ఎ‘లక్ష’ణంగా..! | - | Sakshi
Sakshi News home page

ఎ‘లక్ష’ణంగా..!

Published Tue, Apr 16 2024 6:50 AM | Last Updated on Tue, Apr 16 2024 6:50 AM

- - Sakshi

నియోజకవర్గాల వారీగా దరఖాస్తులిలా

అసెంబ్లీ నమోదుకు తొలగింపు మార్పులు

ముషీరాబాద్‌ 5338 16402 15210

మలక్‌పేట 3672 3702 4389

అంబర్‌పేట 4302 7812 7000

ఖైరతాబాద్‌ 5067 5097 5807

జూబ్లీహిల్స్‌ 8138 14979 7622

సనత్‌నగర్‌ 4439 6123 4001

నాంపల్లి 5575 5992 5509

కార్వాన్‌ 6144 10707 4266

గోషామహల్‌ 5231 4626 2087

చార్మినార్‌ 3769 2857 2661

చాంద్రాయణగుట్ట 6535 16435 16620

యాకుత్‌పురా 8158 5336 6807

బహదూర్‌పురా 5863 9473 6543

సికింద్రాబాద్‌ 4422 9167 6180

కంటోన్మెంట్‌ 7897 5922 3097

ఓటరుగా నమోదు కోసం లక్ష దరఖాస్తులు

చిరునామా, తదితర మార్పుల కోసం సైతం..

తొలగింపులకు ఇంకా ఎక్కువే..

సాక్షి, సిటీబ్యూరో: త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు నగర పౌరులు ఉత్సాహం చూపుతున్నారు. ఓటరు జాబితాలో పేరు లేని వారు దాదాపు లక్ష మంది దరఖాస్తు చేసుకోగా, చిరునామా మార్పులు, పొరపాట్ల సవరణలు, తదితరమైన వాటి కోసం మరో లక్ష మంది వరకు దరఖాస్తు చేసుకున్నారు. ఓటరు తుది జాబితా అనంతరం గత జనవరి 23వ తేదీ నుంచి ఇప్పటి వరకు హైదరాబాద్‌ జిల్లా పరిధిలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ఈ మేరకు దరఖాస్తులందాయి. లోక్‌సభ ఎన్నికల్లో ఓటు వేయాలనుకునే అర్హులైన ఓటర్ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు సోమవారం వరకు ఎన్నికల సంఘం గడువునిచ్చింది. సోమవారం అర్ధరాత్రి వరకు కూడా ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు గడవుండగా, సాయంత్రం వరకు పేరు నమోదు కోసం దాదాపు 85 వేల దరఖాస్తులందగా, చిరునామా మార్పులు, సవరణలు తదితరమైన వాటికోసం 97 వేల దరఖాస్తులందాయి. గడువు ముగిసేలోగా రెండు విభాగాల్లోనూ దరఖాస్తులు లక్ష దాటవచ్చునని అంచనా.

తొలగింపులధికం..

కొత్తగా ఓటరు నమోదు..చిరునామా మార్పు, పొరపాట్ల సవరణల కోసం దరఖాస్తు చేసుకున్న వారు దాదాపు లక్ష మంది వంతున ఉండగా, తొలగింపుల కోసం అందిన అభ్యంతరాలు ఇంకా అధికంగా ఉండటం విశేషం. వీటికోసం గత నెల 15వ తేదీ వరకు దాదాపు 1.25 లక్షల దరఖాస్తులందాయి. వాటిల్లో దాదాపు 1.20 లక్షల దరఖాస్తుల్ని పరిష్కరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement