'సిగ్నోరా సర్వీస్‌ సెంటర్‌'! ఈ ముగ్గురు మహిళలు.. Signora Service Center With The Persistence Of Mary Binsi And Bintu | Sakshi
Sakshi News home page

మేరీ, బిన్సీ, బింటు అనే.. ఈ ముగ్గురు మహిళలు..?

Published Thu, Jun 20 2024 10:39 AM | Last Updated on Thu, Jun 20 2024 10:39 AM

Signora Service Center With The Persistence Of Mary Binsi And Bintu

కలలు కనడమే కాదు.. వాటి సాకారానికి కృషి చేయాలనే ఆలోచన ఓ ముగ్గురు గృహిణులలో కలిగింది. ఫలితంగా వాహనాలను రిపేర్‌ చేయడంలో శిక్షణ తీసుకున్నారు. అంతటితో ఆగిపోకుండా ‘సిగ్నోరా’ పేరుతో వెంచర్‌ను కూడా ఏర్పాటు చేశారు. మేరీ, బిన్సీ, బింటు అనే ఈ ముగ్గురు మహిళలు కేరళలోని కాసర్‌గోడ్‌కు చెందినవారు. ‘ఫస్ట్‌ ఆల్‌ ఉమెన్‌ టు ఆటోమొబైల్‌ వెంచర్‌గా మా సంస్థకు గుర్తింపు రావడం గర్వంగా ఉంది’ అని చెబుతున్న ఈ మహిళల లక్ష్యం ఎంతోమందికి స్ఫూర్తి కలిగిస్తోంది.

పనిముట్లను అందుకున్న మేరీ అరగంట కృషితో రిపేర్‌లో ఉన్న కారును డ్రైవింగ్‌కు అనుకూలంగా మార్చేసింది. మేరీ, బిన్సీ, బింటు ముగ్గురూ ఆ తర్వాత మరో వాహనాన్ని రిపేర్‌ చేయడంలో మునిగిపోయారు. సాధారణంగా మహిళలు వెనకడుగు వేసే ఆటోమొబైల్‌ రిపేరింగ్‌ రంగంలో ఈ ముగ్గురూ సక్సెస్‌ను చూపుతున్నారు.

శిక్షణతో ముందడుగు..
మహిళలు ఒంటరిగా లేదా బృందంగా వ్యా΄ారంప్రారంభించేందుకు శిక్షణ ఇవ్వడానికి పరప్ప బ్లాక్‌ పంచాయితీ ఆలోచన చేసింది. ఆ సమయానికి బిన్సీ, బింటు, మేరీలు ఎవరి కాపురాలు వారు చేసుకుంటూ కుటుంబ జీవనం గడుపుతున్నారు. అయితే తాము కుటుంబ బాధ్యతలకు అతీతంగా సమాజం ముందు సగర్వంగా నిలబడాలని కలలు కన్నారు. అంతటితో ఆగిపోలేదు.. వాటిని సాకారం చేసుకోవాలనుకున్నారు. పరప్ప బ్లాక్‌ పంచాయితీ ద్విచక్ర వాహనాల మరమ్మతులో వృత్తి శిక్షణ కోర్సును ΄్లాన్‌ చేసింది. ఆ శిక్షణా కార్యక్రమమే ముగ్గురు మహిళల జీవితాల్లో కొత్త వెలుగులు నింపింది.

గ్రూప్‌గా ఏర్పాటు..
పద్ధెనిమిది నుండి నలభై ఐదు సంవత్సరాల మధ్య వయసు గల ఇరవై మంది మహిళలను కోర్సుకు ఆహ్వానించింది. ఈప్రాజెక్ట్‌ను అమలు చేసేందుకు ఏడు పంచాయతీలను ఎంపిక చేశారు. మొత్తం 23 మంది మహిళలు శిక్షణకు ముందుకు వచ్చారు. వీరికి నెల రోజుల ΄ాటు నిపుణులు శిక్షణ ఇచ్చారు. బిన్సీ మాట్లాడుతూ ‘కోర్సు పూర్తవగానే వెంచర్‌ప్రారంభించాలనుకునేవారికి సహాయం అందిస్తామన్నారు. అప్పుడే మేం ఒక గ్రూప్‌గా ఏర్పడి సరైన ΄్లాన్‌తో ముందుకు రావాలనుకున్నాం.

ఒకే ప్రాంతంలో ఎంటర్‌ప్రైజ్‌ప్రారంభించాలనుకున్నాను. సిగ్నోరా అంటే లాటిన్‌ భాషలో ‘పెళ్లయిన స్త్రీ’ అని అర్థం. కుటుంబ సభ్యులు కూడా మాకు మద్దతునిచ్చారు. ఆటో సర్వీసింగ్‌ రంగం మహిళలకు అంత సులువైన పనికాదనే అభి్ర΄ాయం అందరిలోనూ ఉంది. దీనిని అధిగమించాలనే పట్టుదలతోనే మేం వర్క్‌షాప్‌నుప్రారంభించాం. భీమానది–కలికడవ్‌ మార్గంలో మా వెంచర్‌ను ఏర్పాటు చేశాం.

మేరీ, బిన్సీ, బింటు

తొలినాళ్లలో ‘ఆడవాళ్లు రిపేర్లు చేస్తే ఇక ఆ వాహనం ముందుకు నడిచినట్టే..’ లాంటి వ్యంగ్యపు మాటలు వినవచ్చేవి. అలాంటి ఆలోచనతో చాలా మంది మా వెంచర్‌కు వచ్చేవారు కాదు. అయితే, ఆ తర్వాత మెల్లగా మా వెంచర్‌కు వచ్చిన వాహనాలకు తగిన రిపేర్‌ చేయడంతో మంచి గుర్తింపు రావడం మొదలైంది. ఎలాంటి వాహన సమస్యనైనా మేం పరిష్కరించగలం.

ప్రతిరోజూ కొత్త విషయాలు..
‘విజయాన్ని త్వరగా సొంతం చేసుకోగల వృత్తి ఇది కాదని మేం నమ్ముతున్నాం. దీనివల్ల లాభాలు గడిస్తాం అని కూడా అనుకోవడం లేదు. ప్రస్తుతం వచ్చే ఆదాయం అద్దెకు, రుణం చెల్లించడానికి సరిపోతుంది. సర్వీస్‌ సెంటర్‌లో అధునాతన పరికరాలు కొనుగోలు చేయడానికి డబ్బు కావాలి. ప్రతి రోజూ ఒక్కో వాహనం గురించి కొత్త విషయాలు నేర్చుకుంటున్నాం.

మా ముగ్గురికీ ఆర్థిక సహకారం అందించేలా సంస్థ క్రమంగా ఎదుగుతుందని ఆశిస్తున్నాం’ అంటున్నారు ఈ మహిళలు. మొదట్లో ఆటోమొబైల్‌ సర్వీస్‌ ట్రెయినింగ్‌కు విముఖత చూపిన పలువురు స్థానిక మహిళలు ఇప్పుడు ఆసక్తిగా ఈ ΄ారిశ్రామికవేత్తలను సంప్రదిస్తున్నారు. తమ వెంచర్‌ విజయవంతమైతే ద్విచక్రవాహనాల రిపేరింగ్‌లో అమ్మాయిలకు శిక్షణ ఇవ్వాలనుకుంటున్నామ’ని మేరీ చెబుతోంది.

‘ఈ వెంచర్‌ను ప్రారంభించి ఆరు నెలలు కావస్తోంది. యూనిఫామ్‌ ధరించి పని చేస్తున్నప్పుడు మాపై మాకు నమ్మకంగానూ, గర్వంగానూ అనిపిస్తుంది. టెక్నాలజీ రోజు రోజుకూ మారుతున్న కొద్దీ ఇంకా కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటూనే ఉండాలి. చాలామంది అమ్మాయిలు, మహిళలు ఇప్పుడు మమ్మల్ని ఈ పని నేర్పించమని అడుగుతున్నారు. ఆసక్తి ఉన్నవారికి శిక్షణ అందించాలనుకుంటున్నాం. మా వెంచర్‌ను పెద్ద సంస్థగా తీర్చిదిద్దాలనేది మా లక్ష్యం’ అంటున్నారు ఈ ఉమెన్‌ మెకానిక్స్‌.

ఇవి చదవండి: ఇంతకీ ఎవరీ శతవరి? చరిత్రలో తొలిసారిగా..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement