అల్లరి మూకలను వదిలిపెట్టం - | Sakshi
Sakshi News home page

అల్లరి మూకలను వదిలిపెట్టం

Published Wed, Jun 19 2024 9:46 AM | Last Updated on Wed, Jun 19 2024 9:46 AM

అల్లర

పోలీసులు సైతం జైలుకెళ్లాల్సిందే

మెదక్‌ మున్సిపాలిటీ: మత సామరస్యాన్ని దెబ్బతీసేలా అల్లర్లు సృష్టిస్తే అంతటి వారైనా సరే ఉపేక్షించేది లేదని ఎస్పీ డాక్టర్‌ బాలస్వామి హెచ్చరించారు. మంగళవారం జిల్లా పోలీస్‌ ప్రధాన కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం పట్టణంలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని చెప్పారు. ఇటీవల జరిగిన అల్లర్లకు కారణమైన ఇరు వర్గాలకు చెందిన 27 మందిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించామని వెల్లడించారు. గొడవల కారణంగా ఇతర జిల్లాల నుంచి పోలీస్‌ ఫోర్స్‌ను రప్పించి శాంతి భద్రతలను అదుపులోకి తెచ్చినట్టు చెప్పారు. సోషల్‌ మీడియాలో వచ్చే ఎలాంటి అవాస్తవ వదంతులను ప్రజలు నమ్మవద్దని సూచించారు. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా అందులో కానీ, మరేతర కారణంగా గొడవలు పెట్టాలనుకునే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సామాజిక మాధ్యమాలపై పోలీసు నిఘా ఉందని, గొడవలకు కారణమైన ఏ ఒక్కరినీ వదలబోమని హెచ్చరించారు. గొడవలకు సంబంధించిన అన్ని వీడియోలు ఉన్నాయని, వాటి ఆధారంగా నిందితులను గుర్తించామని స్పష్టం చేశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరుగుతుందన్నారు. ఎవరు కూడా చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవద్దని హెచ్చరించారు. ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత అధికారులను సంప్రదించి నివృత్తి చేసుకోవాలని సూచించారు.

మెదక్‌జోన్‌: పోలీసులు తప్పుడు పనులు చేస్తే కచ్చితంగా వారు కూడా జైలుకు వెళ్లక తప్పదని మెదక్‌ ఎంపీ రఘునందన్‌రావు హెచ్చరించారు. మెదక్‌లో ఇటీవల రెండువర్గాల మధ్య జరిగిన ఘర్షణ నేపథ్యంలో మెదక్‌ సబ్‌జైల్‌లో ఉన్న బీజేపీ నేతలను మంగళవారం పరమర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఏఎస్‌ఐను దూషించిన వారిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని మండిపడ్డారు. మెదక్‌ ఘటనలో నిర్లక్ష్యం వహించిన పోలీసు అధికారులు వెంటనే సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. 14 మందిని తీసుకొచ్చి టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో పెట్టడం సరికాదన్నారు. ఉర్దూలో ఫిర్యాదుచేస్తే కానిస్టేబుల్‌ దాన్ని తెలుగులోకి తర్జుమా చేస్తారా? అని ప్రశ్నించారు. ఆరిఫ్‌ అనే వ్యక్తిని సాయంత్రంలోగా ప్రైవేటు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌చేసి రిమాండ్‌కు తరలించాలని డిమాండ్‌ చేశారు. అంతకు ముందు జరిగిన ఘటన గురించి ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఆయన వెంట నాయకులు పంజా విజయ్‌కుమార్‌, మురళీయాదవ్‌, నల్లాల విజయ్‌, రాజు, గణేశ్‌ తదితరులు ఉన్నారు.

నర్సింగ్‌ విద్యార్థినుల ఆందోళన

ములుగు(గజ్వేల్‌): లక్ష్మక్కపల్లిలోని ఆర్‌వీఎం మెడికల్‌ కళాశాలలో బీఎస్సీ నర్సింగ్‌ విద్యార్థినులు ఆందోళనకు దిగారు. అధ్యాపకులు తమను దుర్భాషలాడుతూ మానసికంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు మంగళవారం తరగతులను బహిష్కరించి కళాశాల ఎదుట బైఠాయించి ధర్నా చేపట్టారు. తమకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు. కొద్దిసేపు వారి ఆందోళనతో కళాశాలలో స్వల్ప ఉద్రిక్తత నెలకొన్నది.

గొడవలకు కారకులైన 27 మందికి రిమాండ్‌

ఎస్పీ బాలస్వామి

తప్పుడు పనులు చేస్తే ఎవరినీ వదలం

మెదక్‌ ఎంపీ రఘునందన్‌రావు

No comments yet. Be the first to comment!
Add a comment
అల్లరి మూకలను వదిలిపెట్టం
1/1

అల్లరి మూకలను వదిలిపెట్టం

Advertisement
 
Advertisement
 
Advertisement