ఆ దేశం ఇంకా 2016 లోనే ..!ఎందుకో తెలుసా..! Why Is This Country Still Living In 2016 | Sakshi
Sakshi News home page

ఆ దేశం ఇంకా 2016వ ఏడాది లోనే ..!ఎందుకో తెలుసా..!

Published Mon, Jun 17 2024 5:39 PM

Why Is This Country Still Living In 2016

ప్రపంచం మొత్తం ఇంచుమించుగా ఒకే ఏడాదినే ఫాలో అవుతుంది. ఆయా దేశ కాలమాన పరిస్థితుల రీత్యా న్యూ ఇయర్‌ వేడుకులు వేర్వేరుగా జరగుతాయేమో..! గానీ అన్ని చోట​ సంవత్సరం ఒకటే ఉంటుంది. ఆయా స్థానిక సంప్రదాయాలు, మతాలు రీత్యా ఉండే ఏడాదులు వేరుగా ఉంటాయి. కానీ అంతర్జాతీయంగా ఫాలో అయ్యే ఇయర్‌ అనేది ప్రపంచమంతా ఒకటే ఉంటుంది. కానీ ఒక దేశం మాత్రం ఇంకా 2016వ సంవత్సరంలోనే ఉంది. ఇదేంటీ..? అనుకోకండి. ఎందుకుంటే..? అక్కడ దాదాపు ఏడేళ్లు వెనుక్కు ఉంటారట. మరీ వేరే దేశాలతో జరిగే కార్యకలాపాల్లో ఎలా..? అనే కదా..!. అందుకు వారేం చేస్తారంటే..

ఇధియోపియా ఇంకా 2016వ ఏడాదిలోనే ఉంది. వచ్చే సెప్టంబర్‌11కి 2017 ఏడాదిలోకి అడుగుపెడుతుందట. దాదాపు ఎనిమిదేళ్ల వ్యత్యాసమా అని ఆశ్చర్యంగా ఉన్నా. ఇది వాస్తవం. ఆఫ్రికాలో రెండో అత్యధిక జనాభా కలిగిన దేశం అయిన ఇధియోపియా దేశం తమ సంప్రదాయ సమయపాలనకు కట్టుబడి ఉంది. ప్రపంచమంతా గ్రెగోరియన్‌ క్యాలెండర్‌ ఫాలో అయితే..అక్కడ మాత్రం ఆర్థోడాక్స్ చర్చి క్యాలెండర్‌ని ఫాలో అవుతుంది. ఇది గ్రెగోరియన్‌ క్యాలెండర్‌ కంటే ఏడు లేదా ఎనిమిదేళ్లు వెనుక్కు ఉంటుంది. 

చెప్పాలంటే ఇథియోపియా దేశం తమ సాంప్రదాయిక వ్యవస్థన పట్ల ఉన్న నిబద్ధతను చాటేలా.. తన సాంస్కృతిక మతపరమైన వారసత్వాన్ని ‍ప్రతిబింబించేలా తాప్రతయపడుతోంది. అందుకోసమే ఇలా ప్రత్యేక క్యాలెండర్‌ని ఫాలో అవుతుంది. అంతేగాదు తాము వలస రాజ్యాన్ని వంటబట్టించుకోలేదని, మాకు స్వంత క్యాలేండర్‌, స్వంత వర్ణమాల ఉందని సగౌర్వంగా చెబుతున్నారు ఇథియోపియా వాసులు. ఇక ఇధియోఫియా క్యాలెండర్‌లో ఏకంగా 13 నెలలు ఉంటాయి. 

వాటిలో 12 నెలల్లో ఒక్కొక్కటి 30 రోజులు ఉండగా చివరినెల ఒక విధమైన సమయపాలను ఉంటుంది. ఇక్కడ ప్రజలు రెండు క్యాలెండర్లును ఫాలో అవ్వుతారు. అందరూ ఫాలో అయ్యే గ్రెగోరియన్‌ క్యాలెండర్‌ తోపాటు తమ దేశ క్యాలెండర్‌ని అనుసరిస్తారు. అందువల్ల ఇక్కడ ప్రజలు బర్త్‌ సర్టిఫికేట్‌లు రెండు ఉంటాయి. వాటిని ప్రాంతాల వారిగా ఒక తేదీ, అంతర్జాతీయంగా మరో తేదీ ఉంటుంది. ఇది కాస్త గందరగోళానికి గురి చేసే వ్యవహారమే అయినా వాళ్లు మాత్రం అలానే అనుసరించడం విశేషం. ఇథియోపియాలో పనిచేసే అంతర్జాతీయ సంస్థలు ఈ విషయంలో పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి కూడా. అయితే అక్కడ ప్రజలకు మాత్రం ఇదేమంత పెద్ద విషయం కాదు. వాళ్లు చాలా సులభంగా రెండు క్యాలెండర్లను అనుసరిస్తారు.

(చదవండి: డిప్రెషన్‌తో బాధపడ్డ నటుడు ఫర్దీన్‌ ఖాన్‌: బయటపడాలంటే..?)

 

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement