చైనాలో మహిళా జర్నలిస్టుకు ఐదేళ్ల జైలు China Sentenced 5 years Jail to Female Journalist. Sakshi
Sakshi News home page

చైనాలో మహిళా జర్నలిస్టుకు ఐదేళ్ల జైలు

Published Sat, Jun 15 2024 10:51 AM | Last Updated on Sat, Jun 15 2024 12:49 PM

China Sentenced 5 years Jail to Female Journalist

చైనాలో ‘మీటూ’ఉద్యమంలో పాల్గొన్న మహిళా జర్నలిస్టు హువాంగ్ షుకిన్‌పై దేశద్రోహం ఆరోపణలు చేస్తూ,  ఐదేళ్ల జైలు శిక్ష విధించారు. చైనా జర్నలిస్టుల సంఘం ఈ వివరాలను తెలియజేసింది. ‘ది అసోసియేటెడ్ ప్రెస్’ వెల్లడించిన వివరాల ప్రకారం షుకిన్‌కు ఒక లక్ష యువాన్ (రూ. 1,155,959) జరిమానా కూడా విధించారు. మూడు సంవత్సరాల క్రితం షుకిన్‌లో పాటు మరో కార్యకర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మీటూ ఉద్యమం చైనాలో గతంలో ఉధృతంగా సాగింది అయితే ప్రభుత్వం దానిని అణిచివేసింది. ఇలా ఉద్యమాల్లో పాల్గొనే నేతలను, కార్యర్తలను చైనా అజ్ఞాతంలో ఉంచడం గానీ లేదా వారికి జైలు శిక్ష విధించడం గానీ చేస్తుందనే ఆరోపణలున్నాయి. కాగా మహిళా జర్నలిస్టు షుకిన్‌ విడుదల తేదీ 2026, సెప్టెంబర్ 18గా కోర్టు ప్రకటించింది. ఇదే ఆరోపణలపై ఆమె స్నేహితుడు వాంగ్ జియాన్‌బింగ్‌కు మూడేళ్ల ఆరు నెలల శిక్ష విధించారు. షుకిన్‌ ఫ్రీలాన్స్ జర్నలిస్ట్. మహిళా హక్కుల కార్యకర్తగానూ పనిచేస్తున్నారు. కోర్టు తీసుకున్న నిర్ణయంపై అప్పీల్ చేస్తామని ఆమె అభిమానులు మీడియాకు తెలిపారు.

ప్రస్తుతం ఫ్రీలాన్సర్‌గా పనిచేస్తున్న షుకిన్‌ 2018లో తాను యూనివర్సిటీలో పీహెచ్‌డీ చేస్తున్నప్పుడు, అక్కడి సూపర్‌వైజర్‌ తనను లైంగికంగా వేధించాడని  ఆరోపిస్తూ మీటూ ఉద్యమం బాట పట్టారు. షుకిన్‌కు జైలు శిక్ష విధించడాన్ని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌కు చెందిన చైనా యూనిట్ డైరెక్టర్ సారా బ్రూక్స్ ఖండించారు. ఇది చైనాలో మహిళల హక్కులపై దాడి అని  ఆరోపించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement