గిరిజన నేతకు ‘రిచా’ బ్రాండ్‌ woman entrepreneur wants to preserve Odisha’s rich textile legacy | Sakshi
Sakshi News home page

గిరిజన నేతకు ‘రిచా’ బ్రాండ్‌

Published Wed, Jun 19 2024 9:06 AM | Last Updated on Wed, Jun 19 2024 10:19 AM

 woman entrepreneur wants to preserve Odisha’s rich textile legacy

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని అయిన రిచా మహేశ్వరి కెరీర్‌లో సంతృప్తిని కలిగించే మూలాలను వెతికింది అయితే వాటి ఆచూకి ఆ ఉద్యోగంలో లభించలేదు. ఫలితంగా లాంగ్‌ లీవ్‌ పెట్టి దేశవ్యాప్తంగా ఉన్నప్రాంచీన గిరిజన తెగల వద్దకు వెళ్లింది. ఒడిశాలో గిరిజన తెగల కళాత్మక నేత పనితో మమేకమైఆ అరుదైన కళను ప్రపంచానికి పరిచయం చేస్తుంది. ఉద్యోగి నుంచి వ్యాపారవేత్తగా మారిన తన ప్రయాణం గురించి వివరించే విశేషాలు మనదైన ప్రపంచాన్ని వెతుక్కునేందుకు తప్పక ఉపయోగపడతాయి.

‘‘నేను పుట్టి పెరిగింది ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో. మా నాన్నగారిది ఒడిశా. నాన్న బ్యాంకు ఉద్యోగి కావడం, తరచూ బదిలీలు ఉండటం వల్ల కుటుంబంతో పాటు దేశవ్యాప్తంగా తిరిగాను. ఇంజినీరింగ్‌ డిగ్రీ తర్వాత శాప్‌ కెరీర్‌ను ఎంచుకున్నాను. కొన్నాళ్ల తర్వాత ఆ ఉద్యోగం నాకు డబ్బు మాత్రమే ఇస్తుంది కానీ, ఉద్యోగం చేసిన సంతృప్తి నివ్వదనిపించింది. దాంతో 2021లో ఏడాది పాటు ఉద్యోగానికి లీవ్‌ పెట్టేసి దేశంలోని చాలా గ్రామాలు తిరిగాను. ఒడిశాలోని గ్రామాల్లోకి వెళ్లినప్పుడు నాదైన ప్రపంచంలోకి వచ్చిన భావన నాలో కలిగింది. అక్కడి గిరిజన సంఘాలను కలిశాను. వారి కళాత్మక వస్త్ర శ్రేణులను చూశాను. నాకు అవి అత్యద్భుతంగా కనిపించాయి.

నేత పని... 
కొండపత్తితో అక్కడి తెగల కళాత్మక నేత పనితనాన్ని ఆధునిక ప్రపంచానికి పరిచయం చేయాలనుకున్నాను. ‘బోయిటో’ పేరుతో నాదైన డిజైనర్‌ స్టూడియో ఏర్పాటు చేశాను. అశోకుని కాలంలో ఈ కళింగ రాజ్యానికి గొప్ప చరిత్ర ఉంది. ఓడరేవు ద్వారా విదేశీ వాణిజ్యాన్ని ఎంతో అభివృద్ధి చేశారు. ఇక్కడి పత్తిని ఇండోనేషియా, చైనా వంటి దేశాలకు తీసుకెళ్లి అక్కడి పట్టును తెచ్చేవారు. బోట్‌ను బోయిటో అని కూడా పిలుస్తారు. ఆ పేరునే మా బ్రాండ్‌కు పెట్టాను. టెక్స్‌టైల్స్‌ ద్వారా ఒడిశాను అన్వేషిస్తూ పూరీ సమీపంలోని పిప్లిలో నా మొదటి సంస్థనుప్రారంభించాను. పిప్లి ఆప్లిక్‌ వర్క్‌కు ప్రసిద్ధి. 

నుపట్నాలోని ఖండువా, సంబల్‌పూర్, పశ్చిమ బెల్ట్‌లోని సోనేపూర్, బర్గర్, బార్పల్లి వంటి ఇతర నేత యూనిట్‌లు కలుసుకున్నాను. కోరాపూట్‌లో కోట్‌΄ాడ్‌ శాలువాలకు ప్రసిద్ధి. దీంతో కోట్‌పాట్‌ నేత సంఘాన్ని కలుసుకున్నాను. ఆ తర్వాత చుట్టుపక్కల పర్వతాలను డిజైన్‌ చేసినట్టుగా ఉండే కప్పగండ శాలువాలను తయారు చేసే డోంగ్రియా సంఘం వారితో చర్చించాను. మల్కన్‌గిరిలో నివసించే ్ర΄ాచీన తెగలలో ఒకటైన బోండాల గురించి తెలుసుకున్నాను. వారి అద్భుతమైన, అందమైన నెక్‌పీస్, తల΄ాగా డిజైన్లను చూశాను. వారంతా వారి సొంత సంస్కృతిని ఇప్పటికీ కాపాడుకుంటున్నాను. శరీరాన్ని పూసలతో కప్పుతారు. దిగువ శరీరాన్ని కప్పి ఉంచే రింగా అనే చిన్న వస్త్రాన్ని ఉపయోగిస్తారు. సంప్రదాయకంగా కెరాంగా అనే చెట్టు ఫైబర్‌ను ఉపయోగించి ఆ వస్త్రాన్ని తయారు చేస్తారు. ఇప్పుడు దానిస్థానంలో పత్తి నుంచి తీసిన నూలు దారాన్ని వాడుతున్నారు.

డాక్యుమెంట్‌ వైపుగా.. 
ఇక్కడి తెగల వారితో మాట్లాడుతూ, వారితో కలిసి ఉంటున్నప్పుడు స్వచ్ఛమైన మనుషుల మధ్య నేను ఒదిగి΄ోతున్నాను అనిపించింది. వీరంతా చెప్పే కథలను డాక్యుమెంట్‌ చేస్తున్నాను. ఈ అద్భుతమైన పనితనం, ప్రత్యేకమైన కళారూ΄ాలు ప్రపంచానికి తెలియాలి అనే ఆలోచనతో డిజైనర్లతో కలిసి పనిచేయాలనుకున్నాను. అలా ప్రయాణాలు చేస్తూ, ఆలోచిస్తూ, పనులను ఆచరణలో పెట్టడానికి ఆరునెలల సమయం పట్టింది.

సంఘాలతో కలిసి..
గిరిజన తెగల నేత పనితనాన్ని ప్రపంచానికి తెలియజేయడానికి ముందు అక్కడి సంఘాలను కలిసి మాట్లాడాను. ఇది ఒక రోజులో జరగలేదు. మొదట్లో చాలా కష్టమైంది. తూర్పు బెల్ట్‌లోని నేత కార్మికులను కలిసినప్పుడు నా కోసం ప్రత్యేక రంగులలో చీరలను తయారుచేయగలవా అని అడిగాను. కానీ, వారి నుంచి ఎలాంటి స్పందన లేదు. దీంతో నాకూ పట్టుదల పెరిగింది. వారితో కలిసి కూర్చోవడం, మాట్లాడటం చేస్తూ వచ్చాను. నా మార్గంలోకి వారు రావాలంటే వారి సంస్కృతిని నేను పూర్తిగా అర్థం చేసుకోవాలి అని గుర్తించాను. ఒక ‘రింగా’ నేయడానికి బోండా కమ్యూనిటీకి చెందిన నలుగురు ఒడియా మహిళలు ఒప్పుకున్నారు.

ప్రత్యేకంగా..
కోరాపుట్‌లోని గడబా కమ్యూనిటీచే నేసిన కేరాంగ్‌ వస్త్రాల కోసం అన్వేషిస్తున్నాను. డిజైనర్లు, నేత కార్మికులు చర్చలు జరుపుతున్నారు. ఫాస్ట్‌ ఫ్యాషన్‌కు విరుద్ధంగా మేం అందించేవి తరతరాలుగా ధరించడానికి వీలైన క్లాసిక్‌ కళాఖండాలు. గిరిజన సంఘాలు మేం సూచించిన స్వల్ప రంగు మార్పులకు, సవాళ్లకు సిద్ధంగా ఉన్నాయి. బోయిటో నుంచి ట్రెంచ్‌ కోట్లు, అన్ని రకాల జాకెట్లు తయారు చేస్తున్నాం. ఇప్పుడు ఇదొక లగ్జరీ ఫ్యాషన్‌ బ్రాండ్‌గా పేరొందింది. 

మేం వీటిని అంతర్జాతీయంగా కూడా తీసుకెళుతున్నాం. మా కేటలాగ్‌లో ట్రెంచ్‌ కోట్లు, కిమోనో జాకెట్లు, ప్యాటు, బేసిక్‌ షర్టులు, డ్రెస్సులు ఉన్నాయి. పూసలతో కూడిన బోండా జాకెట్, డోంగ్రియా డిజైన్, కోట్‌΄ాడ్‌ మోటిఫ్‌లు.. మా డిజైన్స్‌లో తీసుకువస్తున్నాం. కొన్ని నెలలుగా బోయిటోతో కలిసి పని చేయడం వల్ల నా ఆర్థిక స్థిరత్వం గణనీయంగా మెరుగుపడింది. ఇప్పుడు నాలుగైదు వారాలకు ఒకసారి నా పని కోసం సంఘాలను చేరుకుంటాను. వారికి కావల్సిన మొత్తాన్ని చెల్లిస్తూ, నాకు కావల్సిన డిజైన్లను పోందుతాను. కమ్యూనిటీలకుప్రాతినిధ్యం వహించే హెరిటేజ్‌ షోలను కూడా చేయాలని చూస్తున్నాం. ప్రతి వస్త్ర డిజైన్‌ వెనుక అది నేసిన విధానం గురించి కథగా కూడా అందిస్తున్నాం’’ అంటూ చేస్తున్న పని, దాని వెనుక దాగున్న కృషిని వివరిస్తుంది ఈ నిరంతర అన్వేషి. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement