సురభి ఉసురు తీసిన భర్త వివాహేతర సంబంధం.. 24-year-old woman found dead under mysterious circumstances in Karnataka | Sakshi
Sakshi News home page

సురభి ఉసురు తీసిన భర్త వివాహేతర సంబంధం..

Published Sat, Feb 24 2024 12:16 AM | Last Updated on Sat, Feb 24 2024 11:00 AM

- - Sakshi

యశవంతపుర: వివాహిత మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన హాసన జిల్లా చెన్నరాయపట్టణ తాలూకా నాగయ్యనకొప్పలు గ్రామంలో జరిగింది. అయితే ఆమెను భర్త హత్య చేసినట్లు మృతురాలి కుటుంబ సభ్యులు అరోపిస్తున్నారు. హుణసూరుకు చెందిన సురభి(24)కి నాగయ్యనకొప్పలు గ్రామానికి చెందిన దర్శన్‌తో మూడేళ్ల క్రితం వివాహమైంది.

ఈ దంపతులకు ఏడాది చిన్నారి ఉంది. దర్శన్‌ మరో మహిళతో ఆక్రమ సంబంధం పెట్టుకున్నాడన్న విషయంపై దంపతుల మధ్య అప్పుడప్పడు గొడవ జరిగేది. ఈక్రమంలో లోబీపీతో సురభి చెందినట్లు ఆమె తల్లిదండ్రులకు దర్శన్‌ సమాచారం ఇచ్చాడు. గ్రామానికి చేరుకున్న తల్లిదండ్రులు వచ్చి కుమార్తె మృతదేహాన్ని పరిశీలించారు. గొంతువద్ద బలమైన గాయాలు ఉన్నాయని గుర్తించారు. దర్శన్‌ మరో మహిళతో ఆక్రమ సంబంధాన్ని ప్రశ్నించినందుకే సురభికి ఉరివేసి హత్య చేశాడని ఆరోపిస్తూ శ్రావణబెళగోళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement