అనంత లోకాలకు | - | Sakshi
Sakshi News home page

అనంత లోకాలకు

Published Sun, Apr 14 2024 8:00 AM | Last Updated on Sun, Apr 14 2024 8:00 AM

నుజ్జునుజ్జయిన స్విఫ్ట్‌ కారు 
 - Sakshi

హెల్త్‌ చెకప్‌కు వెళ్తూ..

నాగోలు: హాస్పిటల్‌లో హెల్త్‌ చెకప్‌ కోసం వెళ్తుండగా ఆగిఉన్న లారీని క్యాబ్‌ ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ ఘటన ఎల్‌బీనగర్‌ పరిధిలో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా చిల్కూర్‌ బేతవోలుకు చెందిన సాదె వీరయ్య (78), ఇదే ప్రాంతానికి చెందిన సుంకరి మొగ్గయ్య (60) నగర శివారు హయత్‌నగర్‌ సూర్యనగర్‌ కాలనీలో నివాసం ఉండే సాదె జగదీష్‌ వద్దకు శుక్రవారం వచ్చారు. శనివారం ఉదయం గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్‌లో సాదె వీరయ్య హెల్త్‌ చెకప్‌నకు వెళ్లేందుకు ఓలా క్యాబ్‌ను బుక్‌ చేసుకున్నారు. కారులో డ్రైవర్‌తో పాటు వీరయ్య, మొగ్గయ్య, జగదీష్‌లు కలిసి హయత్‌నగర్‌ నుంచి గచ్చిబౌలి వైపు వెళ్తున్నారు. ఎల్‌బీనగర్‌ సరూర్‌నగర్‌ ఇండోర్‌ స్టేడియం వద్ద రోడ్డు మధ్యలో నిలిపి ఉన్న లారీని వెనక నుంచి క్యాబ్‌ ఢీకొంది. కారులో ఉన్న నలుగురిలో మొగ్గయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. మిగతా ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు వీరయ్యను ఎల్‌బీనగర్‌లోని కామినేని హాస్పిటల్‌ తరలించారు. తలకు తీవ్రగాయాలైన జగదీష్‌, కారు డ్రైవర్‌ కిరణ్‌కుమార్‌లను కొత్తపేటలోని ఓమ్ని హాస్పిటల్‌కు తరలించారు. కామినేని హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న వీరయ్య మృతి చెందాడు. లారీ డ్రైవర్‌ను ఎల్‌బీనగర్‌ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. కేసు దర్యాప్తులో ఉంది.

కారు ఢీకొన్న ప్రమాదంలో మరో ఇద్దరు..

హస్తినాపురం: గుర్రంగూడ చౌరస్తా విపాసన ధ్యాన కేంద్రం వద్ద శుక్రవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన వనస్థలిపురం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బీఎన్‌రెడ్డి నగర్‌ నుంచి ఇంజాపూర్‌ వైపు వెళ్తున్న స్విఫ్ట్‌ కారును మర్రిగూడ నుంచి నగరానికి వస్తున్న క్రెటా కారు అతివేగంతో ఢీకొంది. దీంతో స్విఫ్ట్‌ కారులో ప్రయాణిస్తున్న వనస్థలిపురం ఎస్కేడీ నగర్‌కు చెందిన రవి (29), మీర్‌పేట నంది హిల్స్‌కు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ప్రణయ్‌ (29)లు అక్కడికక్కడే మృతి చెందారు. క్రీటా కారు డ్రైవర్‌ దస్రుకు గాయాల కావడంతో ఆసుపత్రికి తరలించారు. వనస్థలిపురం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఆగి ఉన్న లారీని ఢీకొన్న క్యాబ్‌

ఇద్దరి మృతి, మరో ఇద్దరికి గాయాలు

ఎల్‌బీనగర్‌లో ఘటన

No comments yet. Be the first to comment!
Add a comment
మొగ్గయ్య (ఫైల్‌)
1/2

మొగ్గయ్య (ఫైల్‌)

 వీరయ్య (ఫైల్‌)
2/2

వీరయ్య (ఫైల్‌)

Advertisement
 
Advertisement
 
Advertisement