ఒడిస్సీ బాలినీస్‌ నృత్యాల వందేమాతర సంగమం! | Viral Video: Vande Mataram In Odissi And Balinese Dance Style | Sakshi
Sakshi News home page

ఒడిస్సీ బాలినీస్‌ నృత్యాల వందేమాతర సంగమం!

Published Fri, Apr 12 2024 5:40 PM | Last Updated on Sat, Apr 13 2024 2:19 PM

Viral Video: Vande Mataram In Odissi And Balinese Dance style - Sakshi

బంకిమ్‌ చంద్ర ఛటోపాధ్యాయ విరచిత ‘వందేమాతరం‘ ఖ్యాతి మరోసారి వి‍శ్వ యవనికపై తొణికిసలాండింది! వియత్నాంలోని బాలీలోని భారతీయ దౌత్య కార్యాలయం దీనికి వేదికైంది. భారత నృత్య శైలుల్లో ఒకటైన ఒడిస్సీకి బాలినీస్‌ శైలి కూడా తోడైంది. వందేమాతరమంటూ.. పదాలు సొగసుగా కదిలాయి. హావభావాలు వ్యక్తమయ్యాయి. ఈ వీడియో కాస్తా ఇప్పుడు నెట్‌లో వైరల్‌గా మారింది. పలువురి అభిమానాన్ని చూరగొంటోంది. ఎందుకు? ఏమిటి? ఎలా? చూసేయండి మరి!

కాన్సులేట్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా బాలిలో వందేమాతరం పాటకు ప్రత్యేక శైలిలో నృత్య ప్రదర్శన జరిగింది. భారతదేశ 74వ స్వాతంత్య్ర  దినోత్సవం సందర్భంగా బాలిలో నిర్వహించారు. ఇది ఒడిస్సీ, బాలినీస్‌ సంప్రదాయ నృత్యాలను మిక్స్‌ చేసిన నృత్య ప్రదర్శన.  ఇది ఎంతగా ఆకట్టుకుంటుందంటే..ప్రేక్షకులు మైమరిచి చూస్తుండి పోయేంతగా!

ఆ యువతులిద్దరూ చాలా చక్కటి అభినయంతో చేశారు. బంకిం చంద్ర ఛటోపాధ్యాయ రాసిన జాతీయ గీతం వందేమాతరం పాట ప్రతి భారతీయుడిలో దేశభక్తి ఉప్పొంగేలే చేస్తుంది. తెలియని అనుభూతి కలిగుతుంది. అలాంటి అద్భుతమైన గీతానికి చక్కటి నృత్యంతో అబ్బురపరిచారు ఆ యువతులు. ఈ నృత్య ప్రదర్శన ఇచ్చిన ఇద్దరు యువతుల్లో ఒకరు బాలిలో ఒడిస్సీ టీచర్‌ డా పాంపిపాల్‌ కాగా, మరోకరు బాలినీస్‌ డ్యాన్సర్‌ మెలిస్సా ఫ్టోరెన్స్‌ షిల్లెవోర్ట్‌. ఇద్దరు వేర్వేరు డ్యాన్సర్‌లు కలిసి ఒక దేశ భక్తి పాటకు ఇచ్చి ఈ ప్రదర్శన అద్భుతః ! అన్నంతగా నెటిజన్లను ఆకట్టుకుంది. 

(చదవండి: అత్యంత ఖరీదైన టీకప్పు..ధర వింటే షాకవ్వుతారు!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement