్తిత్వంలో ఉన్నతంగా ఉండడం వేరు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో నిలబడాలంటే ఎంతో శక్తి కావాలి. కానీ  మన చుట్టున్న వారిలో కొందరు ఈ పోటీని తట్టుకోలేక ఒత్తిడికి గురయి మానసిక సమస్యలు ఎదుర్కొంటారు. అసలు సైకాలజికల్‌గా సమస్యలేంటాయి? ఎన్ని స్థాయిలు ఉన్నాయి?

లెవల్‌ - 1 - (అయోమయం, గందరగోళం)

  • మనం ఈ పోటీ ప్రపంచంలో గెలవాలన్న ఆరాటం
  • ఈ పోటీలో ఏమవుతుందో అన్న భయం, ఆందోళన
  • సరైన దారిలో గెలవలేం కాబట్టి ప్రత్యామ్నయాల కోసం వెతుకులాట
  • పక్కదారులు పట్టే ఆలోచనలు, అదుపు తప్పే మనసు
  • చెడు అలవాట్లకు బానిస (డ్రగ్స్‌, మద్యం, పోర్నో, మొబైల్‌ అడిక్షన్‌)
  • ఇతరులను విమర్శించడం, నేనే కరెక్ట్‌ అనుకోవడం
  • నచ్చజెప్పడానికి ఎవరు (అమ్మ, నాన్నతో సహా) ప్రయత్నించినా.. వారు చెప్పేదంతా తప్పు అనుకోవడం
  • వాదించడం, గొడవ పడడం, వక్రమార్గంలోనైనా గెలవాలని తాపత్రయపడడం

లెవల్‌ - 1(అయోమయం, గందరగోళం)లో పరిశీలనలు

  • ఎలాంటి పాజిటివిటీ ఉండదు
  • వీళ్లంతట వీళ్లే సమస్య నుంచి ఎప్పటికీ బయటకు రాలేదు
  • ఏదో ఒక ప్రయత్నం చేస్తే తప్ప మార్పు రాదు
  • ఎవరో ఒకరు వీళ్లను  బయటకు తీసుకురాగలిగితే తప్ప ఇలాంటి వాళ్లు సమస్య నుంచి బయటకు రాలేరు

లెవల్‌ - 2 - కార్యసాధకులు, విజేతలు - లక్షణాలు

  • ఏం నేర్చుకోవాలి? ఎలా సాధించాలి?
  • ఎలాంటి కఠిన పరిస్థితులకయినా అలవాటు పడే, సర్దుకునే నైజం
  • నేను గెలవాలి, నాకున్న నైపుణ్యాలు ఎలా ఉపయోగపడతాయి?
  • మరింత ముందుకు వెళ్లాలంటే ఏం నేర్చుకోవాలి? ఏం తెలుసుకోవాలి?
  • చుట్టున్న సమాజాన్ని ఎలా మంచి కోసం వినియోగించుకోవాలి?
  • అందరినీ కలుపుకుని ముందుకు వెళ్లేలా నేనేం చేయాలి?
  • నేను గెలుస్తాను సరే, మరికొంతమందికి ఎలా సాయ పడగలను? 

లెవల్‌ - 2 - కార్యసాధకులు, విజేతలు - పరిశీలనలు

  • మన చుట్టున్న విజేతల్లో ఇదే మీరు చూస్తారు. 
  • మన మధ్యనే ఉంటారు, మనం ఊహించలేనంత ముందుకు వెళతారు. 
  • సమాజాన్ని ఔపాసన పట్టేస్తారు, మనకు కనిపించని అవకాశాలను అందిపుచ్చుకుంటారు 
  • ఎంచుకున్న మార్గంలో అత్యున్నత దశకు చేరుకుంటారు
  • నలుగురికి మేలు చేసే ఎంటర్‌ప్రెన్యూర్లుగా మారతారు
  • సంపద సృష్టిస్తారు, తాము గెలిచి మరొకరికి మార్గదర్శకంగా మారతారు
  • ఎంతో మంది సక్సెస్‌ ఫుల్‌ లీడర్లలో కనిపించే సీక్రెట్‌

ఇంతటితోనే ముగుస్తుందా? ఇంతకంటే అత్యున్నత దశ ఏమి లేదా? కచ్చితంగా ఉంది. సంపదతోనే అంతా ముగియదు. ఆ తర్వాత ఇంకేదైనా చేయాలని కలిగే అనుభూతే అత్యున్నత దశ. 

మూడో లెవల్‌ - మహాత్ములు - లక్షణాలు

  • నేను ఏంటీ అన్నది పక్కనబెడతారు
  • నా సమస్య అంటూ ఏదీ ఉండదు
  • నేను ఈ సమాజానికి ఏం చేయగలను అన్నది మాత్రమే భావన
  • ప్రతీ ఆలోచనలో తన నుంచి ఏదో ఒక సందేశం ఇతరులకు చేరాలన్న తాపత్రయం
  • మూడో లెవల్‌ - మహాత్ములు - పరిశీలనలు

ఇదేమీ వైరాగ్యం కాదు, ఇదొక అద్భుతమైన స్థాయి. రమణ మహర్షినే చూడండి, ఆయనకు ఏ ఆస్తులు లేకపోవచ్చు, కానీ ప్రపంచమే ఆయనది. మనసును నియంత్రించుకోగల శక్తిని, ఆలోచనలను పెంచుకోగల యుక్తిని తెలుసుకున్నారు.

మూడో లెవల్‌ - మహాత్ములు - పరిశీలనలు

  • ఇలాంటి వారు తక్కువగా మాట్లాడతారు, ఎక్కువగా గమనిస్తారు, చదువుతారు. 
  • ధ్యానం, వ్యాయామం, యోగ ముద్రతో మనస్సును శాంతంగా మరియు స్థిరంగా ఉంచుకుంటారు
  • ప్రతి రోజు.. వర్తమానంలో జీవిస్తుంటారు
  • నిజమైన ఆలోచనల మధ్య అన్ని భ్రమలను వీడి పూర్తి పాజిటివిటీతో జీవిస్తుంటారు
  • ఎలాంటి ఆడంబరాలుండవు, ఏది ఎంత అవసరమో అంతే తీసుకుంటారు
  • ఏం ఆశించకుండా ఇంకొకరికి సాయం చేస్తారు,
  • అయితే ఇక్కడ సంపద అనేది మానసిక సాయం
  • సలహాలు, మార్గనిర్దేశనం, పాజిటివిటీని పెంపొందించే మాటల రూపంలో ఉంటుంది.

ఈ స్థాయిలోకి అందరూ రాకపోవచ్చు కానీ ప్రయత్నిస్తే ప్రతీ ఒక్కరు రెండో స్థాయిలోకి రావొచ్చు. మీరు మారండి. మారను అనుకోవడమే కష్టం. ఎలా మారాలి? ఎందుకు మారాలి? ఎంత వరకు మారాలి? ఈ ప్రశ్నలన్నింటికీ మీలోనే సమాధానాలున్నాయి. మార్పు ఎలా ఉంటుందన్నది మీ ఇష్టం. 

(డాక్టర్‌ మృదుల, ప్రముఖ సైకాలజిస్టు, లైఫ్‌ కోచ్‌, సర్టిఫైడ్‌ కౌన్సిలర్‌ (నేషనల్‌ కెరియర్‌ సర్వీస్‌, కార్మిక ఉపాధి శాఖ), NLP ప్రాక్టీషనర్‌, సర్టిఫైడ్‌ లర్నింగ్‌ & డెవలప్‌మెంట్‌ మేనేజర్‌, సర్టిఫైడ్‌ ఇన్‌ కాగ్నిటివ్‌ బిహేవియరల్‌ థెరపీ ప్రాక్టీషనర్‌, సర్టిఫైడ్‌ ఇన్‌ ఎమోషనల్‌ ఇంటలిజెన్స్‌, సైకాలజీలో పీహెచ్‌డీ చేశారు, ఈ రంగంలో 20 ఏళ్లుగా ఉన్నారు. మానసిక శాస్త్రంలో ఎంతో మంది ఆలోచనలను ప్రభావితం చేసిన వ్యక్తి)
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement