జిమ్నాస్టిక్స్‌ కోచ్‌పై విచారణ - | Sakshi
Sakshi News home page

జిమ్నాస్టిక్స్‌ కోచ్‌పై విచారణ

Published Sat, Jun 22 2024 1:40 AM | Last Updated on Sat, Jun 22 2024 1:40 AM

జిమ్నాస్టిక్స్‌ కోచ్‌పై విచారణ

వరంగల్‌ స్పోర్ట్స్‌ : మానసికంగా తమను వేధిస్తున్నాడంటూ వరంగల్‌ రీజనల్‌ స్పోర్ట్స్‌ హాస్టల్‌ జిమ్నాస్టిక్స్‌ క్రీడాకారులు అకాడమీ కోచ్‌పై మే నెలలో స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ తెలంగాణ అధికారులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు.ఈ మేరకు మే 17వ తేదీన ‘ఈ కోచ్‌ మాకొద్దు..’ అనే శీర్షికతోసాక్షి దినపత్రికలో కథనం ప్రచురితమైంది. ఈ కథనాన్ని స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ తెలంగాణ వీసీ, ఎండీ సీరియస్‌గా తీసుకున్నారు. ఫిర్యాదు చేసిన ఏడుగురు జిమ్నాస్టిక్స్‌ క్రీడాకారులను హైదరాబాద్‌లోని శాట్‌ ఎండీ ఆఫీస్‌కు పిలిపించి అసలేం జరిగిందని ఉన్నతాధికారులు అడిగి తెలుసుకున్నారు. కాగా విచారణ అధికారి శాట్‌ డిప్యూటీ డైరెక్టర్‌ చంద్రారెడ్డి శుక్రవారం హనుమకొండలోని ఇండోర్‌ స్టేడియంలోని డీఎస్‌ఏ వచ్చారు. జిల్లా యువజన, క్రీడల అధికారి గుగులోత్‌ అశోక్‌కుమార్‌తో కలిసి సమావేశమై వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఒక్కో కోచ్‌ను విడివిడిగా విచారించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న కోచ్‌ పనితీరు, సమర్ధుడేనా అంటూ అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. పనితీరు సరిగా లేని కోచ్‌లను ఉపేక్షించేది లేదని డీడీ చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం. వారం రోజుల్లో విచారణపై పూర్తి స్థాయి నివేదిక బయటికి రానున్నట్లు తెలిసింది. అనంతరం బాలసముద్రంలోని స్విమ్మింగ్‌ పూల్‌ను సందర్శించి, క్రీడా వసతులు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

శాట్‌ ఎండీ ఆదేశాలతో రంగంలోకి డీడీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement