'ఏం పాపం చేశామని ప్రజలు మోసం చేశారు!' : బానోత్‌ శంకర్‌నాయక్‌ - | Sakshi
Sakshi News home page

'ఏం పాపం చేశామని ప్రజలు మోసం చేశారు!' : బానోత్‌ శంకర్‌నాయక్‌

Published Mon, Dec 18 2023 1:00 AM | Last Updated on Mon, Dec 18 2023 9:42 AM

- - Sakshi

మహబూబాబాద్‌: పార్టీ శ్రేణులు కసిగా పనిచేయకపోవడం వల్లే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయామని మాజీ ఎమ్మెల్యే బానోత్‌ శంకర్‌నాయక్‌ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో జరిగిన బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి వచ్చాక రైతులు కన్నీరు కారుస్తున్నారని, ఓటు వేసే ముందు ఆలోచిస్తే బాగుండేదన్నారు.

దేశంలో ఎక్కడాలేని విధంగా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అన్నివర్గాల ప్రజలకు అనేక సంక్షేమ పథకాలను అందించిందని, ఏం పాపం చేశామని ఎన్నికల్లో ప్రజలు మోసం చేశారో తెలియడంలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కొంతమంది స్వార్థపరులు పార్టీలో లబ్ధిపొంది ఎన్నికల ముందు బయటకు వెళ్లిపోయారని, మరి కొంతమంది పార్టీలో ఉంటూ మోసం చేశారన్నారు. అలాంటి వారు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. ఇక మీదట పార్టీ శ్రేణులు ఐక్యంగా ఉండి, కసిగా పనిచేయాలన్నారు.

ప్రతి ఒక్క కార్యకర్తని కంటికి రెప్పలా కాపాడుకుంటానన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ వోలం చంద్రమోహన్‌, జెడ్పీటీసీ రావుల శ్రీనాథ్‌రెడ్డి, సర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షుడు మాదారపు సత్యనారాయణ, నీలం దుర్గేష్‌, బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు ఎండి.నజీర్‌అహ్మద్‌, ప్రధాన కార్యదర్శి కముటం శ్రీనివాస్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ బొబ్బిలి మహేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ గండు సావిత్రమ్మ, జాటోత్‌ హరీశ్‌నాయక్‌, ఊకంటి యాకూబ్‌రెడ్డి, సట్ల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
ఇవి చ‌ద‌వండి: పురపాలికల్లో మోగుతున్న అవిశ్వాస గంట

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement