అభ్యర్థులు తుది ఖర్చుల వివరాలు తెలపాలి - | Sakshi
Sakshi News home page

అభ్యర్థులు తుది ఖర్చుల వివరాలు తెలపాలి

Published Thu, Jun 20 2024 1:32 AM | Last Updated on Thu, Jun 20 2024 1:32 AM

అభ్యర్థులు తుది ఖర్చుల వివరాలు తెలపాలి

కర్నూలు(సెంట్రల్‌): ఇటీవల జరిగిన పార్లమెంట్‌, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు తమ తుది ఖర్చుల వివరాలను తెలపాలని జిల్లా రెవెన్యూ అధికారి కె.మధుసూదన్‌రావు అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్‌ హాలులో పార్లమెంట్‌, అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన పోటీ చేసిన అభ్యర్థుల ఎన్నికల ఖర్చుపై పార్టీల ప్రతినిధులు, అసిస్టెంట్‌ వ్యయ పరిశీలకులతో డీఆర్వో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అభ్యర్థులు తుది లెక్కలను వ్యయ పరిశీలకులకు సమర్పించాలన్నారు. ఈ నెల 28వ తేదీన వ్యయ పరిశీలకులు వస్తున్నారని, 25వతేదీలోపు అన్ని రకాల ఖర్చుల తుది లెక్కలను తెలపాలని సూచించారు. జిల్లా వ్యయం నోడల్‌ ఆఫీసర్లు రమేష్‌బాబు, రామాంజనేయులు మాట్లాడుతూ.. పోటీ చేసిన అభ్యర్థులందరూ నోటిఫికేషన్‌ విడుదలైనప్పుటి నుంచి ఇప్పటి వరకు చేసిన ఖర్చుల వివరాలను ఇవ్వాలన్నారు. బహిరంగ సభలు, ర్యాలీలు, జెండాలు, ఇతరాత్ర అవసరాలకు సంబంధించిన ఖర్చుల వివరాలను వివరంగా అసిస్టెంట్‌ వ్యయ పరిశీలకులకు సమర్పించాలన్నారు. ప్రతీ రసీదులో అభ్యర్థులు సంతకం కచ్చితంగా ఉండాలన్నారు. బీసీ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ వెంకటలక్ష్మమ్మ మాట్లాడుతూ..ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు ఎన్నికల నియమ, నిబంధనల ప్రకారం ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియాలో వచ్చిన పెయిడ్‌ న్యూస్‌ను రేట్‌ కార్డు ప్రకారం చేసిన ఖర్చును వ్యయం పద్దు కింద చూపించనున్నట్లు చెప్పారు.

జిల్లా రెవెన్యూ అధికారి

కె.మధుసూదన్‌రావు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement