పోర్టు పనులు వేగవంతం చేయండి - | Sakshi
Sakshi News home page

పోర్టు పనులు వేగవంతం చేయండి

Published Thu, Jun 20 2024 1:50 AM | Last Updated on Thu, Jun 20 2024 1:50 AM

పోర్టు పనులు వేగవంతం చేయండి

కలెక్టర్‌ డీకే బాలాజీ

చిలకలపూడి(మచిలీపట్నం): బందరు పోర్టు పనులను వేగవంతంగా నిర్వహించాలని కలెక్టర్‌ డీకే బాలాజీ అధికారులకు సూచించారు. కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్‌ హాలులో పోర్టు, రెవెన్యూ అధికారులతో బుధవారం సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ బందరు పోర్టు నిర్మాణ పనులను అవరోధం లేకుండా సమస్యలను పరిష్కరించుకుంటూ పనులను వేగవంతంగా చేయాలని ఆదేశించారు. భూ సమస్యల వల్ల పనులు ఆలస్యం కాకూడదని అవసరమైన పరిష్కార చర్యలు చేపట్టాలని తెలిపారు. రైతులకు చెల్లించాల్సిన నష్టపరిహారం అందజేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. పోర్టు నిర్మాణంతో పాటు అనుసంధాన రహదారుల నిర్మాణం కోసం సేకరించిన భూములకు నష్టపరిహారం చెల్లింపులు పెండింగ్‌ ఉంటే వెంటనే వాటిని చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. జూలై 5వ తేదీన తిరిగి పోర్టు పనుల పురోగతిపై సమీక్షిస్తానన్నారు. ఈ సమీక్షలో డీఆర్వో కె.చంద్రశేఖరరావు, ఏపీ మారిటోరియం బోర్డు డైరెక్టర్‌ విద్యాశంకర్‌, కలెక్టరేట్‌ ల్యాండ్‌ సెక్షన్‌ సూపరింటెండెంట్‌ తేజేశ్వరరావు, తహసీల్దార్లు సతీష్‌, వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

పోర్టు పనులను పరిశీలించిన కలెక్టర్‌...

మచిలీపట్నం పోర్టు నిర్మాణ ప్రాంతంలో జరుగుతున్న పనులను కలెక్టర్‌ డీకె బాలాజీ పరిశీలించారు. జాయింట్‌ కలెక్టర్‌ గీతాంజలి శర్మ, పోర్టు రెవెన్యూ అధికారులతో కలిసి అక్కడ జరుగుతున్న పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. డ్రెడ్జింగ్‌, బ్రేక్‌ వాటర్‌ బెర్త్‌ నిర్మాణ ప్రాంతాల పనులను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. తొలుత రోడ్డు, రైలు మార్గంలో జరుగుతున్న నిర్మాణ పనులతో పాటు ఆ మార్గంలోని భూ సమస్య

ప్రాంతాలను పరిశీలించారు. కోర్టు వివాదంలో ఉన్న స్థలాలకు సమస్య పరిష్కారమైందని మిగిలిన అసైన్డ్‌ భూములకు సంబంధించిన సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. మచిలీపట్నం పోర్టు డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ వై.విద్యాశంకర్‌, మెగా ఇంజినీరింగ్‌ ఇన్‌ఫ్రాస్టక్చర్‌ జనరల్‌ మేనేజర్‌ తులసీదాస్‌, రైడ్స్‌ టీమ్‌ లీడర్‌ విశ్వనాథం, బందరు ఆర్డీవో ఎం.వాణి, తహసీల్దార్‌ సతీష్‌ తదితరులు ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement