శాటిలైట్లను పేల్చేసే ఉపగ్రహం ప్రయోగించిన రష్యా | Russia Launched A Satellite That Could Attack Others In Space Says US, More Details Inside | Sakshi
Sakshi News home page

శాటిలైట్లను పేల్చేసే ఉపగ్రహం ప్రయోగించిన రష్యా

Published Thu, May 23 2024 4:56 AM | Last Updated on Thu, May 23 2024 12:12 PM

Russia launched a satellite that could attack others in space says US

వాషింగ్టన్‌: శత్రుదేశాలైన అమెరికా, రష్యా అంతరిక్ష యుద్ధానికి తెరతీస్తున్నాయా? ఇప్పటి పరిణామాలు చూస్తే అదే నిజమనిపిస్తోంది. రష్యా అంతరిక్ష సంస్థ ఈ నెల 16న భూదిగువ కక్ష్యలోకి ఉపగ్రహాన్ని ప్రయోగించిందని అమెరికా రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం పెంటగాన్‌ ప్రతినిధి బ్రిగేడియర్‌ జనరల్‌ పాట్‌ రైడర్‌ మంగళవారం చెప్పారు. ఇది అంతరిక్షంలోని ఉపగ్రహాలను పేల్చేసే సామర్థ్యం కలదని వెల్లడించారు. ఇప్పటికే అదే కక్ష్యలో ఉన్న తమ ప్రభుత్వ ఉపగ్రహం ’యూఎస్‌ఏ 314’ను దెబ్బతీయడానికే రష్యా ఈ చర్యకు పూనుకుందని ఆరోపించారు.

 దీనిపై రష్యా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మారియా జఖరోవా స్పందించారు. ఈ నెల 17న సోయుజ్‌–2.1బీ వాహక నౌక ద్వారా ‘కాస్మోస్‌ 2576’ ప్రయోగించిన మాట నిజమేనని పేర్కొన్నారు. అయితే, ఈ ప్రయోగం తమ రక్షణ శాఖ ప్రయోజనాలకే తప్ప మరో ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. అమెరికా ఉపగ్రహం, రష్యా తాజాగా ప్రయోగించిన ఉపగ్రహం ఒకే కక్ష్యలో ఉన్నాయని అంతరిక్ష నిపుణులు చెప్పారు. ఉక్రెయిన్‌ సైన్యానికి సహకరించే అమెరికా శాటిలైట్లను లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తామని రష్యా ఇటీవలే హెచ్చరికలు జారీ చేయడం గమనార్హం.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement