పాక్‌ ప్రధాని పదవికి నవాజ్‌ రెండు ప్లాన్లు? Nawaz Sharif Working on 2 Plans | Sakshi
Sakshi News home page

Pakistan: పాక్‌ ప్రధాని పదవికి నవాజ్‌ రెండు ప్లాన్లు?

Published Sat, Feb 10 2024 12:13 PM | Last Updated on Sat, Feb 10 2024 12:34 PM

Nawaz Sharif Working on 2 Plans - Sakshi

పాకిస్తాన్‌లో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఒక అంచనాకు వచ్చాయి. జైలులో ఉన్న ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) మద్దతు పొందిన స్వతంత్ర అభ్యర్థులకు భారీ ప్రజా మద్దతు లభించింది. పాకిస్తాన్ ఎన్నికల ఫలితాల్లో ఇప్పటివరకు 99 మంది స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. 

‘నూన్ లీగ్’గా పేరొందిన నవాజ్ షరీఫ్ పార్టీ ‘పాకిస్తాన్ ముస్లిం లీగ్’కి చెందిన 71 మంది ఎంపీల విజయంతో ఇది అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే పాక్‌లో సంకీర్ణం ఏర్పడే పరిస్థితులు తలెత్తడంతో నవాజ్ షరీఫ్ తాజాగా రెండు ప్లాన్‌ను సిద్ధం చేసినట్లు సమాచారం.

ప్లాన్ ‘ఏ’ 
నవాజ్ షరీఫ్ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తన సోదరుడు పాకిస్తాన్ మాజీ ప్రధాని షాబాజ్ షరీఫ్‌ను సహాయకునిగా నియమించారు. ఇతను ఇప్పటికే ఆసిఫ్ అలీ జర్దారీ, బిలావల్ భుట్టోతో మంతనాలు జరిపారు. వీరు లాహోర్‌లోని షరీఫ్ కుటుంబాన్ని కలుసుకోనున్నారు. దీనితోపాటు నవాజ్ షరీఫ్ మరికొన్ని పార్టీలతో మ్యాజిక్‌ ఫిగర్‌ రాబట్టేందుకు చర్చలు జరుపుతున్నారని సమాచారం. 

ప్లాన్ ‘బి’ 
మరోవైపు నవాజ్ షరీఫ్ 60 మంది స్వతంత్ర ఎంపీలతో టచ్‌లో ఉన్నారని ఇమ్రాన్ ఖాన్‌కు మద్దతు ఇస్తున్న స్వతంత్ర ఎంపీలు తెలిపారు. వీరిని తమ పార్టీలో చేర్చుకునేందుకు నవాజ్, ఆయన కుమార్తె మరియం నవాజ్ ప్రయత్నాలు సాగిస్తున్నారని తెలుస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement