దోషులను శిక్షించాలి.. - | Sakshi
Sakshi News home page

దోషులను శిక్షించాలి..

Published Fri, Jun 21 2024 2:32 AM | Last Updated on Fri, Jun 21 2024 2:32 AM

దోషుల

మొలచింతపల్లిలో చెంచు మహిళ ఈశ్వరమ్మపై అమానుషంగా దాడి చేసి గాయపరిచిన బండి వెంకటేశ్వర్లు, అతని తమ్ముడు శివను వెంటనే అరెస్టు చేసి ఎస్సీ, ఎస్టీ చట్టం ప్రకారం శిక్షించాలి. లేకపోతే చెంచు మహిళా సంఘం ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆందోళన చేపడతాం.

– చెన్నమ్మ, మహిళా సంఘం సభ్యురాలు

హేయమైన చర్య..

చెంచు మహిళ ఈశ్వరమ్మపై గ్రామానికి చెందిన బండి వెంకటేశ్వర్లు, అతని తమ్ముడు శివ, వెంకటేశ్వర్లు భార్య శివమ్మ విచక్షణ రహితంగా దాడి చేసి.. వికృత చర్యలకు పాల్పడటం హేయమైన చర్య. ప్రభుత్వం వారిని వెంటనే అరెస్టు చేసి శిక్షించాలి. అలాగే భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి.

– లక్ష్మి, మొలచింతపల్లి చెంచుగూడెం

న్యాయం చేయాలి..

ఆదివాసీల అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని వారి సొంత వ్యవసాయ పొలంలో వారినే కూలీలుగా మార్చుకొని వారి మీదనే దాష్టీకం చేయడం దురదృష్టకరం. పోలీసులు నిందితులను కఠినంగా శిక్షించడంతోపాటు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలి. బాధిత చెంచులకు పూర్తిస్థాయిలో న్యాయం చేయాలి. – నిమ్మల శ్రీనివాసులు, ఆదివాసి ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు

రాజకీయ ఒత్తిళ్లతోనే..

చెంచు మహిళపై దాడికి పాల్పడిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలి. రాజకీయ ఒత్తిళ్లతో బాధిత కుటుంబానికి అన్యాయం చేయాలని చూస్తే ఊరుకోం. ఈ ఘటనపై ఆదివాసీలు సంఘటితమై పోరాడి బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలి.

– మల్లికార్జున్‌, మాజీ సర్పంచ్‌, సార్లపల్లి, అమ్రాబాద్‌ మండలం

No comments yet. Be the first to comment!
Add a comment
దోషులను శిక్షించాలి..
1/1

దోషులను శిక్షించాలి..

Advertisement
 
Advertisement
 
Advertisement