ఆకస్మిక తనిఖీ - | Sakshi
Sakshi News home page

ఆకస్మిక తనిఖీ

Published Fri, Jun 21 2024 8:36 AM | Last Updated on Fri, Jun 21 2024 8:36 AM

ఆకస్మ

మనోహరాబాద్‌(తూప్రాన్‌): మండలంలోని తహసీల్దార్‌ కార్యాలయాన్ని అదనపు కలెక్టర్‌ వెంకటేశ్వర్లు గురువారం ఆకస్మికంగా తనిఖీ చేసి పలు రికార్డులు పరిశీలించారు. ఈసందర్భంగా అధికారులతో పలు అంశాలపై చర్చించారు. రెవెన్యూ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని సూచించారు. అనంతరం జీడిపల్లిలో సర్వే నంబర్‌ 323లో గల రైతుల భూ మిని పరిశీలించారు. ఆయన వెంట తహసీల్దార్‌ చంద్రశేఖర్‌రెడ్డి, సర్వేయర్‌ దత్తస్వరూప్‌, సిబ్బంది తదితరులు ఉన్నారు.

గ్రేడ్‌– 2 పరీక్షలకు

ç³MýS-yýl¾…© HÆ>µr$Ï: MýSÌñæMýStÆŠæḥ

మెదక్‌ కలెక్టరేట్‌: గిరిజన, సాంఘిక, బీసీ సంక్షేమశాఖ హాస్టళ్ల సంక్షేమ అధికారుల పోస్టుల కోసం గ్రేడ్‌– 2 పరీక్షలు ఈనెల 24వ తేదీ నుంచి 29 వరకు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలోని నర్సాపూర్‌లో గల బీవీఆర్‌ఐటీలో సెంటర్‌ ఏర్పాటు చేశామన్నారు. మొత్తం 3,700 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నట్లు చెప్పారు. పరీక్ష సమయానికి గంట ముందు అభ్యర్థులను లోపలికి అనుమతి ఇస్తామ న్నారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతి లేదన్నారు. బయోమెట్రిక్‌ను ఇన్విజిలేటర్‌ క్యాప్చర్‌ చేసే వరకు పరీక్ష హాల్‌ నుంచి బయటకు వెళ్లడానికి వీలు లేదన్నారు. అభ్యర్థులు పరీక్షకు వచ్చే ముందు కమిషన్‌ వెబ్‌సైట్‌లో మాక్‌టెస్ట్‌ను క్షుణ్ణంగా ప్రాక్టీస్‌ చేయాలని సూచించారు. దివ్యాంగ అభ్యర్థులు తప్పనిసరిగా సదరం సర్టిఫికెట్‌ అపెండెక్స్‌ ప్రతిని పరీక్షా కేంద్రంలోనికి తీసుకురావాలన్నారు. పరీక్ష సమయాల్లో అభ్యర్థులకు అనుకూలంగా ప్రత్యేక బస్సు సర్వీసులు ఏర్పాటు చేసినట్లు వివరించారు.

ప్రతి ఇంటికి తాగునీరు: డీపీఓ

అల్లాదుర్గం(మెదక్‌): ప్రతి ఇంటికి తాగునీరు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య అన్నారు. గురువారం మండల పరిధిలోని ముస్లాపూర్‌, కాగితంపల్లి, అల్లాదుర్గం గ్రామాల్లో పర్యటించి సిబ్బంది సర్వేను పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఇంటికి తాగునీరు అందిస్తాం అన్నారు. వర్షాకాలంలో సీజనల్‌ వ్యాధులపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రతి గ్రామంలో పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. వర్షాకాలంలో ఎలాంటి వ్యాధులు ప్రబలకుండా జిల్లాలో చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ శంకర్‌, పంచాయతీ కార్యదర్శి ప్రభాకర్‌, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

23 నుంచి

పాలిసెట్‌ కౌన్సెలింగ్‌

మెదక్‌ కలెక్టరేట్‌: ఈనెల 23, 24, 25 తేదీల్లో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్‌ కళాశాలలో పాలిసెట్‌ కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సువర్ణలత గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈసందర్భంగా సర్టిఫికెట్ల పరిశీలన చేస్తామన్నారు. విద్యార్థులు తమ ఒరిజినల్‌ పాలిసెట్‌ హాల్‌టికెట్‌, ర్యాంక్‌ కార్డు, ఎస్‌ఎస్‌సీ మెమో, స్టడీ సర్టిఫికెట్లు కుల, ఆదాయ ధృవపత్రాలు, టీసీ రెండుసెట్ల జిరాక్స్‌ పత్రాలు సైతం వెంట తెచ్చుకోవాలని సూచించారు. ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కౌన్సెలింగ్‌ ఉంటుందని తెలిపారు.

నీట్‌లో అక్రమాలపై నేడు కాంగ్రెస్‌ నిరసన

నర్సాపూర్‌: నీట్‌ పరీక్షలో జరిగిన అక్రమాలకు వ్యతిరేకంగా శుక్రవారం నర్సాపూర్‌లో నిరసన కార్యక్రమం చేపడుతున్నట్లు డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్‌ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నియోజకవర్గంలోని మండల పార్టీ అధ్యక్షులు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్‌లు, కాంగ్రెస్‌ అనుబంధ సంఘాల నాయకులు అధిక సంఖ్యలో నిరసనలో పాల్గొని విజయవంతం చేయా లని ఆయన పిలుపునిచ్చారు.

No comments yet. Be the first to comment!
Add a comment
ఆకస్మిక తనిఖీ
1/1

ఆకస్మిక తనిఖీ

Advertisement
 
Advertisement
 
Advertisement