3.5 లక్షల మంది ఎదురుచూపులు - | Sakshi
Sakshi News home page

3.5 లక్షల మంది ఎదురుచూపులు

Published Fri, Jun 21 2024 8:36 AM | Last Updated on Fri, Jun 21 2024 8:36 AM

-

● గృహజ్యోతి కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు ● ఉమ్మడి మెదక్‌ జిల్లాలో11.45 లక్షల మంది వినిమోగదారులు ● లబ్ధిదారులు 4.71 లక్షల మంది

సాక్షి, సిద్దిపేట: ప్రభుత్వం ఆరు గ్యారంటీలలో ఒకటైన గృహజ్యోతి పథకాన్ని అమలు చేస్తుంది. రేషన్‌ కార్డు కలిగి ఉండి 200 యూనిట్ల లోపు వినియోగిస్తే ఉచిత విద్యుత్‌ను అందిస్తోంది. కానీ ప్రజాపాలన దరఖాస్తుల కంప్యూటరీకరణలో లోపాలతో జిల్లావ్యాప్తంగా అర్హత కలిగిన విద్యుత్‌ వినియోగదారులకు సగం మందికి పైగా పథకం అందడం లేదు. దీంతో గ్రామాల్లో మండల పరిషత్‌ కార్యాలయాలకు, పట్టణాల్లో మున్సిపాలిటీల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.

కార్యాలయాల చుట్టూ ప్రజలు కొందరు 200 యూనిట్‌ల లోపు విద్యుత్‌ వినియోగిస్తున్పప్పటికీ గృహజ్యోతి పథకం లబ్ధిని పొందలేకపోతున్నారు. ప్రజాపాలన దరఖాస్తు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేసే సమయంలో రేషన్‌ కార్డు లేదని నమోదు చేస్తున్నారు. ఇంకా విద్యుత్‌ సర్వీస్‌ నంబర్‌ తప్పుగా పడితే ఎడిట్‌ అప్షన్‌ ఇచ్చారే తప్ప.. రేషన్‌ కార్డు నంబర్‌లను ఎంటర్‌ చేయడం లాంటి వాటికి ప్రభుత్వం అనుమతి ఇవ్వడం లేదు. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో 8,29,448 రేషన్‌ కార్డులుండగా సిద్దిపేట జిల్లాలో 2,91,400, సంగారెడ్డిలో 3,24,188, మెదక్‌లో 2,13,860 ఉన్నాయి. సుమారుగా 3.5 లక్షల మంది అర్హత కలిగిన వారు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు.

రేషన్‌ కార్డులు లేకపోవడంతో దూరం

రేషన్‌ కార్డులు ఉన్న వారే గృహజ్యోతికి అర్హులని ప్రకటించారు. లేనివారు పథకానికి దూరమవుతున్నారు. కొన్ని సంవత్సరాల నుంచి కొత్త రేషన్‌ కార్డుల జారీ ప్రక్రియ నిలిచిపోయింది. కొత్తగా వివాహమైన వారు వేరు కాపురాలు పెట్టారు. దీంతో రేషన్‌ కార్డులు లేకపోవడంతో అనర్హులవుతున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి ఆన్‌లైన్‌లో రేషన్‌కార్డు నంబర్‌లు ఎంటర్‌ చేసి, అలాగే కొత్తగా రేషన్‌ కార్డులను జారీ చేసి అర్హులందరినీ పథకానికి ఎంపిక చేయాలని విద్యుత్‌ వినియోగదారులు కోరుతున్నారు.

జిల్లా కేటగిరి–1 గృహజ్యోతి డబ్బులు

పేరు సర్వీస్‌లు లబ్ధిదారులు (రూ.కోట్లలో)

సిద్దిపేట 3,47,260 1,81,365 6.10

సంగారెడ్డి 5,93,030 1,76,064 6.63

మెదక్‌ 2,05,416 1,14,027 3.19

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement