అమెరికాలో నలుగురు మలయాళీ కుటుంబ సభ్యుల మృతి! Four Member Malayali Family Found Dead California | Sakshi
Sakshi News home page

US: అమెరికాలో నలుగురు మలయాళీ కుటుంబ సభ్యుల మృతి!

Published Wed, Feb 14 2024 12:36 PM | Last Updated on Wed, Feb 14 2024 1:43 PM

Four Member Malayali Family Found Dead California - Sakshi

అమెరికాలోని కాలిఫోర్నియాలో భారత్‌కు చెందిన నలుగురు కుటుంబ సభ్యులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. కాలిఫోర్నియాలోని శాన్ మాటియో కౌంటీలోని ఒక ఇంటిలో ఈ నలుగురు విగతజీవులుగా కనిపించారు. వీరిని భారతదేశంలోని కేరళలోగల కొల్లాంకు చెందిన ఆనంద్ సుజిత్ హెన్రీ (42), అతని భార్య అలిస్ ప్రియాంక (40), కవలలు నోహ్, నాథన్‌ (4)లుగా గుర్తించారు.  

ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైన వివరాల ప్రకారం వీరంతా హీటర్‌ నుంచి వచ్చిన విషవాయువులు పీల్చిన కారణంగా మృతి చెందివుంటారని తెలుస్తోంది. మృతుడు ఆనంద్‌ కోల్లాంలోని ఫాతిమా మాత నేషనల్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ జీ హెన్రీ కుమారుడు. ఆనంద్‌ ఇటీవలే గూగుల్‌లో ఉద్యోగానికి రాజీనామా చేసి, తన కొత్త కంపెనీని ప్రారంభించారు. 

కాగా వీరి మృతికి గల కారణాలను శాన్ మాటియో పోలీసులు ఇంకా వెల్లడించలేదు. అమెరికా కాలమానం ప్రకారం ఫిబ్రవరి 12న ఉదయం 9.15 గంటలకు వీరి మృతదేహాలను పోలీసులు గుర్తించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement