-
ఔటర్ రింగ్ రోడ్డులో బస్సు బోల్తా.. ఇద్దరు మృతి
సాక్షి,హైదరాబాద్ : హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డులో బస్సు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుండి ఔటర్ రింగు రోడ్డు మీదుగా ముంబాయి వెళుతున్న మార్నింగ్ స్టార్ బస్సు నార్సింగ్ సమీపంలో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 2 ప్రయాణికులు మృతి చెందారు. 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ క్షతగాత్రులను అత్యవసర చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. మరోవైపు బస్సు ప్రమాదం 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోయింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
రీల్ చేస్తుండగా తిరగబడిన ట్రాక్టర్.. యువకుడు మృతి
‘రీల్స్ చెయ్యాలి... సోషల్ మీడియాలో పెట్టాలి.. అందరూ చూడాలి.. లెక్కలేనన్ని వ్యూస్, లైక్స్ రావాలి’.. ఇదే చాలామంది యువతీ యువకుల మనసులలో బలంగా ఉన్న కోరిక. అయితే ఈ తాపత్రయంలోనే కొందరు యువతీయువకులు ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్నారు. యూపీలో చోటుచేసుకున్న ఒక ఘటన దీనికి ఉదాహరణగా నిలిచింది.ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్‌కు చెందిన నీరజ్ అనే రీల్స్ చేస్తుంటాడు. ఇదే మోజులో ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా అందరినీ విషాదంలో ముంచెత్తింది. అత్రియా పోలీస్ స్టేషన్ పరిధిలోని హిమ్మత్ నగర్‌కు చెందిన నీరజ్ డిఫరెంట్ స్టంట్స్ చేస్తూ రీల్స్ చేస్తుంటాడు. తాజాగా అతను ఒక ట్రాక్టర్‌ను మరో ట్రాక్టర్‌కు కట్టి లాగే స్టంట్ చేసే ప్రయత్నం చేశాడు. ఈ విన్యాసాన్ని చూసేందుకు భారీగా జనం తరలివచ్చారు.ఈ ఫీట్ చేస్తుండగా నీరజ్ కూర్చున్న ట్రాక్టర్‌లోని ముందు భాగం అతనిపైకి తిరగబడింది. దీంతో నీరజ్ ట్రాక్టర్ రెండు భాగాల మధ్య ఇరుక్కుపోయాడు. తీవ్రంగా గాయపడిన నీరజ్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన అనంతరం అక్కడ జనం తొక్కిసలాట జరిగింది. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు పోలీసులకు తెలియకుండా మృతదేహాన్ని దహనం చేశారు.కేసు పోలీసులు దర్యాప్తులో ఉంది. -
అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ చేసిన ఆచార్య లక్షీకాంత్ కన్నుమూత
అయోధ్యలోని రామాలయంలో బాల రాముని ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని నిర్వహించిన ఆచార్య లక్షీకాంత్ దీక్షిత్ (90) వారణాసిలో కన్నుమూశారు. నేడు(శనివారం) మణికర్ణికా ఘాట్‌లో ఆచార్య లక్ష్మీకాంత్ భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.ఆచార్య లక్ష్మీకాంత్ మృతి చెందారనే వార్త తెలియగానే కాశీ, అయోధ్యలలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఈ ఏడాది జనవరిలో అయోధ్యలో జరిగిన బాలరాముని ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో లక్ష్మీకాంత్ దీక్షిత్ కీలక పాత్ర పోషించారు. ఆయన ఆధ్వర్యంలో పూజాదికాలు జరిగాయి. ఆయన కుటుంబం తరతరాలుగా కాశీలో ఉంటోంది.లక్ష్మీకాంత్ వారణాసిలోని సంగ్వేద కళాశాలలో సీనియర్ ఉపాధ్యాయునిగా పనిచేశారు. ఈ కళాశాలను కాశీ రాజు స్థాపించారు. లక్ష్మీకాంత్ దీక్షిత్ ప్రముఖ యజుర్వేద పండితులలో ఒకనిగా పేరుగాంచారు. హిందువులు ఆచరించే పూజా విధానాలపై ఆయనకు లోతైన అవగాహన ఉంది. తన మేనమామ గణేష్ దీక్షిత్ దగ్గర లక్ష్మీకాంత్ వేదాలు అభ్యసించారు. -
భారత మాజీ క్రికెటర్ డేవిడ్ జాన్సన్ మృతి
బనశంకరి: భారత జట్టు మాజీ క్రికెటర్ డేవిడ్ జాన్సన్ అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. బెంగళూరులోని కొత్తనూరు పోలీస్‌స్టేషన్ పరిధిలోని కనకశ్రీ లేఔట్ ఎస్ఎల్వీ ప్యారడైజ్ అపార్ట్మెంట్లో 4వ అంతస్తులోని తన ఫ్లాట్ నుంచి ఆయన కింద పడటంతో తీవ్ర గాయాలై మరణించారు. గురువారం ఉదయం గం. 11:15 సమయంలో ఈ సంఘటన జరిగింది. హాసన్ జిల్లా అరసికెరెకు చెందిన 52 ఏళ్ల డేవిడ్ జాన్సన్‌కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆయన కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆర్థిక సమస్యలు కూడా ఉన్నట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో ఫ్లాట్ నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానాలున్నాయి. 1996లో డేవిడ్ జాన్సన్ భారత జట్టు తరఫున 2 టెస్టులు ఆడి 3 వికెట్లు పడగొట్టాడు. న్యూఢిల్లీ వేదికగా 1996 అక్టోబర్‌లో ఆ్రస్టేలియాతో జరిగిన టెస్టులో అరంగేట్రం చేసిన జాన్సన్ రెండో ఇన్నింగ్స్‌లో ఒక వికెట్ తీశాడు. అనంతరం అదే ఏడాది డిసెంబర్లో డర్బన్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టులో జాన్సన్ తొలి ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు సాధించాడు. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు జవాన్లు మృతి
ఛత్తీస్‌గఢ్‌లోని బలరాంపూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఛత్తీస్‌గఢ్ సాయుధ దళాలకు చెందిన ఇద్దరు భద్రతా సిబ్బంది మృతి చెందారు. మరో సైనికుడు, పికప్ వాహనం డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు.ప్రాథమిక సమాచారం ప్రకారం ఛత్తీస్‌గఢ్ సాయుధ దళాల (సీఎఎఫ్) వాహనం బోల్తా పడడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటన అర్థరాత్రి జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. గాయపడినవారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అర్థరాత్రి ప్రమాదం జరగడంతో సహాయక చర్యలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. వాహనంలో ఎంతమంది ఉన్నారనే సమాచారం ఇంకా తెలియరాలేదు. Chhattisgarh | Two Chhattisgarh Armed Force (CAF) security personnel died and one was injured after the vehicle they were travelling in overturned in the Balrampur district. The civil driver of the pick-up vehicle was also injured in the incident. Both the injured are under… pic.twitter.com/xVlVowxnop— ANI (@ANI) June 20, 2024 -
ఇరాన్లో భూకంపం.. నలుగురు మృతి
ఇరాన్‌లోని కష్మార్‌లో భూకంపం సంభవించంది. ఈ విపత్తులో నలుగురు మృతిచెందారు. 120 మంది గాయపడ్డారు. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.9గా నమోదయ్యింది. భూకంపం కారణంగా మృతిచెందివారి వారి సంఖ్యను కష్మార్ గవర్నర్ హజతుల్లా షరీయత్మదారి ధృవీకరించారు.భూకంపం బారినపడి తీవ్రంగా గాయపడిన 35 మంది బాధితులను ఆస్పత్రికి తరలించినట్లు ఆయన తెలిపారు. భూకంపం కారణంగా కష్మార్ పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని పలు పాత భవనాలు దెబ్బతిన్నాయి. యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే తెలిపిన వివరాల ప్రకారం భూకంపం 10 కిలోమీటర్ల (ఆరు మైళ్ళు) లోతులో సంభవించింది. ఇరాన్ టెలివిజన్ భూకంపం ఫుటేజీని ప్రసారం చేసింది. దానిలో కొన్ని భవనాలు బీటలువారడం కనిపిస్తుంది. అలాగే కార్మికులు భవన శిధిలాలను తొలగిస్తున్న దృశ్యాలను కూడా చూపించారు.ఇరాన్లో తరచూ భూకంపాలు సంభవిస్తుంటాయి. 2023లో టర్కీలో 5.9 తీవ్రతతో భూకంపం సంభవించగా, ముగ్గురు మృతిచెందారు. 800 మందికి పైగా జనం గాయపడ్డారు. కాగా 2003లో ఇరాన్లో భారీ భూకంపం సంభవించింది. బామ్ నగరంలో 6.6 తీవ్రతతో వచ్చిన ఈ భూకంపంలో 31వేల మందికి పైగా జనం మృత్యువాత పడ్డారు. -
బెంగాల్లో రైలు ప్రమాదం.. 10కి చేరిన మృతులు
న్యూఢిల్లీ/కోల్‌కతా/ సిలిగురి: పశ్చిమబెంగాల్లోని డార్జిలింగ్ జిల్లాలో సోమవారం సంభవించిన రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 10కి చేరింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆరేళ్ల బాలిక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం చనిపోయినట్లు అధికారులు తెలిపారు. దీంతో, మృతుల సంఖ్య 9 నుంచి 10కి చేరుకుందన్నారు. సీల్డాకు వెళ్తున్న గూడ్స్ రైలు సోమవారం ఉదయం రంగపాణి రైల్వే స్టేషన్లో నిలిచి ఉన్న కాంచనజంగ రైలును వెనుక నుంచి ఢీకొట్టిన విషయం తెల్సిందే.ఘటనలో మృతి చెందిన, గాయాలపాలైన వారిని వదిలేసి ప్రమాదానికి గురవని బోగీలతో 850 మంది ప్రయా ణికులతో సోమవారం మధ్యాహ్నం బయలుదేరిన కాంచనజంగ ఎక్స్‌ప్రెస్ మంగళవారం వేకువజామున సీల్డాకు చేరుకున్నట్లు ఈస్టర్న్ రైల్వే అధికారి ఒకరు తెలిపారు. సీల్డా నుంచి ప్రయాణికులను వారిని గమ్య స్థానాలకు చేర్చేందుకు 16 బస్సులు, 60 కార్లను ఏర్పాటు చేశామన్నారు.కుమార్తె బర్త్‌డే కోసం వస్తూ...సోమవారం జరిగిన రైలు ప్రమాదం కోల్‌కతాకు చెందిన సృష్టి అనే 11 ఏళ్ల చిన్నారికి తీరని వేదన మిగిల్చింది. ఈమె తండ్రి శుభొజిత్ మాలి(31) ఆఫీసు పని మీద శుక్రవారం సిలిగురి వెళ్లారు. మరికొద్ది రోజులపాటు ఆయన అక్కడే ఉండిపోవాల్సి ఉంది. కానీ, సృష్టి బర్త్‌డే వేడుకలో పాల్గొనేందుకు ముందుగానే సోమవారం బయలుదేరారు. కాంచనజంగ ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కే ముందు సృష్టికి వీడియో కాల్ చేసి మాట్లాడారు. ఎలాగోలా సమయానికి వచ్చేస్తా.బర్త్‌డే ఘనంగా చేసుకుందామని, కేకు తీసుకొస్తానని కూతురికి మాట ఇచ్చారు. కానీ, విధి మరోలా ఉంది. రైలు ప్రమాదంలో మరణించిన వారిలో శుభొజిత్ కూడా ఉన్నారు. అదే రైలులో ప్రయాణించిన ఆయన స్నేహితుడు ఈ విషాద వార్తను కుటుంబసభ్యులకు తెలిపారు. దీంతో, శుభొజిత్ కుటుంబం తీవ్ర దుఃఖంలో మునిగింది. ఎప్పుడూ బస్సులోనే ప్రయాణించే శుభొజిత్.. ఈసారి మాత్రం కుమార్తె పుట్టిన రోజు వేడుక జరపాలనే తొందరలో రైలు ప్రయాణాన్ని ఎంచుకున్నారని, ఇదే ఆయన ప్రాణాలు తీసిందని బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు.అశ్వినీ వైష్ణవ్ రాజీనామా చేయాలి: ఖర్గేదేశంలో రైల్వే వ్యవస్థను బీజేపీ ప్రభుత్వం నాశనం చేసిందని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు ఆ పదవిలో కొనసాగే అర్హత లేదని మండిపడ్డారు. మోటారు సైకిల్‌పై కూర్చుని ప్రమాద స్థలికి మంత్రి చేరుకోవడంపై స్పందిస్తూ. అశ్వినీ వైష్ణవ్ రైల్వే మంత్రినా లేక రీల్ మంత్రినా అంటూ ఎద్దేవా చేశారు. -
వడదెబ్బకు 14 మంది హజ్‌యాత్రికులు మృతి
సౌదీ అరేబియాలో ఎండలు మండిపోతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లోనూ ముస్లింలు హజ్‌యాత్రను కొనసాగిస్తున్నారు. జోర్డాన్ ప్రభుత్వ వార్తా సంస్థ ‘పెట్రా’తెలిపిన వివరాల ప్రకారం హజ్ యాత్రలో పాల్గొన్న 14 మంది జోర్డాన్ యాత్రికులు వడదెబ్బ కారణంగా మృతిచెందారు. మృతులను సౌదీ అరేబియాలో ఖననం చేయలా లేదా జోర్డాన్‌కు పంపించాలా అనేదానిపై సౌదీ అధికారులతో చర్చలు జరుపుతున్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.హజ్‌యాత్ర చివరి రోజులలో సైతానుకు గుర్తుగా ఉన్న స్థంభాలను ముస్లింలు రాళ్లతో కొడతారు. దీనిని చెడును తరిమికొట్టడానికి గుర్తుగా భావిస్తారు. ఇది ముస్లింలు హజ్‌యాత్రలో చేసే చివరి ఆచారం. ప్రపంచం నలుమూలల నుండి 18 లక్షల మందికి పైగా హజ్ యాత్రికులు ప్రస్తుతం మక్కాలో ఉన్నారు. కరోనా మహమ్మారి కారణంగా మూడేళ్లుగా హజ్ యాత్రకు ఆంక్షలు విధించారు. అయితే ఇప్పుడు అటువంటి ఆంక్షలు లేకపోవడంతో హజ్ తీర్థయాత్రలో అత్యధిక సంఖ్యలో ముస్లింలు పాల్గొన్నారు. -
బోరుబావిలో పడిన ఏడాదిన్నర చిన్నారి మృతి
గుజరాత్లో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. అమ్రేలి జిల్లా సురగపర గ్రామంలో 100 అడుగుల లోతైన బోరుబావిలో పడి , ఏడాదిన్నర వయసుగల బాలిక ప్రాణాలు కోల్పోయింది. దాదాపు 17 గంటల పాటు సాగిన రెస్క్యూ ఆపరేషన్ అనంతరం ఈరోజు(శనివారం) తెల్లవారుజామున ఆ బాలికను బోరుబావిలో నుంచి బయటకు తీశారు. అయితే అధికారులు ఆ చిన్నారిని ప్రాణాలతో కాపాడలేకపోయారు.రెస్క్యూ టీం ఆ చిన్నారిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. బోరుబావిలో దాదాపు 50 అడుగుల లోతులో ఆ చిన్నారి చిక్కుకుపోయింది. తమ కుమార్తె మృతి చెందడంలో తల్లిదండ్రులు పెద్ద పెట్టున రోదిస్తున్నారు. ఆ ప్రాంతమంతా శోక సంద్రంగా మారిపోయింది. ప్రమాద స్థలంలో అంబులెన్స్ , అగ్నిమాపక దళం, ఎన్డిఆర్ఎఫ్ బృందాలు ఉన్నాయి. బాలికకు ఆక్సిజన్ అందించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది.అగ్నిమాపక దళ అధికారి హెచ్‌సీ గాధ్వి మీడియాతో మాట్లాడుతూ ప్రమాదం జరిగిన సమయంలో ఆ చిన్నారి తల్లిదండ్రులు పొలంలో పనులు చేసుకుంటున్నారని తెలిపారు. ఏడాది వయసుగల ఆ చిన్నారికి పాలు తాగించిన తరువాత తల్లిదండ్రులు పనులకు వెళ్లారన్నారు. ఇంతలో వారికి తమ కుమార్తె కేకలు వినపించాయి. వారి కుమార్తె బోరు బావిలో పడిపోయిందని అక్కడున్న పిల్లలు పరిగెత్తుకుంటూ వచ్చి తల్లిదండ్రులకు తెలిపారు.వెంటనేవారు పోలీసులకు ఈ విషయాన్ని తెలియజేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానిక అధికారులను, ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని అక్కడికి రప్పించారు. రెస్క్యూ బృందం ఆ చిన్నారి బోరుబావిలోని 50 అడుగుల లోతులో ఉన్నట్టు గుర్తించారు. ఆ చిన్నారి తలకిందులుగా ఉందని, ఆమెకు శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారిందని అధికారులు గుర్తించారు. దీంతో ఆ చిన్నారికి ఆక్సిజన్ సరఫరా చేశారు. తరువాత రోబోట్ మెషీన్‌ను కూడా పిలిపించారు. అది ఆ చిన్నారి తలను పట్టుకుని బయటకు తీయడానికి ప్రయత్నించింది. అయితే అప్పటికే ఆ చిన్నారి ఆక్సిజన్ అందక అపస్మారక స్థితికి చేరుకుంది. బయటకు తీసుకువచ్చిన వెంటనే ఆ చిన్నారిని ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆ బాలిక ప్రాణాలు కోల్పోయింది. #WATCH अमरेली, गुजरात: अग्निशमन अधिकारी एचसी गढ़वी ने कहा, "करीब 12:30 बजे सूचना मिली थी की एक बच्ची जो करीब डेढ़ साल की है वो बोरवेल में गिर गई है। तुरंत हमारी रेस्क्यू टीम यहां पहुंची। हमने कैमरे से देखा कि बोरवेल करीब 45 फीट गहरा है। बच्ची को सांस देने के लिए ऑक्सीजन दिया जा… https://t.co/4fF7YMHnzO pic.twitter.com/CjQ6J1jTdQ— ANI_HindiNews (@AHindinews) June 14, 2024 -
చంద్రయాన్-1 మిషన్ డైరెక్టర్ శ్రీనివాస్ హెగ్డే కన్నుమూత
భారతదేశానికి చెందిన చంద్రయాన్-1 మిషన్ డైరెక్టర్ శ్రీనివాస్ హెగ్డే శుక్రవారం బెంగళూరులో కన్నుమూశారు. ఆయన కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ చికిత్స పొందుతున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. శ్రీనివాస్ హెగ్డే మూడు దశాబ్దాలకు పైగా (1978 నుండి 2014) భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)లో పనిచేశారు.ఈ సమయంలో అంతరిక్ష సంస్థ నిర్వహించిన అనేక చారిత్రాత్మక మిషన్లలో కీలక పాత్ర పోషించారు. వాటిలో ముఖ్యమైనది 2008లో చేపట్టిన చంద్రయాన్-1. ఇది చంద్రునిపై నీటి అణువులను గుర్తించింది. శ్రీనివాస్ హెగ్డే పదవీ విరమణ అనంతరం బెంగళూరుకు చెందిన స్టార్టప్ టీమ్ ఇండస్‌లో చేరారు. -
భారీ అగ్ని ప్రమాదం.. ఐదుగురు సజీవ దహనం
చిన్నపాటి నిప్పు పెను ప్రమాదానికి దారితీస్తుంది. ఇటువంటి సందర్భాల్లో ఆస్తి నష్టం, ప్రాణ నష్టం లాంటివి చోటుచేసుకునే అవకాశం ఉంది. ఒక్కోసారి షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదాలు సంభవిస్తుంటాయి. ఘజియాబాద్‌లో ఇలాంటి ఉదంతమే జరిగగా, ఐదుగురు సజీవ దహనమయ్యారు.ఢిల్లీకి ఆనుకుని ఉన్న యూపీలోని ఘజియాబాద్ పరిధిలోని ఓ గ్రామంలో మూడంతస్తుల ఇంట్లో జరిగిన అగ్నిప్రమాదంలో ఇద్దరు చిన్నారులతో సహా ఐదుగురు సజీవదహనమయ్యారు. ఈ ఇంట్లో ఫోమ్ తయారీ పనులు జరుగుతుంటాయి. అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం బుధవారం రాత్రి ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అగ్నిమాపక శాఖకు చెందిన పలు వాహనాలు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించాయి. అయితే అంతకుముందే ఆ ఇంటిలోని కుటుంబ సభ్యులంతా మంటల్లో చిక్కుకున్నారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బెహతా హాజీపూర్ గ్రామంలో ఇష్తియాక్ అలీకి మూడు అంతస్తుల ఇల్లు ఉంది. అతని కుటుంబ సభ్యులు ఈ ఇంట్లో నివసిస్తున్నారు. బుధవారం రాత్రి షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇంట్లో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అనంతరం వారు ఇంటిలోనికి ప్రవేశించిగా అక్కడ వారికి ఐదు మృతదేహాలు కనిపించాయి. మృతులలో ఫర్హీన్ (28), షీష్ (7 నెలలు), నజారా (30), సైఫుర్ రెహ్మాన్ (35), ఇఫ్రా (8)లు ఉన్నారు. ఈ ప్రమాదంలో చిక్కుకున్న బాధితులు టెర్రస్ నుంచి బయటపడేందుకు ప్రయత్నించారని, అయితే అది సాధ్యం కాలేదని స్థానికులు చెబుతున్నారు. -
రోడ్డు ప్రమాదంలో నలుగురు యూట్యూబర్ల దుర్మరణం
ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు, బొలెరో వాహనాలు పరస్పరం ఢీకొన్న ఘటనలో కారులో కూర్చున్న నలుగురు యూ ట్యూబర్లు మృతి చెందారు. ఈ ఘటనలో మరో ఇద్దరు గాయపడ్దారు.మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఈ ఘటన హసన్పూర్ గజ్రౌలా రోడ్డుపై చోటుచేసుకుంది. గాయపడివారికి చికిత్స అందించేందుకు పోలీసులు వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అలాగే మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు.ఈ యూట్యూబర్లు ‘రౌండ్ టు వరల్డ్’ పేరుతో యూట్యూబ్ ఛానెల్‌ని నడుపుతున్నారు. హసన్పూర్ గజ్రౌలా రోడ్డులోని మనోటా బ్రిడ్జి సమీపంలో జరిగిన ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ కారులోని వారంతా అమ్రోహాలోని హసన్‌పూర్‌లో విందు ముగించుకుని తిరిగి వస్తున్నారని పోలీసులు తెలిపారు. మృతులను లక్కీ, సల్మాన్, షారుక్, షెహ్నవాజ్‌గా పోలీసులు గుర్తించారు. వీరంతా కామెడీ వీడియోలను రూపొందిస్తుంటారని పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఇద్దరికి వైద్య చికిత్స అందిస్తున్నట్లు ప్రభుత్వాసుపత్రి వైద్యులు తెలిపారు. -
హమాస్ స్థావరంపై ఇజ్రాయెల్ దాడి.. 39 మంది మృతి!
ఇజ్రాయెల్- హమాస్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఇజ్రాయెల్ నిరంతరం హమాస్ ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడుతోంది. తాజాగా గాజా స్ట్రిప్‌లోని ఒక పాఠశాలలోగల హమాస్ స్థావరం లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడిలో 39 మంది మృతి చెందారని, పలువురు గాయపడ్డారని సమాచారం.హమాస్‌కు చెందిన అల్-అక్సా టెలివిజన్ ఒక ప్రకటనలో ఇజ్రాయెల్ దాడిలో 39 మంది మృతి చెందారని తెలిపింది. అయితే పాలస్తీనియన్ న్యూస్ ఏజెన్సీ ఇజ్రాయెల్ దాడుల్లో 32 మంది మృతి చెందారని పేర్కొంది. పాలస్తీనియన్లకు సహాయం అందించే ఐక్యరాజ్యసమితి ఏజెన్సీ నిర్వహిస్తున్న పాఠశాలపై తమ యుద్ధ విమానాలు దాడి చేశాయని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. ‘హమాస్’, ‘ఇస్లామిక్ జిహాద్’ సంస్థలు తమ కార్యకలాపాలకు ఈ పాఠశాలను స్థావరంగా ఉపయోగించుకున్నాయని ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది. అయితే దీనికి సంబంధించిన ఎలాంటి ఆధారాలను చూపలేదు. -
ట్రెక్కింగ్‌కు వెళ్లి నలుగురు మృతి..?
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ ఉత్తరకాశీలో ట్రెక్కింగ్(పర్వతారోహణ)కు వెళ్లిన 22 మంది సభ్యుల టీమ్‌లో నలుగురు గల్లంతయ్యారు. ప్రతికూల వాతావరణం వల్ల వారు దారితప్పి మిస్సయినట్లు తెలుస్తోంది. వీరంతా సహస్రతాల్ ప్రాంతంలో మే29న ట్రెక్కింగ్ ప్రారంభించారు. వీరంతా సాహస యాత్ర ముగించుకుని జూన్7న తిరిగి రావాల్సి ఉంది. అయితే యాత్ర మధ్యలోనే నలుగురు దారితప్పి కనిపించకుండా పోవడంతో మిగిలిన వారిని వెనక్కి తీసుకురావాల్సిందిగా ట్రెక్రింగ్ ఏజెన్సీ ఎస్డీఆర్ఎఫ్ను కోరింది. 4100 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న సహస్రతాల్ ప్రాంతంలో మొత్తం ఏడు సరస్సులుంటాయి. ఇక్కడి నుంచే పాండవులు స్వర్గానికి వెళ్లారని నమ్ముతారు. -
ఒడిశాలో వడగాడ్పుల విలయం.. 99 మంది మృతి!
దేశంలోని పలు ప్రాంతాల్లో ప్రస్తుతం విపరీతమైన వేడి వాతావరణం నెలకొంది. వడగాలుల తీవ్రతకు ఇప్పటికే పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఉష్ణోగ్రత రానురాను రికార్డులను బద్దలు కొడుతూనే ఉంది. విపరీతమైన ఎండల కారణంగా పలువురు అనారోగ్యానికి గురై ఆసుపత్రులలో చేరుతున్నారు.ఒడిశాలో ఎండల ప్రభావం అంతకంతకూ పెరుగుతూ వస్తోంది. ఇది పలువురి ప్రాణాలను బలిగొంటోంది. ఒడిశాలో గత 72 గంటల్లో 99 మంది వడదెబ్బ కారణంగా మృతి చెందారు. ఈ 99 మరణాల్లో 20 కేసులను జిల్లా మేజిస్ట్రేట్లు నిర్ధారించారు. ఈ సందర్భంగా ఒడిశా స్పెషల్ రిలీఫ్ కమిషనర్ మాట్లాడుతూ వడదెబ్బ కారణంగా ఇప్పటివరకూ రాష్ట్రంలో 141 మంది మృతి చెందినట్లు వివిధ జిల్లాల మెజిస్ట్రేట్‌లలో నమోదయ్యిందన్నారు. During the last 72 hours, 99 alleged sun stroke death cases have been reported by the Collectors. Out of 99 alleged cases, 20 cases have been confirmed by the Collectors. During this summer, total 141 alleged sun stroke death cases have been reported by the Collectors out of… pic.twitter.com/bWXsiaFA3F— ANI (@ANI) June 3, 2024 -
‘ముందు ఓటు.. తర్వాతే తల్లి అంత్యక్రియలు’
దేశంలో లోక్‌సభ ఎన్నికల తుది విడత పోలింగ్ నేడు(శనివారం) జరుగుతోంది. దీనిలో భాగంగా బీహార్‌లోని జెహనాబాద్ లోక్‌సభ నియోజకవర్గానికి కూడా పోలింగ్ కొనసాగుతోంది. అయితే ఈ నియోజక వర్గంలో ఒక విచ్రిత ఉదంతం వెలుగు చూసింది. ఇది అందరినీ ఆశ్చర్యానికి గురిచేయడమే కాకుండా ఓటర్లకు ఆదర్శంగా నిలుస్తోంది.జెహనాబాద్‌లోని బూత్ నంబర్ 151 పరిధిలోని దేవ్ కులీ గ్రామానికి చెందిన మిథిలేష్ యాదవ్, మనోజ్ యాదవ్‌ల తల్లి వృద్ధాప్య సమస్యలతో మృతి చెందింది. అయితే కుటుంబ సభ్యులు ఓటు వేసి, వచ్చాకనే ఆ మహిళకు దహన సంస్కారాలు చేయాలని నిర్ణయించుకున్నారు.ఈ సందర్భంగా మృతురాలి కుమారుడు మనోజ్‌యాదవ్ మాట్లాడుతూ ఐదేళ్లకోసారి ఓటింగ్ వస్తుందని, ఇవి ఎంతో ముఖ్యమైనవని, అందుకే తామంతా ముందుగా ఓటువేయాలనుకున్నామని తెలిపారు. ఓటింగ్ పూర్తయ్యాకనే తల్లికి దహన సంస్కారాలు చేస్తామన్నారు.మృతురాలి కుటుంబానికి చెందిన ఉషాదేవి మాట్లాడుతూ ఓటింగ్ అనేది తప్పనిసరి అని, అందుకే ముందుగా ఓటు వేయబోతున్నామని తెలిపారు. వారంతా క్యూలో నిలుచుని, తమ వంతు వచ్చాక ఓటువేశారు. ఆ తర్వాత తల్లి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. -
వడదెబ్బకు 15 మంది పోలింగ్ సిబ్బంది మృతి
ఉత్తరప్రదేశ్‌లో వడదెబ్బకు 15 మంది పోలింగ్ సిబ్బంది మృతి చెందారు. శుక్రవారం నాడు ఏర్పడిన అత్యధిక ఉష్ణోగ్రతలకు తాళలేక జనం విలవిలలాడిపోయారు. ఈ నేపధ్యంలో ఎన్నికల విధుల్లో నిమగ్నమైన 15 మంది పోలింగ్ సిబ్బంది కన్నుమూశారు. ఈ వివరాలను ఎన్నికల అధికారులు తెలిపారు. యూపీలోని మిర్జాపూర్ జిల్లాలో 13 మంది ఎన్నికల సిబ్బంది ఎండి వేడిమి కారణంగా తీవ్ర జ్వరం, అధిక రక్తపోటుకు గురై చికిత్స పొందుతూ మృతి చెందారు. మరో 23 మంది ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సోన్‌భద్ర జిల్లాలో ఎన్నికల విధుల్లో ఉన్న మరో ఇద్దరు ఉద్యోగులు మృతి చెందారు.ఉత్తరప్రదేశ్‌లోని 13 లోక్‌సభ స్థానాలకు ఈరోజు (శనివారం) పోలింగ్ జరుగుతోంది. ఈ నేపధ్యంలో ఓటర్లు ఎండవేడిమికి గురికాకుండా ఉండేందుకు పలు ఏర్పాట్లు చేశారు. పోలింగ్ స్టేషన్ల వద్ద పారామెడికల్ సిబ్బందిని, ఆశా వర్కర్లను అందుబాటులో ఉంచారు. ఓటర్లతో పాటు పోలింగ్ సిబ్బంది తేలికపాటి కాటన్ దుస్తులు ధరించాలని, వాటర్ బాటిల్ దగ్గర ఉంచుకోవాలని అధికారుల సూచించారు. -
భారత జవాను ప్రాణాలను బలిగొన్న వడదెబ్బ
దేశంలో ఉత్తరాదిన ఎండలు మండిపోతున్నాయి. ఈ నేపధ్యంలో ఒక విషాదం చోటుచేసుకుంది. భారత్-పాకిస్తాన్ సరిహద్దులో విధులు నిర్వహిస్తున్న సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్)నకు చెందిన ఒక జవాను వీరమరణం పొందారు. ఆ సైనికుని అజయ్‌కుమార్‌గా గుర్తించారు. వడదెబ్బ కారణంగా ఆ జవాను కన్నుమూశారని సమాచారం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా విపరీతమైన వేడి వాతావరణం నెలకొంది. ఈ ఘటన జరిగిన ప్రాంతంలో ఉష్ణోగ్రతలు 55 డిగ్రీలకు పైగా ఉన్నాయి. ఈ ఎండ వేడిమికి బీఎస్ఎఫ్ జవానులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.బీఎస్ఎఫ్ జవాను అజయ్ కుమార్ ఆదివారం (మే 26) భాను సరిహద్దు పోస్ట్‌లో విధులు నిర్వహిస్తున్నారు. ఎండ వేడిమికి ఆయన ఆరోగ్యం క్షీణించింది. దీంతో చికిత్స నిమిత్తం అజయ్‌ను రామ్‌గఢ్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి చికిత్స పొందుతూ సోమవారం (మే 27) ఉదయం ఆసుపత్రిలో కన్నుమూశారు. రామ్‌గఢ్ ఆస్పత్రి లో వీరమరణం పొందిన జవానుకు గౌరవ వందనం సమర్పించారు. ఈ సందర్భంగా 173వ కార్ప్స్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అధికారులు కూడా ఈ సైనికునికి పూలమాల వేసి నివాళులర్పించారు.వీరమరణం పొందిన సైనికుని మృతదేహాన్ని రామ్‌గఢ్ నుండి జోధ్‌పూర్‌కు రోడ్డు మార్గంలో తీసుకువెళ్లనున్నారు. అనంతరం మృతదేహాన్ని జోధ్‌పూర్ నుంచి పశ్చిమ బెంగాల్‌లోని జల్పైగురికి విమానంలో తరలించనున్నారు. షేర్‌గఢ్ పోలీసులు ఈ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
దేశాన్ని వణికించిన 10 భారీ అగ్ని ప్రమాదాలు
దేశాన్ని అగ్ని ప్రమాదాలు వణిస్తున్నాయి. తాజాగా గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో ఒక గేమింగ్ జోన్లో అగ్ని ప్రమాదం సంభవించి, 27 మంది మృతి చెందారు. ఈ ఘటన మరువక ముందే ఢిల్లీలోని వివేక్ విహార్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం జరిగి, ఆరుగురు శివువులు సజీవ దహనమయ్యాయి. ప్రతీ ఏటా వేసవిలో అగ్ని ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. దేశాన్ని వణికించిన కొన్ని అగ్ని ప్రమాదాల గురించి ఇప్పుడు తెలుసుకుంది.1. డిసెంబర్ 1995 (హర్యానా, మండి దబ్వాలి)భారతదేశంలో చోటుచేసుకున్న అతిపెద్ద అగ్ని ప్రమాదం ఇది. హర్యానాలోని మండీ దబ్వాలిలో జనరేటర్లో షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. ఈ నేపధ్యంలో జరిగిన తొక్కిసలాటలో 540 మంది మృత్యువాత పడ్డారు.2. ఫిబ్రవరి 1997(ఒడిశా, బరిపడ) మతపరమైన ఆచారాలు నిర్వహిస్తున్న సందర్భంలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 206 మంది మృతి చెందారు. ఈ ఘటనలో 148 మంది తీవ్రంగా గాయపడ్డారు.3. జూన్ 1997 (న్యూఢిల్లీ) గ్రీన్ పార్క్‌లోని ఉపహార్ సినిమా థియేటర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 59 మంది మరణించారు. సినిమా చూస్తుండగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 103 సజీవ దహనమయ్యారు.4. జూన్ 2002 (ఆగ్రా) ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలోని శ్రీలీ ఇంటర్నేషనల్ ఫుట్‌వేర్ ఫ్యాక్టరీలో జరిగిన అగ్ని ప్రమాదంలో 42 మంది మృత్యువాత పడ్డారు.5. జూలై 2004(తంజావూరు, తమిళనాడు)తంజావూరు జిల్లా కుంభకోణంలోని ఓ పాఠశాలలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 94 మంది అమాయక చిన్నారులు సజీవదహనమయ్యారు. ఈ ఘటన తమిళనాడు చరిత్రలోనే అత్యంత ఘోరమైన ప్రమాదాల్లో ఒకటిగా పరిగణిస్తారు.6. సెప్టెంబర్, 2005(ఖుస్రోపూర్, బీహార్) బీహార్‌లోని ఖుస్రోపూర్ గ్రామంలో అక్రమంగా నిర్వహిస్తున్న బాణసంచా కర్మాగారంలో జరిగిన అగ్ని ప్రమాదంలో 35 మంది చనిపోయారు. దీంతో పాటు 50 మంది తీవ్రంగా గాయపడ్డారు.7. ఏప్రిల్, 2006(మీరట్) ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లోని విక్టోరియా పార్క్‌లో బ్రాండ్ ఇండియా ఫెయిర్‌లో సంభవించిన భారీ అగ్నిప్రమాదంలో 100 మంది మృత్యువాత పడ్డారు.8. డిసెంబర్, 2011(కోల్‌కతా) కోల్‌కతాలోని ఏఎమ్‌ఆర్‌ఐ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం కారణంగా కార్బన్ మోనాక్సైడ్ వాయువు వ్యాపించి 89 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆసుపత్రి చుట్టూ మృతదేహాలు కుప్పలు కనిపించాయి.9. సెప్టెంబర్, 2012(శివకాశి, తమిళనాడు) ముదలిపట్టిలోని ఓ బాణసంచా ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 54 మంది ప్రాణాలు కోల్పోగా, 78 మంది తీవ్రంగా గాయపడ్డారు.10. మే, 2022 (న్యూఢిల్లీ)పశ్చిమ ఢిల్లీలోని ముండ్కా మెట్రో స్టేషన్ సమీపంలోని నాలుగు అంతస్తుల భవనంలో జరిగిన అగ్ని ప్రమాదంలో 30 మందికి పైగా జనం మరణించారు. -
పోలింగ్ వేళ జమ్ములో కాల్పుల కలకలం
జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్, షోపియాన్లలో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో బీజేపీ నేత, మాజీ సర్పంచ్ అజాజ్ అహ్మద్ షేక్ తీవ్రంగా గాయపడ్డారు. బాధితుడిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఉదంతం షోపియాన్‌లోని హీర్పోరాలో చోటుచేసుకుంది. #WATCH | Anantnag, J&K: Terrorists fired upon and injured a lady Farha, resident of Jaipur and spouse of Tabrez at Yannar. Injured evacuated to hospital for treatment.(Video source: Local) https://t.co/7UUq9YXR8Y pic.twitter.com/im1NZ2hSEm— ANI (@ANI) May 18, 2024 జమ్మూకశ్మీర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అజాజ్ అహ్మద్ షేక్ ఇటీవలే బీజేపీలో చేరారు. అతనిపై కాల్పులు జరిపిన ఉగ్రవాదులు వెంటనే అక్కడి నుంచి పారిపోయారు. మరో ఘటన అనంత్‌నాగ్‌లో చోటుచేసుకుంది. ఇక్కడి యన్నార్ ప్రాంతంలో రాజస్థాన్‌లోని జైపూర్‌కు చెందిన ఫర్హా అనే మహిళ, ఆమె భర్త తబ్రేజ్‌లపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. గాయపడిన ఇద్దరినీ చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలు జరిగిన ప్రాంతంలో పోలీసులు మోహరించారు. ఈ రెండు ఉగ్రవాద దాడులపై పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ ట్విట్టర్లో తన స్పందనను తెలిపారు. ‘ఈరోజు పహల్గామ్లో ఇద్దరు పర్యాటకులు గాయపడిన ఘటనను, షోపియాన్‌లోని హీర్పోరాలో సర్పంచ్‌పై జరిగిన దాడిని ఖండిస్తున్నాం. ఇది ఆందోళన కలిగించే అంశం. కశ్మీర్లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని ప్రభుత్వం చెబుతున్న నేపథ్యంలో ఈ దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి’ అని పేర్కొన్నారు.Terrorist fired upon a person Aijaz Ahmad at Heerpora, Shopian. Injured evacuated. Area cordoned off. Further details to follow: Kashmir Zone Police pic.twitter.com/Y31BJouz0J— ANI (@ANI) May 18, 2024 -
ఆ డ్రగ్‌తో ఎదుటివాళ్ల మైండ్‌ని మన కంట్రోల్లో పెట్టుకోవచ్చట!
మత్తుమందులకు బానిసై రోజంతో మత్తులో జోగుతుండే వ్యక్తులు గురించి విన్నాం. వారిని ఆ వ్యసనం నుంచి బయపడేసేందుకు నానాయాతన పడుతుంటారు సంబంధికులు. అందుకోసం డీ అడిక్షన్ సెంటర్లు కూడా వచ్చేశాయి. అయితే ఈ మత్తు మందులన్నీ వాళ్లంతటా వాళ్లు వొళ్లు తెలియకుండా ఊహ ప్రపంచంలో విహరించేందుకు వాడుతుంటారు కానీ ఈ కొత్త రకం డ్రగ్ మాత్రం ఏకంగా అవతలి వాళ్ల మైండ్‌ని కంట్రోల్ చేస్తుందట. కొందరూ దుండగలు ఈ డ్రగ్‌తో అమాయక ప్రజలను దోచుకోవడం, హత్యలు చేయడం వంటివి చేస్తున్నారు. ఇంతకీ ఏంటి కొత్త రకం డ్రగ్. ఎలా అవతల వాళ్ల మైండ్‌ని కంట్రోల్ చేయగలరు?ఈ డ్రగ్ పేరు స్కోపోలమైన అనే సింథటిక్ డ్రగ్. దీన్ని ఔషధాల తయారీ కోసం ఉపయోగిస్తారు. వికారం, నిలకడలేనితనం, కొన్ని ఆపరేషన్ల తర్వాత రోగులకు ఇచ్చే ఔషధాల్లోనూ దీన్ని కలుపుతారు. అయితే ఇది సహజంగా లభించేది కాదు. కొన్ని సహజ పదార్ధాలకు మరి కొన్ని రసాయనాలు కలపడం ద్వారా స్కోపోలమైన్‌ను కృత్రిమంగా తయారు చేస్తారు. ఘన, ద్రవ రూపాల్లో లభిస్తుంది. దీన్ని ఉమ్మెత్త పువ్వు నుంచి తయారు చేస్తారు. ఒకప్పుడు పిచ్చొళ్లను చేసేందుకు..ఒకప్పుడు దేశంలో, ప్రజల్నిపిచ్చోళ్లను చేసేందుకు ఉమ్మెత్త పువ్వుల్ని నూరి పాలలో కలిపేవారు. అందులో నుంచి కొంత భాగాన్ని తీసి దాన్ని ఉపయోగించి స్కోపోలమైన్ సింథటిక్ డ్రగ్‌గా తయారు చేస్తున్నారు. మెక్సికోలోని డ్రగ్ గ్యాంగులు దీన్నితయారు చేసి ప్రపంచం అంతటా సరఫరా చేసినట్లు నార్కోటిక్ కంట్రోల్ డిపార్ట్మెంట్ చీఫ్ కెమికల్ ఎగ్జామినర్ డాక్టర్ దులాల్ కృష్ణ సాహా వెల్లడించారు.ఎలా పని చేస్తుందంటే..రెండో ప్రపంచ యుద్ధంలో స్కోపోలమైన్ డ్రగ్ ఉపయోగించినట్లు ఇంటెలిజెన్సీ వర్గాల సమాచారం. ఆ సమయంలో దీన్ని ద్రవ రూపంలో ఇంజక్షన్‌గా ఇచ్చేవారు. స్కోపోలమైన్‌ను ఇప్పటికీ ఔషధంగా ఉపయోగిస్తున్నామని బంగబంధు షేక్ ముజిబ్ మెడికల్ యూనివర్సిటీలో ఫార్మకాలజీ డిపార్ట్మెంట్ ఛైర్మన్ ప్రొఫెసర్ డాక్టర్ సౌదుర్ రహమాన్ చెప్పారు. దీంతో పాటు మరి కొన్ని డ్రగ్స్ వైద్యశాస్త్రంలో ఉపయోగిస్తున్నారు. రెండో ప్రపంచ యుద్ధంలో నిఘా వర్గాలు ఈ స్కోపోలమైన్‌ను ఉపయోగించి ప్రత్యర్థుల నుంచి నిజాలను రాబట్టేవారు. ఈ డ్రగ్‌ను ప్రయోగించిన తర్వాత శత్రువులు తమ మెదడు మీద నియంత్రణ కోల్పోయి ఎదుటి వ్యక్తులు చెప్పినట్లు చేసేవారు. ఎవరితోనైనా నిజాలు మాట్లాడించడానికి ఇది ఔషధంగా ఉపయోగపడుతుంది. అయితే ఈ పౌడర్‌ను వాసన పీల్చేలా చేస్తే అది సైతాన్ శ్వాసగా మారుతుంది. అలాగే దీన్ని వికారం, ఇతర అనారోగ్యాలకు ఉపయోగిస్తే ఔషధం లాగా పని చేస్తుందని రహమాన్ వివరించారు.నేరాలలో ఎక్కువగామోసాలు, కిడ్నాపులు, ఇతర నేరాల కోసం స్కోపోలమైన్‌ను పౌడర్ రూపంలో ఉపయోగిస్తున్నారు. ఈ పౌడర్‌ను విజిటింగ్ కార్డు, క్లాత్, మొబైల్ స్క్రీన్ల ద్వారా ఇతరుల మీద ప్రయోగించడం చాలా తేలిక. ఈ పౌడర్‌ను ప్రయోగించాలనుకున్న వ్యక్తి మీద, అతడు శ్వాస తీసుకునే సమయంలో ముక్కుకు నాలుగు నుంచి ఆరు అంగుళాల దూరంలో ఉంచి ప్రయోగించినా.. అది బాధితుడి ముక్కులోకి చేరుతుంది. దీన్ని నోటి ద్వారా కూడా ఉపయోగించవచ్చు. ముక్కు ద్వారా ప్రయోగించాలని భావిస్తే నాలుగు అంగుళాల దూరంగా ఉండటం ముఖ్యం అని డాక్టర్ దులాల్ కృష్ణ సాహా చెప్పారు. ఇక్కడ ఈ డ్రగ్‌ని పీల్చిన పది నిముషాల నుంచి సదరు వ్యక్తి మీద ప్రభావం ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత కాసేపటికి మెదడు నియంత్రణ కోల్పోతుంది. మళ్లీ మాములు కావడానికి గంట నుంచి మూడు గంటలు పడుతుంది.(చదవండి: ఓటర్లకు స్ఫూర్తి ఆ వృద్ధ మహిళలు..! ఆ ఏజ్‌లోనూ..) -
నామినేషన్‌కు ‘మృతుడు’.. కలెక్టరేట్లో కలకలం!
ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో యూపీలోని వీవీఐపీ సీటు అయిన వారణాసిలో నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ స్థానం నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తుండడంతో ఇది హాట్ సీటుగా మారింది. తాజాగా వారణాసిలో ‘నేను బతికే ఉన్నాను’ అనే ప్లకార్డు పట్టుకుని ఓ వ్యక్తి ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసేందుకు కలెక్టరేట్‌కు చేరుకున్నాడు. అతనిని చూసిన అక్కడున్నవారంతా ఆశ్యర్యపోయారు.సంతోష్ మురత్ సింగ్ అనే వ్యక్తి రూ. 25 వేల రూపాయలతోపాటు నామినేషన్ ఫారం పట్టుకుని కలెక్టరేట్‌కు వచ్చాడు. అయితే కలెక్టరేట్ గేటు వద్దనే అధికారులు ఆయనను అడ్డుకున్నారు. దీంతో కోపోద్రిక్తుడైన సంతోష్ మురత్ సింగ్ గేటు బయట ఆందోళనకు దిగాడు.సంతోష్ మురత్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ తాను చనిపోయినట్లు రెవెన్యూ రికార్డుల్లో అబద్దపు రాతలు రాయించి, కొందరు మోసపూరితంగా తన భూమిని స్వాధీనం చేసుకున్నారని వాపోయాడు. ఇప్పుడు తాను జీవించే ఉన్నానని నిరూపించుకునేందుకే ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నట్లు తెలిపాడు.ఇలా ఎన్నికల్లో పోటీకి దిగడం సంతోష్‌కి కొత్తేమీ కాదు. 20 ఏళ్లుగా పలు ఎన్నికల్లో పోటీ చేస్తూ వస్తున్నాడు. 2012లో రాష్ట్రపతి పదవికి జరిగిన ఎన్నికల్లో కూడా పోటీ చేశాడు. 2014, 2019లలో వారణాసి లోక్‌సభ స్థానం నుంచి ప్రధాని మోదీపై పోటీ చేసేందుకు సంతోష్ నామినేషన్ దాఖలు చేశాడు. అయితే అతని దరఖాస్తు తిరస్కరణకు గురైంది.రెవెన్యూ రికార్డుల ప్రకారం వారణాసిలోని చితౌని నివాసి సంతోష్ మురత్ సింగ్ 2003లో ముంబైలో రైలులో బాంబు పేలుళ్లు సంభవించినప్పుడు మృతి చెందాడు. నకిలీ మరణ ధృవీకరణ పత్రం ఆధారంగా, అతని 1.5 ఎకరాల భూమిని అతని బంధువులు స్వాధీనం చేసుకుని, దానిని విక్రయించారు. సంతోష్ తాను సజీవంగానే ఉన్నానని, తన భూమిని దక్కించుకునేందుకే ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని అందరితో చెబుతుంటాడు. -
AP: పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
సాక్షి, విశాఖపట్నం/నెట్వర్క్: ద్రోణి ప్రభావంతో మంగళవారం రాష్ట్రంలోని పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. తీవ్రమైన ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వర్షాలు బీభత్సం సృష్టించాయి. అనేక చోట్ల పిడుగులు పడగా.. ఏడుగురు మృత్యువాత పడ్డారు. ముఖ్యంగా ఉమ్మడి గోదావరి, కృష్ణా జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడ్డాయి. వర్షాల వల్ల అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. చెట్లు, విద్యుత్ స్తంభాలు పడిపోవడంతో పలుచోట్ల సరఫరాకు అంతరాయం ఏర్పడింది.రాజమహేంద్రవరంలో కుండపోత వర్షానికి వీధులు జలమయమయ్యాయి. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లా వేమగిరిలో 12.4 సెం.మీ. భారీ వర్షపాతం నమోదైంది. మండపేట (కోనసీమ)లో 12, రాజమహేంద్రవరం 9.2, నూజివీడు (ఏలూరు) 7.3, మచిలీపట్నం (కృష్ణా) 7.3 సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలో 45 చోట్ల 2 నుంచి 6 సెం.మీ. వర్షపాతం రికార్డయింది. ఏలూరు జిల్లావ్యాప్తంగా మంగళవారం మధ్యాహ్నం సుమారు గంటసేపు ఈదురుగాలులు, ఉరుములతోపాటు మోస్తరు వర్షం కురిసింది. నందిగామ పాత బస్టాండ్ ప్రాంతంలో జాతీయ రహదారిపై దాదాపు అడుగుమేర నీరు నిలిచింది.పిడుగుపాటుకు గురై.. తూర్పు గోదావరి జిల్లా తాళ్లపూడి మండలం బల్లిపాడు గ్రామానికి చెందిన కవల నాగేశ్వరరావు (55), ఏలూరు జిల్లా లింగపాలెం మండలం యడవల్లి గ్రామంలో పర్సా రామారావు (44), ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం జొన్నవారిగూడెం ఎర్రకాలువ ప్రాంతంలో కరిపోతుల నాగేశ్వరరావు (72), పల్నాడు జిల్లా క్రోసూరు మండలం ఊటుకూరులో మొక్కజొన్న కోతలకు వెళ్లిన తల్లీకూతుళ్లు బొందెల నాగేంద్రమ్మ (53), నాగరాణి(33), పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం కుందురువారిపాలెంకు చెందిన ఆవుల కోటేశ్వరరావు (42), అతని మేనల్లుడు జమ్ముల గోపి(35) మరణించారు. పశ్చిమ గోదావరిజిల్లా శృంగవృక్షంలోని వట్టూరి వారి వీధిలో మంగళవారం వీచిన ఈదురుగాలులకు కొబ్బరి చెట్టు కూలి నిమ్మల శ్రీనివాస్ (49) అనే వ్యవసాయ కూలీ మృత్యువాతపడ్డాడు.తగ్గుముఖం పట్టిన ఉష్ణోగ్రతలుద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. సాధారణం కంటే 2–5 డిగ్రీలు తక్కువగా నమోదయ్యాయి. లద్దగిరి (కర్నూలు)లో 43.3, ఎండ్రపల్లి (ప్రకాశం) 43.2, మద్దూరు (వైఎస్సార్), మంగ నెల్లూరు (తిరుపతి)లో 42.9 చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.మరో మూడు రోజులు వానలే..అధిక ఉష్ణోగ్రతలు, వడగాడ్పులతో అల్లాడుతున్న రాష్ట్రానికి మంగళవారం ఉపశమనం లభించింది. తూర్పు విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకు తెలంగాణ, దక్షిణ అంతర్గత కర్ణాటక మీదుగా సముద్ర మట్టానికి 1.5 కి.మీ. ఎత్తులో విస్తరించి ఉన్న ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురవడంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. బుధవారం శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, నెల్లూరు, పల్నాడు, అన్నమయ్య, బాపట్ల, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్, ప్రకాశం జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవవచ్చని తెలిపింది. గురువారం శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కర్నూలు జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగిలిన ప్రాంతాల్లో జల్లులకు ఆస్కారం ఉందని వివరించింది. శుక్రవారం శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి సీతారామరాజు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే వీలుందని పేర్కొంది. -
ఒబెసిటీ ఇంత ప్రమాదకరమైనదా? పాపం ఆ వ్యక్తి..!
ఇటీవల కాలంలో చాలామందిని వేధిస్తున్న సమస్య ఒబెసిటీ. ప్రస్తుతం ఉన్న అస్తవ్యస్తమైన జీవన విధానం, కల్తీ ఫుడ్ల కారణంగా టీనేజీ యువత ఈ సమస్యను ఎక్కువగా ఫేస్ చేస్తోంది. కనీసం పెళ్లీడు రాకమునుపే పెద్దవాళ్లలా కనిపించేంత భారీకాయంతో సతమతమవ్వుతున్నారు. అచ్చం అలాంటి సమస్యతోనే అత్యంత లావుగా ఉండే వ్యక్తి మరణించాడు. జస్ట్ 33 ఏళ్లకే కానరాని లోకాలకు వెళ్లిపోయాడు. ఒబెసిటీ ఇంత ప్రమాకమైనదే? లావుగా ఉంటే అంతే సంగతులా..!లావుగా ఉంటే లైఫ్ లాసే అని ఈ వ్యక్తిని చూస్తే అనిపిస్తుంది. ఈ దిగ్బ్రాంతికర ఘటన యూకేలో చోటు చేసుకుంది. బ్రిటన్ నివాసి జాసన్ హోల్డన్ యూకేలోనే అత్యంత లావుగా ఉండే వ్యక్తి. అతడి బరువు ఏకంగా 317 కిలోలు. అతన్ని ఆస్పత్రికి తీసుకువెళ్లడానికి అగ్నిమాపక సిబ్బంది సహాయం తీసుకోవాలట. ఇక అతడు పడుకోవాలన్నా.. ప్రత్యేకంగా రూపొందించిన ఫర్నిచర్‌పై బెడ్‌పై నిద్రిస్తాడు. అతడికి అతిగా తినే అలవాటు చిన్నప్పటి నుంచి ఉంది. అది ఎంతలా ఉందంటే రోజువారీగా ఏకంగా పదివేలకు పైగా కేలరీలు తీసుకునేంత స్థాయిలో ఉంది. అతడి బ్రేక్‌ఫాస్ట్‌లో డోనార్ కబాబ్‌లు తీసుకుంటాడంటే..అతడు ఎంతలా తింటాడో చెప్పాల్సిన పనిలేదు. దీని కారణంగానే ఆరోగ్యం క్షీణించటం మొదలయ్యింది. దీంతో అతను కొన్నాళ్లుగా గదికే పరితం కాగా, క్రమేణ మంచానికే పరిమతమయ్యాడు. ఆ తర్వాత చలనశీలత దెబ్బతింది. మొదట అతడి శరీరంలో కిడ్నీ పనిచేయడం మానేసింది. అలా నెమ్మదిగా మిగతా అవయవాలు వైఫల్యం చెందడం ప్రారంభించడంతో 34వ ఏటాలోకి అడుగుపెట్టడానికి కొన్ని రోజుల ముందే కానరాని లోకాలకు వెళ్లిపోయాడు. అతడు గతేడాది ఒక ఇంటర్వ్యూలో తన సమయం అయిపోయిందని, తాను ఎన్నాళ్లో బతకనని చెప్పేశాడు కూడా. పైగా అలా కాకుండా ఏదైనా చెయ్యాలని ప్రయత్నిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. ఒకసారి 2020లో ప్రమాదవశాత్తు హోల్టన్ మూడవ అంతస్తు నుంచి పడిపోయాడు. పాపం అతడిని రక్షించటానికి ఏకంగా 30 మందికి పైగా అగ్నిమాపక సిబ్బంది, క్రేన్ రంగంలోకి దిగి కాపాడారు. ఆ ఘటనను తలచుకుంటూ అది తన జీవితంలో అత్యంత బాధకరమైన ఘటనగా పేర్కొన్నాడు హోల్డన్. ఆ టైంలో తనను చూసేందుకు పెద్ద సంఖ్యలో వచ్చిన జనాన్ని చూసి చాలా బాధపడడ్డానని అన్నాడు. హోల్డన్ మానసిక స్థితి ఎంతలా మారిపోయిందంటే.. లావుగా ఉండే వ్యక్తులను ఆధారం చేసుకుని తీసిన సినిమాలు సైతం అతడికి భయానక చిత్రాలుగా అనిపించాయి. కనీసం తన అమ్మను కూడా చూడొద్దని కన్నీటి పర్యంతమయ్యాడు. దీన్ని బట్టి చూస్తే.. ఈ అధిక బరువు కారణంగా ఎంతగా ఇబ్బంది పడ్డానేది నేరుగానే తెలుస్తోంది. అతను తరుచుగా ఈ బ్రిటన్ దేశంలో తానే అత్యంత లావుగా ఉన్నవ్యక్తిని అని బాధపడేవాడు. అతడి పోస్ట్‌మార్టం రిపోర్టులో కూడా అధిక బరువు కారణంగా అవయవాల వైఫల్యం చెంది మరణించినట్లు ఉంది. హోల్టన్ ఈ అధిక బరువు కారణంగా స్ట్రోక్‌లు, రక్త గడ్డకట్టడం వంటి పలు రకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నాడు. అధిక బరువు అనేది ప్రాణాంతకమైన సమస్యే. నిర్లక్ష్యం వహించకుండా ఆరోగ్యకరమైన పద్ధతిలో తగ్గించుకునే యత్నం చేయకపోతే అంతే సంగతులని ఈ ఉదంతమే చెబుతోంది. అందువల్ల కొద్దిపాటి శారీరక శ్రమ, క్యాలరీల తక్కువ ఉన్న ప్రత్యామ్నాయ ఆహారంతో బరువుని అదుపులో ఉంచుకునే యత్నం చేయండి. సుదీర్ఘకాలం ఆరోగ్యంగా జీవించండి.(చదవండి: సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?) -
US: వరుస విద్యార్థుల మరణాలు..ఎఫ్ఐఐడీఎస్ సీరియస్!
గతేడాది నవంబర్ నుంచి ఇప్పటి వరకు దాదాపు 11 మంది విద్యార్థులు వేర్వేరు పరిస్థితిల్లో అమెరికాలో ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఒక్కసారిగా యావత్ భారత్ తీవ్ర భయాదోళనలు వ్యక్తం చేసింది. నిజానికి మన దేశం నుంచి వేలాది మంది విద్యార్థులు ఉన్నత చదువులకై అమెరికా వైపుకే మొగ్గు చూపుతుంటారు. ఇప్పుడు ఆ దేశం సురక్షితమేనే అనే సందేహాలు అందరిలోనూ మెదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఆయా మరణాలపై దర్యాప్తు చేస్తున్న ప్రవాస భారతీయులకు సంబంధించిన ఫౌండేషన్ ఫర్ ఇండియా అండ్ ఇండియన్ డయాస్పోరా స్టడీస్(ఎఫ్ఐఐడీఎస్) చాలా షాకింగ్ విషయాలు వెల్లడించింది. ఈ ఘటనలు పునారావృత్తం కాకుండా యూఎస్ అధికారులు, విశ్వవిద్యాలయాలు సంస్థలు తక్షణమే తగు చర్యలు తీసుకోవాలని కోరింది. అంతేగాదు అమెరికాలో ఉండే భద్రతపై పరిజ్ఞానం లేకపోవడం వల్ల పర్యావరణ మరణాలు(మోనాక్సైడ్ విషప్రయోగం, అల్పోష్ణస్థితి), ఆత్మహత్యలు చేసుకునేలా ప్రేరిపించే మానసిక సమస్యలు వల్ల అనుమానాస్పద మరణాలు, హింసాత్మక నేరాలు జరిగినట్లు సర్వేలో వెల్లడించింది. ఆయా కారణాల వల్ల బాధిత విద్యార్థులు మరణాలకు కారణమని ఎఫ్ఐఐడీఎస్ సర్వేలో తేలింది. యూఎస్‌లో విద్య అనేది చాలామంది భారతీయ విద్యార్థుల కల అని పేర్కొంది. ఈ భయానక ఘటనలు ఒక్కసారిగా భారత సంతతి విద్యార్థులు, వారి కుటంబాల్లో తీవ్ర భయాందోళనలను రేకెత్తించాయని వెల్లడించింది. ప్రస్తుతం యూఎస్‌లో దాదాపుగా రెండు లక్షలకు పైగా భారత సంతతి విద్యార్థులు ఉన్నట్లు పేర్కొంది. మొత్తం విదేశీ విద్యార్థులలలో సుమారు 25% మంది విద్యార్థుల నుంచి ఫీజులు, ఖర్చులు రూపంలో అమెరికా దాదాపు రూ. 900 కోట్లు వరకు ఆర్జిస్తోందని ఎఫ్ఐఐడీఎస్ చీఫ్ ఖండేరావ్ కాండే అన్నారు. ఈ మరణాలు పెరిగినట్లయితే ఆ ఆదాయానికి గండి పడే అకాశాలు ఉండటమే గాక యూఎస్ విశ్వవిద్యాలయాల భద్రతపై తీవ్ర స్థాయిలో అనుమానాలు వ్యక్తం అయ్యే ప్రమాదం లేకపోలేదని ఎఫ్ఐఐడీఎస్ హెచ్చరించింది. అంతేగాదు దీన్నే అదనుగా చూసుకుని కొందరూ అమెరికా సమాజంపై ద్వేషపూరిత నేరాలకు ఆజ్యం పోసి భారతీయ అమెరికా కమ్యూనిటీ చుట్టూ పుకార్లు వ్యాపించేలా చేస్తున్నట్లు ఎఫ్ఐఐడీఎస్ నివేదికలో పేర్కొంది. ఈ నేపథ్యంలోనే ఎఫ్ఐఐడీఎస్ భారతీయ అమెరికన్ విద్యార్థులు ఆందోళనలు, భద్రతకు సంబంధించిన సర్వేను ప్రారంభించింది. ఆసక్తిగల భారత సంతతి విద్యార్థులు ఈ ఎప్ఐఐడీఎస్ వెబ్‌సైట్‌లోని సర్వేలో పాల్గొని తామ ఎదుర్కొంటున్న భయాందోళనలు గురించి వెల్లడించాలని పిలుపునిచ్చింది.అంతేగాదు అంతర్జాతీయ విద్యార్థులు ఎదుర్కొంటున్న భద్రత, శ్రేయస్సుకి సంబంధించిన ఆందోళనలు పరిష్కరించేలా యూఎస్ అధికారులు కొన్ని చర్యలు తీసుకోవాలని కోరింది ఎఫ్ఐఐడీఎస్ ►సురక్షిత విద్యను పెంపొందించడం: చాలామంది విదేశీ విద్యార్థులుకు తాము ఉన్న నిర్థిష్ట ప్రాంతాల్లో జరిగే నేరాలు, ప్రమాదాల పట్ల అవగాహన ఉండకపోడచ్చు . అందువల్ల విద్యాపరంగా సురక్షితంగా ఉండే ప్రాంతాల్లో ఉండేలా నిర్ణయాలు తీసుకునేలా సమాచారం అందించడం లేదా శక్తిమంతంగా ఎలా ఎదుర్కొవాలే అవగాహన కల్పించడం వంటివి చేయాలి. ►రెస్క్యూ విధానాలు మెరుగుపరచడం: అత్యవసర పరిస్థితుల్లో లేదా ప్రమాదంలో ఉన్న విద్యార్థుల భద్రత లేదా వారి క్షేమం నిర్థారించేలా తక్షణ ప్రతిస్పందన, సమర్థవంతమైన రెస్క్యూ విధానాలు చాలా ముఖ్యమైనవి. దీని వల్ల అంతర్జాతీయ విద్యార్థుల ప్రమాదాలను నియంత్రించగలుగుతాం. తద్వార విద్యారుల జీవితాలను కాపాడగలం కూడా. ►ర్యాగింగ్‌కి అడ్డుకట్టవేయడం: ర్యాగింగ్ వంటివి విద్యార్థుల శారీరీక, మానసిక ఆరోగ్యాన్ని తీవ్ర ప్రమాదంలో పడేస్తాయి. అటువంటి వాటికి వ్యతిరేకంగా కఠిన నియమాలు, నిబంధనల అమలు చేయడం వల్ల ఎలాంటి నేర పూరిత సంఘటనలు ఎదురవ్వకుండా నియంత్రించగలుగుతాం. తద్వారా విదేశీ విద్యార్థులకు సమగ్రమైన క్యాంపస్ వాతావరణాన్ని అందించగలుగుతాం. ►ప్రమాదాలు భద్రతపై అవగాహన: విదేశీ విద్యార్థుకు కొత్త ప్రదేశాల్లోని క్యాంపస్ లోపల, వెలుపల ఎదురయ్యే ప్రమాదాలు, నష్టాలు గురించి అవగాహన కల్పించాలి. అక్కడ తమ తోటి విద్యార్థుల వల్ల ఎదురయ్యే ప్రమాదాలు గురించి, తీసుకోవాల్సిన చర్యల గురించి కూడా వారికి అవగాహన కల్పించాలి. ►మానసిక ధైర్యం అందిచటం: విదేశీ విద్యార్థులు తమ వాళ్లను దేశాన్ని అన్నింటిని వదిలేసి ఇంత దూరం చాలా ప్రయాస పడి వస్తారు. వారికి ఇక్కడ ముందుగా ఎదరయ్యేది ఒంటిరితనం. ఇది వారిలో కలగుకుండా ఉండేలా మానసిక స్థైర్యాన్ని అందించేలా తోడ్పాటు అందించటం వల్ల కూడా అనుమానస్పద మరణాలకు అడ్డుకట్ట వేయగలుగుతాం. చివరిగా జాతి లేదా మతం ఆధారంగా భారత సంతతి విద్యార్థుల పట్ల ద్వేషపూరిత నేరాలు లేదా కుట్రలు జరుగుతున్నాయా అనేదానిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయడం. సత్వరమే వారికి న్యాయం అందేలా చేయడం. ముఖ్యంగా మైనారిటి వర్గాలపై జరిగిన వివక్ష లేదా హింస గురించి పూర్తి స్థాయిలో విచారించడం ముఖ్యం. ఈ చర్యలన్ని తీసుకుంటే తమ సొంత గడ్డను వదిలి ఎందో ప్రయాస పడి ఇంత దూరం వచ్చిని విదేశీ విద్యార్థులుకు సురక్షితమైన వాతావరణాన్ని, ధైర్యంగా విశ్వవిద్యాలయంలో చేరి మంచి చదువును పొందగలమనే భరోసాను వారికి అందించగలుగుతామని ఎఫ్ఐఐడీఎస్ పేర్కొంది. (చదవండి: కెనడాలో భారతీయ విద్యార్థి మృతి)