నేడు కొండా సురేఖ పర్యటన - | Sakshi
Sakshi News home page

నేడు కొండా సురేఖ పర్యటన

Published Wed, Jun 19 2024 9:46 AM | Last Updated on Wed, Jun 19 2024 9:46 AM

నేడు

మెదక్‌ కలెక్టరేట్‌: జిల్లాలో బుధవారం మంత్రి కొండా సురేఖ పర్యటించనున్నట్లు కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మంత్రి మొదట కొల్చారం మండలం చేరుకొని బడిబాట కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. అనంతరం మండల ప్రజా పరిషత్‌ భవన సముదాయానికి ప్రారంభోత్సవం, పోతం శెట్టిపల్లిలో హై లేవెల్‌ బ్రిడ్జి నిర్మాణానికి భూమి పూజ చేస్తారన్నారు. అదేవిధంగా కౌడిపల్లి, నర్సాపూర్‌ మండలాల్లో జెడ్పీ రోడ్లకు శంకుస్థాపనలు చేయనున్నట్లు చెప్పారు. కొల్చారం, నర్సాపూర్‌, శివ్వంపేట మండలాల్లో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేస్తారని తెలిపారు.

పీఎం కిసాన్‌ ప్రోగ్రాం

ప్రత్యేక ప్రసారం

కౌడిపల్లి(నర్సాపూర్‌): మండలంలోని తునికి వద్దగల డాక్టర్‌ రామానాయుడు ఏకల్యవ గ్రామీణ వికాస ఫౌండేషన్‌ కృషివిజ్ఞాన క్రేంద్రం (కేవీకే)లో మంగళవారం పీఎం కిసాన్‌ కార్యక్రమాన్ని లైవ్‌ టెలికాస్టింగ్‌ ద్వారా రైతులకు చూపించారు. కేవీకే హెడ్‌ అండ్‌ సైంటిస్ట్‌ డాక్టర్‌ సంబాజీ దత్తాత్రేయ నల్కర్‌ ఆధ్వర్యంలో వివిధ గ్రామాలకు చెందిన రైతులు పీఎం కిసాన్‌ సమ్మాన్‌నిధి 17వ విడత నిధులు పంపిణీ ప్రత్యేక ప్రసారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేవీకేలో చేస్తున్న సేంద్రియసాగుపై అవగాహన కల్పించారు. ఆధునిక వ్యవసాయ పద్ధతులు, డ్రోన్‌ వినియోగం గురించి వివరించారు. సేంద్రియసాగు చేసే రైతులకు శాస్త్రవేత్తలు సలహాలు, సూచనలు ఇస్తారని చెప్పారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు శ్రీకాంత్‌, రవికుమార్‌, ఉదయ్‌కుమార్‌, శ్రీనివాస్‌, డాక్టర్‌ ప్రతాప్‌రెడ్డి, డాక్టర్‌ భార్గవి, రైతులు పాల్గొన్నారు.

ప్రిలిమ్స్‌ పరీక్షకు

ఉచిత శిక్షణ

మెదక్‌ కలెక్టరేట్‌: ప్రిలిమ్స్‌ కమ్‌ మెయిన్స్‌ పరీక్షకు బీసీ స్టడీసర్కిల్‌ ఆధ్వర్యంలో ఉచితంగా లాంగ్‌టర్మ్‌ శిక్షణ ఇవ్వనున్నట్టు సంగారెడ్డి జిల్లా బీసీస్టడీ సర్కిల్‌ డైరెక్టర్‌ టి.ప్రవీణ్‌ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మెదక్‌, సంగారెడ్డి జిల్లాలకు చెందిన డిగ్రీ పూర్తిచేసిన యువతీ, యువకులు 13నుంచి జూలై 3వరకు స్టడీసర్కిల్‌ వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. ఉచిత శిక్షణ కోసం జూలై 7న పరీక్ష నిర్వహించి వందమంది అర్హులను ఎంపిక చేస్తామని, ప్రతినెలా లాడ్జింగ్‌, రవాణా చార్జీల కింద రూ.5వేలు, బుక్‌ఫండ్‌ కింద రూ.5వేలు ఇస్తామని తెలిపారు. పూర్తి సమాచారం కోసం 08455–277015, 99495 92991 నంబర్లను సంప్రదించాలని కోరారు.

సద్వినియోగం చేసుకోండి

ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు సివిల్స్‌ ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధిశాఖ అధికారి విజయలక్ష్మి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. డిగ్రీ పూర్తి చేసిన ఎస్సీ, ఎస్టీ, బీసీ నిరుద్యోగ యువతి యువకులు ఈ నెల 17 నుంచి జూలై 10వ తేదీ వరకు ఆన్‌లైన్‌ ద్వారా ఎస్సీ స్టడీ సర్కిల్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

మున్సిపల్‌ దుకాణాలకు రీటెండర్‌ వేయించండి

జస్టిస్‌ లోకాయుక్త కమిషన్‌కు ఫిర్యాదు

మెదక్‌ మున్సిపాలిటీ: మున్సిపాలిటీకి చెందిన దుకాణాలకు రీ టెండర్‌ వేయాలని ఎస్సీ, ఎస్టీ, బీసీ నిరుద్యోగ యువజన సంఘాల ఐక్య కార్యచరణ సమితి కన్వీనర్‌ బాల్‌రాజ్‌ ప్రభుత్వాన్ని అన్నారు. మంగళవారం హైదరాబాద్‌ లోని జస్టిస్‌ లోకాయుక్త కమిషన్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టెండర్లు వేయకుండా ఏళ్ల తరబడి వాయిదాలు వేస్తున్నారని, ఇప్పటికై న టెండర్లు వేయాలని డిమాండ్‌ చేశారు. మున్సిపల్‌ దుకాణాలు ప్రస్తుతం బినామీల చేతుల్లో ఉన్నా యని తెలిపారు. ఈ కార్యక్రమంలో గోపాల్‌ నాయక్‌, రఘునాయక్‌, ప్రవీణ్‌కుమార్‌, ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నట్లు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
నేడు కొండా సురేఖ పర్యటన
1/1

నేడు కొండా సురేఖ పర్యటన

Advertisement
 
Advertisement
 
Advertisement