దుర్గమ్మ హుండీ ఆదాయం రూ.3.23 కోట్లు - | Sakshi
Sakshi News home page

దుర్గమ్మ హుండీ ఆదాయం రూ.3.23 కోట్లు

Published Fri, Jun 21 2024 1:48 AM | Last Updated on Fri, Jun 21 2024 1:48 AM

దుర్గమ్మ హుండీ ఆదాయం రూ.3.23 కోట్లు

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు భక్తులు హుండీల ద్వారా రికార్డు స్థాయిలో కానుకలు, మొక్కుబడులు సమర్పించారు. వేసవి సెలవుల నేపథ్యంలో 16 రోజులకు రూ.3.23 కోట్ల మేర కానుకలు, మొక్కుబడుల ద్వారా ఆదాయం సమకూరింది. ఆలయ ఈఓ కె.ఎస్‌.రామరావు పర్యవేక్షణలో మహా మండపం ఆరో అంతస్తులో గురువారం కానుకల లెక్కింపు జరిగింది. రూ.3,23,75,523 నగదు లభమైంది. రోజుకు సరా సరిన రూ.20.23 లక్షల మేర ఆదాయం లభించిందని ఆలయ ఈఓ పేర్కొన్నారు. 694 గ్రాముల బంగారం, 6.264 కిలోల వెండితో పాటు విదేశీ భక్తులు డాలర్ల రూపంలో అమ్మవారికి కానుకలను సమర్పించారు. 516 యూఎస్‌ఏ డాలర్లు, 100 ఆస్ట్రేలియా డాలర్లు, వెయ్యి కొరియా ఒన్‌లు, 40 ఇంగ్లాండ్‌ పౌండ్లు, 100 ఓమన్‌ బైంసాలు లభ్యమయ్యాయి. కానుకల లెక్కింపులో సేవా సిబ్బంది, ఆలయానికి చెందిన వివిధ విభాగాల అధికారులు, సిబ్బందితో పాటు ఎస్‌ఫీఎఫ్‌ సిబ్బంది, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement