Chicago: ఉన్మాది కాల్పుల్లో ఏడుగురి మృతి! Chicago Shooting Incident Updates: Police Searching For Suspect | Sakshi
Sakshi News home page

చికాగో: తుపాకులతో ఉన్మాది వీరంగం.. ఏడుగురి మృతి

Published Tue, Jan 23 2024 7:32 AM | Last Updated on Tue, Jan 23 2024 8:29 AM

Chicago Shooting Incident Updates: Police Search For Suspect - Sakshi

స్ప్రింగ్‌ఫీల్డ్‌: తుపాకీ సంస్కృతి తమకు వద్దే వద్దంటూ అమెరికన్లు గళమెత్తుతున్నా.. యువత మాత్రం వదలడం లేదు. తాజాగా మరోసారి గన్‌కల్చర్‌ పంజా విసింది. సోమవారం చికాగో నగరంలో ఓ దుండగుడు రెండు వేర్వేరు చోట్ల జరిపిన కాల్పుల్లో ఏడుగురు మరణించారు. ఆయుధాలతో పరారీలో ఉన్న ఆ ఉన్మాది కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. 

ఇల్లానాయిస్‌ స్టేట్‌ చికాగో జోలియట్ ప్రాంతంలోని  2200 block of West Acres Roadలో సోమవారం ఈ ఘోరం జరిగింది. బాధిత కుటుంబాల ఇళ్లలోకి చొరబడి మరీ ఆ వ్యక్తి కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఘటనల్లో రెండు కుటుంబాలకు చెందిన ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానిక మీడియా ఛానెల్స్‌ చెబుతుండగా..  స్థానిక పోలీసులు మాత్రం మృతుల సంఖ్యపై స్పష్టత ఇవ్వలేదు.  

మరోవైపు నిందితుడిని 23 ఏళ్ల రోమియో నాన్స్‌గా ప్రకటించిన పోలీసులు.. బాధిత కుటుంబాలకు అతనికి పరిచయం ఉందని భావిస్తున్నారు. ఘటన తర్వాత కారులో ఆ యువకుడు పరారు అయ్యాడు. మరింత నరమేధం జరపకమునుపే అతన్ని అదుపులోకి తీసుకోవాలని పోలీసులు ప్రయతిస్తున్నారు. స్థానిక పోలీసులతో పాటు ఎఫ్‌బీఐ సంబంధిత టాస్క్‌ఫోర్స్‌ ఆ ఉన్మాది కోసం గాలింపు చేపట్టాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement