ఆర్ట్‌లో..బాల ప్రాణ పత్రిష్ట వేడు‍క ఘట్టం మొత్తం ఇలా..! | Odisha Sand Artist Makes Pran Pratistha Ceremony Of Ram Lalla Idol, Video Goes Viral On Social Media - Sakshi
Sakshi News home page

Ram Mandir Pran Pratishtha Sand Art: బాలరాముడి ప్రాణ ప్రతిష్ట వేడుకను ఓ కళాకారుడి ఆర్ట్‌లో ఇలా చూడండి!

Published Mon, Jan 22 2024 12:03 PM | Last Updated on Mon, Jan 22 2024 12:57 PM

Sand Artist Makes Pran Pratistha Ceremony Of Ram Lalla Idol - Sakshi

బాల రాముడి ప్రాణ ప్రతిష్టకు అయోధ్య సుందరంగా ముస్తాబయ్యింది. ఇవాళే మరొకొద్దిపేపటిలో ఈ వేడుకు కన్నుల పండుగగా జరగనుంది. దీంతో దేశమంతా ఓ పండుగ వాతావరణంలా ఉంది. ఎక్కడ చూసినా, ఎటూ చూసిన  జై శ్రామ్‌ అనే నినాదాలతో మారుమ్రోగిపోతోంది. అయితే ఈ వేడుకను మానస్‌ సాహు అనే  కళాకారుడు తన ఇసుక ఆర్ట్‌తో చాలా చక్కగా చిత్రీకరించాడు. జస్ట్‌ కొద్ది నిమిషాల వ్యవధిలోని ఆ బాల రాముడి ఆలయ శంకుస్థాపన నుంచి  ప్రాణ ప్రతిష్టకు వరకు జరిగే తతంగం అంతా చాలా చక్కగా రూపొందించాడు.

చూస్తే మనం అయోధ్యలో ఉన్నామా! అనిపించేంత అందంగా తీర్చిదిద్దాడు. అయోధ్యలోని భవ్య రామమందిరం గర్భగుడిలోని బాల రాముడి విగ్రహాన్ని మన కళ్ల ముందు సాక్షాత్కారించేలా చేశాడా! అన్నంతగా కళాత్మక దృష్టితో సృష్టించాడు. ఇక సాహు గత రెండు దశాబ్దాలుగా ఈ శాండ్‌ ఆర్ట్‌తో పలు యానిమేషన్‌ ప్రయోగాలు చేస్తున్నాడు. అంతేగాదు ఈ ఇసుక కళను ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లిన ప్రముఖ కళాకారుడు కూడా ఆయనే.

అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఆయన యూనిమేషన్‌తో కూడిన ఇసుక కళతో సహజత్వాన్ని ఉట్టిపడేలా చేస్తాడు. అందువల్లే ఈ ఆయన వేసిన ఆర్ట్‌ చూస్తే..ఈ బాల రాముడి ప్రాణ ప్రతిష్ట వేడుకలో నిజంగా ఆ పాల్గొన్నామా! అనే భావన కలుగుతుంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. కాగా, బాల రాముడి ప్రాణప్రతిష్ట మహోత్సవం ఇవాళ మధ్యాహ్నాం ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరగనుంది. ఈ వేడుకలో పాల్గొనేందుకు ఇప్పటికే అయోధ్యకు పెద్ద సంఖ్యలో ప్రముఖులు, సెలబ్రేటీలు చేరుకున్నారు. 

(చదవండి: అయోధ్య రాముడుకి కాస్ట్యూమ్స్‌ డిజైన్‌ చేసేది వీరే!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement