‘మివాకీ’ కన్వెన్షన్‌కు ట్రంప్‌.. అధ్యక్ష అభ్యర్థిగా ప్రకటించనున్న రిపబ్లికన్‌ పార్టీ | Trump Security tightens In Milwaukee Republican Convention | Sakshi
Sakshi News home page

‘మివాకీ’ కన్వెన్షన్‌కు ట్రంప్‌.. అధ్యక్ష అభ్యర్థిగా ప్రకటించనున్న రిపబ్లికన్‌ పార్టీ

Published Mon, Jul 15 2024 8:19 AM | Last Updated on Mon, Jul 15 2024 9:08 AM

Trump Security tightens In Milwaukee Republican Convention

వాషింగ్టన్‌: కాల్పుల తర్వాత అమెరికా మాజీ అధ్యక్షుడు  డొనాల్డ్ ట్రంప్‌ విస్కాన్సిన్‌లోని మివాకీ పట్టణానికి చేరుకున్నారు. మివాకీలో సోమవారం(జులై 15) నుంచి నాలుగు రోజుల పాటు రిపబ్లికన్‌ పార్టీ కన్వెన్షన్‌  జరగనుంది. ఈ సమావేశాల్లోనే రిపబ్లికన్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా ట్రంప్‌ను అధికారికంగా నామినేట్‌ చేస్తారు. 

కాల్పుల నేపథ్యంలో మివాకీ సమావేశాల వేదిక వద్ద పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు. పెన్సిల్వేనియాలో శనివారం సాయంత్రం జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ట్రంప్‌పై దుండగుడు కాల్పులు జరిపాడు. 

ఈ కాల్పుల్లో ట్రంప్‌ చెవికి బుల్లెట్‌ తగిలి రక్తం చిందింది. వెంటనే సీక్రెట్‌  సర్వీస్‌ ఏజెంట్లు ట్రంప్‌ను అక్కడినుంచి తరలించారు. దుండగుడిని కాల్చి చంపారు.  ఈ ఏడాది నవంబర్‌ 5న అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. 

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement