Lord Nazir Ahmed Finally Convicted For Attempted Rape Case: ఎట్టకేలకు పాపం పండింది - Sakshi
Sakshi News home page

నజీర్‌ అహ్మద్‌: ఇమ్రాన్‌తో దోస్తీ.. భారత్‌పై విషం! ‘కశ్మీర్‌’ కామపిశాచి పాపం పండింది

Published Sat, Feb 5 2022 11:59 AM | Last Updated on Sat, Feb 5 2022 12:42 PM

Lord Nazir Finally Convicted For Attempted Rape Case - Sakshi

భారత్‌పై, ప్రభుత్వ విధానాలపై వీలు చేసుకుని మరీ విషం చిమ్ముతూ.. పాక్‌ అండతో కశ్మీర్‌ ప్రచారకర్తగా తనను తాను ప్రచారం చేసుకున్నాడు లార్డ్‌ నజీర్‌ అహ్మద్‌(64). అయితే లైంగిక దాడుల పర్వంలో ఎట్టకేలకు ఈ చీడపురుగు పాపం పండింది. మైనర్లపై లైంగిక వేధింపుల కేసులో జైలు శిక్ష పడింది. 

బ్రిటిష్‌-పాక్‌ సంతతికి చెందిన రాజకీయ నేత లార్డ్‌ నజీర్‌ అహ్మద్‌కు పిల్లలపై లైంగిక వేధింపుల కేసులో ఐదున్నరేళ్ల శిక్ష ఖరారైంది. ఈ మేరకు శుక్రవారం షెఫీల్డ్‌ క్రౌన్‌ కోర్టు నజీర్‌ను దోషిగా నిర్ధారించి.. శిక్ష ఖరారు చేసింది. 70వ దశకంలో ఇ‍ద్దరు మైనర్లపై నజీర్‌ అహ్మద్‌ లైంగిక వేధింపులపై పాల్పడ్డాడనే ఆరోపణలు ఉన్నాయి. 1971 నుంచి 1974 మధ్య ఈ వేధింపుల పర్వం సాగినట్లు సమాచారం. వేధింపులతో పాటు అత్యాచార యత్నానికి పాల్పడ్డాడన్నది ప్రధాన ఆరోపణ. ఇదిలా ఉంటే.. నాలుగు దశాబ్దాలుగా బాధిత కుటుంబాల పోరాటం, మీటూ ఉద్యమం  ప్రభావంతో 2019 మార్చిలో ఈ ఆరోపణలకు సంబంధించి నజీర్‌పై నేరారోపణలు నమోదు అయ్యాయి.

కశ్మీర్‌ను ఉద్ధరిస్తానంటూ..
నజీర్‌ అహ్మద్‌ పీఓకేలో జన్మించాడు. అయితే రోథర్‌హమ్‌(యూకే)కు తండ్రి వలస వెళ్లడంతో.. నజీర్‌ అక్కడే పెరిగి, వ్యాపారాలతో రాణించాడు. 1998లో టోనీబ్లేయర్‌ ప్రధాని సారథ్యంలో నజీర్‌ హౌజ్‌ ఆఫ్‌ ది లార్డ్స్‌గా పని చేశాడు. 2013లో లేబర్‌ పార్టీకి రాజీనామా చేసి.. లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో 2020లో హౌజ్‌ ఆఫ్‌ లార్డ్స్‌కు రాజీనామా  చేశాడు. ఇతగాడి వేధింపులు నిజమేనని హౌజ్‌ కమిటీ ఒకటి నిర్ధారణ కూడా చేసింది. 

ఖలీస్థానీ గ్రూపుతో మంచి సంబంధాలు కలిగి ఉన్న నజీర్‌.. వీలుచిక్కినప్పుడల్లా భారత్‌పై విషం చిమ్ముతుంటాడు. పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌తోనూ అతనికి సత్సంబంధాలు ఉన్నాయి. ఈ ఇద్దరూ కలిసినప్పుడల్లా.. నజీర్‌ భారత్‌ మీద విమర్శలు చేయడం పరిపాటిగా మారింది. ఒకానొక దశలో ప్రధాని మోదీపైనా వివాదాస్పద ప్రకటన ఇచ్చాడు నజీర్‌. కశ్మీర్‌ క్రూసేడర్‌ అంటూ తనకు తాను ప్రగల్భాలు పలికే నజీర్‌.. పీవోకే ప్రాంతాన్ని ఉద్దరిస్తానంటూ ఫండింగ్‌ చేయడం ప్రారంభించాడు. సంస్కరణల పేరుతో కశ్మీర్‌ మహిళలను బలవంతంగా లోబర్చుకున్నట్లు నజీర్‌ మీద ఆరోపణలు ఉన్నాయి. ఈ తరుణంలో లండన్‌లో ఉండే  కశ్మీర్‌ కమ్యూనిటీ మీటూ తరహా ఉద్యమంతో నజీర్‌ పీఠాన్ని కదిలించారు కూడా. నజీర్‌పై జైలు శిక్ష పడడంపై కమ్యూనిటీ హర్షం వ్యక్తం చేస్తోంది.

చదవండి: అడుగు పెట్టకముందే ఇమ్రాన్‌ ఖాన్‌కు షాకిచ్చిన చైనా

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement