అందరి వాడు అంబేడ్కర్‌ | - | Sakshi
Sakshi News home page

అందరి వాడు అంబేడ్కర్‌

Published Mon, Apr 15 2024 6:50 AM | Last Updated on Mon, Apr 15 2024 6:50 AM

సీనియర్‌ జర్నలిస్టు పంతంగి రాంబాబును సత్కరిస్తున్న దృశ్యం - Sakshi

శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌

శంషాబాద్‌: రాజ్యాంగ నిర్మాత బాబాసాహేబ్‌ అంబేడ్కర్‌ అందరివాడని శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ అన్నారు. ఆదివారం ఆయన స్థానిక అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్ని వర్గాల సంక్షేమాన్ని కాంక్షించిన మహనీయుడు అంబేడ్కర్‌ అన్నారు. కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు పి. సంజయ్‌యాదవ్‌, సీనియర్‌ నాయకులు మైలారం సులోచన తదితరులు పాల్గొన్నారు.

అంబేడ్కర్‌ మార్గం అనుసరణీయం

కేంద్రమంత్రి జి.కిషన్‌ రెడ్డి

కాచిగూడ: రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ అంబేడ్కర్‌ మార్గం అనుసరణీమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి జి.కిషన్‌ రెడ్డి అన్నారు. ఆదివారం బర్కత్‌పురలోని బీజేపీ నగర కార్యాలయంలో అంబేడ్కర్‌ చిత్రపటానికి ఆయన పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ దేశ సమగ్రత, భద్రతను దృష్టిలో పెట్టుకుని అంబేడ్కర్‌ రాజ్యాంగాన్ని రచించారని కొనియాడారు.

¯]l*™èl¯]l ´ëÆý‡Ï-Ððl$…sŒæ ¿ýæÐ]l-¯é-°MìS ˘A…»ôæ-yýlPÆŠ‡ õ³Æý‡$ ò³sêtÍ

హిమాయత్‌నగర్‌: ఢిల్లీలో నిర్మించిన నూతన పార్లమెంట్‌ భవనానికి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ పేరు పెట్టాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్‌ గౌడ్‌ డిమాండ్‌ చేశారు. ఆదివారం డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ జయంతిని పురస్కరించుకుని లోయర్‌ ట్యాంక్‌ బండ్‌లోని అంబేద్కర్‌ విగ్రహానికి బీసీ సంఘాల నేతలతో కలిసి అంబేద్కర్‌కు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జాజుల మాట్లాడుతూ భారతదేశానికి ఉత్తమ రాజ్యాంగాన్ని అందించిన డాక్టర్‌ బి.ఆర్‌ అంబేడ్కర్‌ పేరు చిరస్థాయిగా నిలిచిపోవాలంటే నూతన పార్లమెంటు భవనానికి ఆయన పేరు పెట్టాలని డిమాండ్‌ చేశారు.

జలమండలిలో ..

సాక్షి,సిటీబ్యూరో: రాజ్యాంగాన్ని రచించడం డా.బీఆర్‌ అంబేడ్కర్‌ దేశానికి చేసిన గొప్ప సేవల్లో ఒకటని జలమండలి ఎండీ సుదర్శన్‌ రెడ్డి అన్నారు. ఆదివారం ఖైరతాబాద్‌ లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో డా.బీఆర్‌. అంబేడ్కర్‌ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగం వల్లే అన్ని వ్యవస్థలు సక్రమంగా నడుస్తున్నాయన్నారు. అంబేడ్కర్‌ జయంతి ఉత్సవ కమిటీ సమన్వయకర్త, సీజీఎం పద్మజ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ శ్రీధర్‌ బాబు, రెవెన్యూ డైరెక్టర్‌ వీఎల్‌. ప్రవీణ్‌ కుమార్‌, ఆపరేషన్స్‌–2 డైరెక్టర్‌ స్వామి, సీజీఎంలు, జీఎంలు, వాటర్‌ వర్క్స్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ తెలంగాణ అధ్యక్షుడు రాంబాబు యాదవ్‌, అసోసియేట్‌ ప్రెసిడెంట్‌ రాజిరెడ్డి, ఔట్‌ సోర్సింగ్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ నారాయణ, జలమండలి ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయీస్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ నాయకులు, ప్రతినిధులు విశ్వనాథ్‌, శంకర్‌ ప్రసాద్‌, శ్రీనివాస్‌, అశోక్‌, నర్సింగ్‌ రావు, రామ్‌ చందర్‌, కష్ణ, రాజు, సీతయ్య నాయక్‌, దేవేందర్‌, ఉదయ్‌, ఉద్యోగులు పాల్గొన్నారు.

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌పై దాడి అమానుషం

అంబర్‌పేట: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై దాడి అమానుషమని బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు ఎర్రబోలు నర్సింహరెడ్డి అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్‌ జగన్‌కు ప్రజల్లో వస్తున్న ఆదరణను చూసి తట్టుకోలేక టీడీపీ నేతలు దాడులు చేయించడం దారుణమన్నారు. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటనలో పేర్కోన్నారు. టీడీపీ నేత చంద్రబాబు నాయుడు రెచ్చగొట్టే ప్రసంగాలతోనే టీడీపీ నేతలు జగన్‌పై దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. ఇలాంటి దాడులకు ప్రజాస్వామ్యంలో తావులేదన్నారు. ఓటమి భయంతోనే టీడీపీ అరాచకాలకు తెరలేపిందని ఆయన పేర్కొన్నారు.

నిరంతరం నాణ్యమైన విద్యుత్‌ అందించాలి

సాక్షి, సిటీబ్యూరో: తెలంగాణ విద్యుత్‌ రంగ సంస్థల అభివృద్ధి కోసం, వచ్చే వేసవి విద్యుత్‌ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని రైతాంగానికి, అన్ని వర్గాల ప్రజలకు నిరంతరం నాణ్యమైన విద్యుత్‌ అందించేందుకు ఉద్యోగులు కృషి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆదివారం జూబ్లిహిల్స్‌లోని నివాసంలో సీఎం రేవంత్‌రెడ్డిని విద్యుత్‌ అకౌంట్స్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌(వీఏఓఏ) ప్రతినిధులు మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎం వారికి పలు సూచనలు చేశారు. కరెంట్‌ సరఫరాలో అంతరాయాలకు ఆస్కారం ఇవ్వొద్దని, వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేయడంలో అధికారులు సహకరించాలని సూచించారు. సీఎంను కలిసిన వారిలో అసోసియేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంజయ్య, పరమేష్‌, తదితర ప్రతినిధులు ఉన్నారు.

కాపులు అన్ని రంగాల్లో రాణించాలి

రాంగోపాల్‌పేట్‌: కాపులు ఆర్థిక, సామాజిక, రాజకీయంగా ఉన్నత స్థానాలకు చేరుకుని సమాజాభివృద్ధికి పాటుపడాలని పలువురు వక్తలు అన్నారు. ఆదివారం సికింద్రాబాద్‌లోని సప్తగిరి హోటల్‌లో ఆల్‌ ఇండియా తెలగ బలిజ కాపు సంఘం ఆధ్వర్యంలో ఉగాది పురస్కారాలను ప్రదానం చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తమిళనాడు మాజీ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్‌రావుతో పాటు సంఘం అధ్యక్ష కార్యదర్శులు సీఏ కోటెల శ్రీహరి, పీ వినాయక స్వామి తదితర ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్‌వీరావు, ఉదయ్‌భాస్కర్‌, దాసరి రాము, రామ్మోహన్‌, సామల వేణుకు కాపు రత్న అవార్డులను అందజేశారు. అవార్డు గ్రహీతలు, అతిథులు మాట్లాడుతూ 20 శాతం జనాభా ఉన్న కాపులు రాజ్యాధికారం కోసం సంఘటితం కావాలన్నారు. 1959 సంవత్సరంలో స్థాపించిన సంఘం ఆధ్వర్యంలో నిరంతరం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా సీనియర్‌ జర్నలిస్టు పంతంగి రాంబాబుకు బెస్ట్‌ జర్నలిస్టు అవార్డుతో పాటు ఆయా రంగాల్లో పనిచేసిన ప్రముఖులకు అవార్డులను అందజేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
1/6

2/6

3/6

4/6

5/6

నర్సింహరెడ్డి
6/6

నర్సింహరెడ్డి

Advertisement
 
Advertisement
 
Advertisement