మాల్దీవుల్లో విదేశీ జోక్యాన్ని వ్యతిరేకిస్తున్నాం: చైనా | China opposes external interference in Maldives | Sakshi
Sakshi News home page

మాల్దీవుల్లో విదేశీ జోక్యాన్ని వ్యతిరేకిస్తున్నాం: చైనా

Published Fri, Jan 12 2024 5:24 AM | Last Updated on Fri, Jan 12 2024 8:05 AM

China opposes external interference in Maldives - Sakshi

బీజింగ్‌: మాల్దీవుల అంతర్గత వ్యవహారాల్లో విదేశీ జోక్యాన్ని గట్టిగా వ్యతిరేకిస్తున్నామని చైనా పేర్కొంది. మాల్దీవుల సార్వ భౌమత్వం, స్వాతంత్య్రాలకు తమ మద్దతు ఉంటుందని తెలిపింది. మాల్దీవుల అధ్యక్షు డు ముయిజ్జు చైనాలో అయిదు రోజుల పర్యటన శుక్రవారంతో ముగియ నుంది. ఈ సందర్భంగా రెండు దేశాలు తమ ప్రయోజనాలను కాపాడుకునేందుకు పరస్ప    రం మద్దతుగా నిలవాలంటూ ఒక ప్రకటన విడుదలైంది.

‘మాల్దీవుల సార్వభౌమాదికారం, స్వాతంత్య్రం, జాతి గౌరవాన్ని నిలబెట్టడంలో చైనా గట్టిగా మద్దతిస్తుంది. మాల్దీవుల విధానాలను గౌరవిస్తుంది, మద్దతు ఇస్తుంది. మాల్దీవుల అంతర్గత వ్యవహారాల్లో బాహ్య జోక్యాన్ని వ్యతిరే                కిస్తుంది’అని అందులో పేర్కొంది. భారత ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ముగ్గురు మంత్రులను అధ్యక్షుడు ముయిజ్జు తొలగించడం, ఈ వ్యవహారం ఇరు దేశాల మధ్య సంబంధాల్లో ఉద్రిక్తలు పెంచడం తెలిసిందే. ఈ సమయంలోనే చైనా అనుకూలుడిగా పేరున్న ముయిజ్జు బీజింగ్‌ పర్యటనకు వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది. పర్యటన అనంతరం చైనాపై ప్రకటన విడుదల చేయడం గమనార్హం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement