'యూ, యూ, యూ, లైక్‌ ఇట్స్‌'.. ఈ మాగ్నటిక్‌ సాంగ్‌ను విన్నారా!? You You You Like It Have You Heard The Magnetic Song | Sakshi
Sakshi News home page

'యూ, యూ, యూ, లైక్‌ ఇట్స్‌'.. ఈ మాగ్నటిక్‌ సాంగ్‌ను విన్నారా!?

Published Fri, Apr 19 2024 1:23 PM | Last Updated on Fri, Apr 19 2024 1:23 PM

You You You Like It Have You Heard The Magnetic Song - Sakshi

కొరియన్‌–పాప్‌ సెన్సేషన్‌ ‘ఇలిట్‌’ మ్యూజిక్‌ ఇండస్ట్రీలో దూసుకుపోతోంది. డెబ్యూ–సింగిల్‌ ‘మాగ్నెటిక్‌’ బిల్‌బోర్డ్‌ చార్ట్‌ ‘హాట్‌ 100’లో చోటు సాధించడం ద్వారా ‘ఇలిట్‌’ గ్లోబల్‌ స్టేజీపై గ్రౌండ్‌ బ్రేకింగ్‌ విజయాన్ని సొంతం చేసుకుంది.

యునహ్, మింజుచ, మోకా, వోన్‌హీ, ఇరోహ అనే అయిదుగురు అమ్మాయిల బృందంతో ‘ఇలిట్‌’ మ్యూజిక్‌ బ్యాండ్‌ గత నెల ప్రారంభమైంది. తొలి అడుగుల్లోనే స్పాటిఫై ‘డైలీ టాప్‌ సాంగ్‌ గ్లోబల్‌’ చార్ట్‌లో చోటు సంపాదించింది. యూకే ‘అఫిషియల్‌ సింగిల్స్‌ టాప్‌ 100’లో మెరిసింది.

‘మాగ్నెటిక్‌’ సాంగ్‌ను ‘ఇలిట్‌’ సభ్యుల ఇంటర్వ్యూల ఆధారంగా రూపొందించారు. ఈ గ్రూప్‌ డెబ్యూ ఆల్బమ్‌... సూపర్‌ రియల్‌ మీ. ‘మై వరల్డ్‌’, ‘మాగ్నటిక్‌’, ‘మిడ్‌నైట్‌ ఫిక్షన్‌’, ‘లక్కీ గర్ల్‌ సిండ్రోమ్‌’ అనే నాలుగు ట్రాక్‌లు ఈ ఆల్బమ్‌లో ఉంటాయి. తొలి వారంలోనే ‘సూపర్‌ రియల్‌ మీ’ అమ్మకాలలో రికార్డ్‌ సృష్టించింది. ‘యూ, యూ, యూ, లైక్‌ ఇట్స్‌ మాగ్నటిక్‌/ యూ, యూ, యూ, సూపర్‌’ అంటూ ‘మాగ్నటిక్‌’ను పాడాలనుకుంటే ఇప్పుడే వినండి మరి!

ఇవి చదవండి: అతిపెద్ద పాము వెలుగులోకి..అది సాక్షాత్తు పరమేశ్వరుడి..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement