పీహెచ్‌డీ ఎంట్రన్స్‌ టెస్ట్‌కు మంగళం? | - | Sakshi
Sakshi News home page

పీహెచ్‌డీ ఎంట్రన్స్‌ టెస్ట్‌కు మంగళం?

Published Sun, Apr 14 2024 8:00 AM | Last Updated on Sun, Apr 14 2024 8:00 AM

-

ఉస్మానియా యూనివర్సిటీ: ఎంట్రన్స్‌ టెస్ట్‌ ద్వారా పీహెచ్‌డీ ప్రవేశాలకు ఓయూ మంగళం పాడనుంది. యూజీసీ కొత్త నిబంధనల ప్రకారం నేషనల్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులకు మాత్రమే పీహెచ్‌డీలో ప్రవేశం కల్పించనున్నారు. ఇప్పటి వరకు కేటగిరి–1లో ఎంట్రన్స్‌ టెస్ట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులతో పాటు కేటగిరి–2లో నెట్‌ అర్హత సాధించిన వారికి పీహెచ్‌డీలో ప్రవేశం కల్పించారు. ఇక నుంచి కేవలం నెట్‌ అర్హత సాధించిన విద్యార్థులకు మాత్రమే పీహెచ్‌డీలో ప్రవేశం కల్పించనున్నారు. ఈ విషయమై త్వరలో స్టాండింగ్‌ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకోనున్నట్లు ఓయూ వీసీ ప్రొ.రవీందర్‌ శనివారం ‘సాక్షితో అన్నారు.

20న

అంతర్జాతీయ మహిళా సదస్సు

గన్‌ఫౌండ్రీ: యునైటేడ్‌ నేషన్స్‌, యునిసెఫ్‌, యునెస్కోల సహకారంతో ఇంటిగ్రేటెడ్‌ గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్య ంలో ఈనెల 20న సింగపూర్‌లో అంతర్జాతీ య మహిళా సద స్సు నిర్వహిస్తున్నట్లు సంస్థ అధ్యక్షులు వినయ్‌కుమార్‌ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల నుంచి కూచిపూడి నృత్య కళాకారులు డాక్టర్‌ వనజ ఉదయ్‌, డాక్టర్‌ వి.వినీల రావు, ఫిల్మ్‌ మేకర్‌ రుబీనా పర్వీన్‌, సీనియర్‌ పాత్రికేయులు మహ్మద్‌ రఫీ, సిరి కొండ వినయ్‌ల తో పాటు వివిధ రంగాల నుండి పలువురు ప్రముఖులు హాజరు కానున్న ట్లు పే ర్కొన్నారు. 19న 120 మంది విద్యావేత్తలు, సామాజికవేత్తలు, వివిధ రంగాల ప్రముఖులు ప్రత్యేక విమానంలో సింగపూర్‌ వెళ్తారన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement