మళ్లీ ‘చెత్త’ పని చేసిన నార్త్‌ కొరియా కిమ్‌! | Seoul Will Restart Anti Pyongyang Loudspeaker Broadcasts In Retaliation Against Trash Balloons | Sakshi
Sakshi News home page

‘చెత్త’తో ఉత్తర కొరియా కవ్వింపు.. మండిపడుతున్న దక్షిణ కొరియా

Published Sun, Jun 9 2024 12:27 PM | Last Updated on Sun, Jun 9 2024 3:56 PM

Anti Pyongyang Loudspeaker Broadcasts in Retaliation Against Trash Balloons

ఇప్పటి వరకు ఉత్తర కొరియా తన దగ్గరున్న క్షిపణులు, అణుబాంబులతో దక్షిణ కొరియాను బెదిరిస్తూ వచ్చింది. అయితే తాజాగా ఆ దేశం దక్షిణ కొరియాను ‘చెత్త బెలూన్ల’తో కవ్విస్తోంది. ఉత్తర కొరియా ఇటీవల 150 బెలూన్‌లకు చెత్తను కట్టి దక్షిణ కొరియాలోకి విడుదల చేసింది. దీనిపై దక్షిణ కొరియా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయంలో ఖఠినవైఖరి అవలంబిస్తామని ఉత్తర కొరియాను హెచ్చరించింది.

ఉత్తరకొరియా తీరును ఎండగడుతూ లౌడ్ స్పీకర్ల ద్వారా మరోసారి వ్యోంగ్యాంగ్ (ఉత్తర కొరియాలోని ప్రధాన నగరం)నకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తామని సియోల్(దక్షిన కొరియాలోని ప్రధాన నగరం) పరిపాలనా అధికారులు హెచ్చరించారు. జాతీయ భద్రతా సమావేశంలో ఈమేరకు ఒక నిర్ణయం తీసుకున్నారు. సౌత్ కొరియా అధ్యక్ష కార్యాలయం వెలుపల లౌడ్ స్పీకర్లను ఏర్పాటు చేసి ఉత్తరకొరియాకు వ్యతిరేకంగా ప్రసారాలు ప్రారంభిస్తామని జాతీయ భద్రతా అధికారులు హెచ్చరించారు.

కొద్ది రోజులుగా ఉత్తర కొరియా చెత్తతో కూడిన వందలాది బెలూన్‌లను పంపిందని దక్షిణ కొరియా సైన్యం మీడియాకు తెలిపింది. ఈ బెలూన్లు తెస్తున్న చెత్తలో ఉత్తర కొరియా ప్రచార సామాగ్రి ఉందా లేదా అనే విషయంపై దర్యాప్తు చేస్తున్నామని సైన్యం తెలిపింది. కాగా సరిహద్దు ప్రాంతాల్లో కరపత్రాలు, ఇతర చెత్తను పారవేస్తున్న దక్షిణ కొరియా కార్యకర్తలపై ప్రతీకారం తీర్చుకుంటామని ఇటీవల ఉత్తర కొరియా తెలిపింది. ఈ ప్రటన తరువాతనే దక్షిణ కొరియాకు చెత్త కట్టిన బెలూన్లు రావడం ప్రారంభమయ్యింది.

1950లలో కొరియా యుద్ధం జరిగినప్పటి నుండి ఉత్తర, దక్షిణ కొరియాలు తమ ప్రచార కార్యక్రమాలలో బెలూన్‌లను ఉపయోగిస్తూ వస్తున్నాయి.  ఇదిలా  ఉండగా 2018- అంతర్-కొరియా ఒప్పందాన్ని రద్దు చేయాలని నిర్ణయించినట్లు దక్షిణ కొరియా జాతీయ భద్రతా మండలి తెలిపింది. ఈ ఒప్పంద ఉద్దేశ్యం ఇరు కొరియా దేశాల మధ్య పరస్పర నమ్మకం  ఏర్పడే వరకూ సరిహద్దు శత్రుత్వాన్ని తగ్గించడం.

ఈ ఒప్పందాన్ని ఎత్తివేడం వల్ల ఉత్తర కొరియా సరిహద్దులో దక్షిణ కొరియా మళ్లీ సైనిక విన్యాసాలు ప్రారంభించేందుకు వీలు కలుగుతుందని, పొరుగు దేశం కవ్వింపు చర్యలని తిప్పొకొట్టవచ్చని భద్రతా మండలి పేర్కొంది. ఒప్పందపు రద్దు ప్రతిపాదనను ఆమోదం కోసం క్యాబినెట్ కౌన్సిల్‌కు సమర్పించనున్నారు. కాగా ఉత్తర కొరియా ఇప్పటివరకు దక్షిణ కొరియాలోని వివిధ ప్రాంతాల్లో వెయ్యికి పైగా చెత్తతో కూడిన బెలూన్‌లను ఎగరేసింది. వీటిలో పేడ, సిగరెట్ పీకలు, గుడ్డ ముక్కలు, వ్యర్థ కాగితాలు ఉన్నట్లు గుర్తించారు. దక్షిణ కొరియా సైన్యం తెలిపిన వివరాల ప్రకారం ఈ బెలూన్లలో ఎటువంటి ప్రమాదకర పదార్థాలు లేవు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement