నేడు కృత్రిమ మేధపై ప్రత్యేక శిక్షణ | - | Sakshi
Sakshi News home page

నేడు కృత్రిమ మేధపై ప్రత్యేక శిక్షణ

Published Tue, Apr 16 2024 6:50 AM | Last Updated on Tue, Apr 16 2024 6:50 AM

-

సాక్షి, సిటీబ్యూరో: తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో మంగళవారం జూమ్‌ వర్చువల్‌ వేదికగా ‘డిజిటల్‌ యుగంలో ఏఐ, తెలుగు భాషాభివృద్ధి–ఆవశ్యకత–అవకాశాలు’ అంశాలపైన ప్రత్యేక శిక్షణ శిబిరాన్ని నిర్వహించనున్నారు. ఈ ప్రత్యేక కార్యక్రమంలో భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ అతిథి ప్రసంగం చేస్తారని, ప్రాజెక్ట్‌ ఇండిక్‌ వికీ ప్రోగ్రామ్‌ మేనేజర్‌ కశ్యప్‌, సీఐఎస్‌–ఏ2కే ప్రోగ్రామ్‌ మేనేజర్‌పవన్‌ సంతోష్‌ ప్రధాన వక్తులుగా పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. డిజిటల్‌ యుగంలో ఏఐ, తెలుగు భాషాభివృద్ధి తదితర అంశాలపైన ఆసక్తిగల వారు ఈ వర్చువల్‌ కార్యక్రమంలో ‘జూమ్‌ మీటింగ్‌ ఐడీ 99981156774, పాస్‌వర్డ్‌ 747591’తో పాల్గొనవచ్చని తెలిపారు.

ఇళ్ల వద్దకే వచ్చి

తీసుకెళ్తారు..

సాక్షి,సిటీబ్యూరో: నగరంలోని భవనాల నిర్మాణ, కూల్చివేతల (సీఅండ్‌డీ) వ్యర్థాలను జీహెచ్‌ఎంసీ ఎంపిక చేసిన ఏజెన్సీలు ప్రజల ఇళ్ల వద్దకే వచ్చి తీసుకెళ్తాయని కమిషనర్‌ రోనాల్డ్‌రాస్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సంబంధిత టోల్‌ఫ్రీ పోన్‌ నెంబర్లు, వాట్సాప్‌ నెంబర్లతో పాటు జీహెచ్‌ఎంసీ వెబ్‌సైట్‌, మై జీహెచ్‌ఎంసీ యాప్‌ల ద్వారా కూడా నిర్ణీత ఫీజు చెల్లించి ఈ సేవలు పొందవచ్చునని తెలిపారు. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రజలు ఎక్కడ పడితే అక్కడ సీఅండ్‌డీ వ్యర్థాలు వేయకుండా ఈ సేవలను వినియోగించుకోవాలని కోరారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement