Rakul-Jackky Wedding : జాకీ స్పెషల్‌ సర్‌ప్రైజ్‌, ఫోటోలు వైరల్‌ Rakul Preet Singh-Jackky Bhagnani Wedding Pics Goes Viral | Sakshi
Sakshi News home page

రకుల్‌ ప్రీత్‌సింగ్‌ పెళ్లి: జాకీ స్పెషల్‌ సర్‌ప్రైజ్‌, ఫోటోలు వైరల్‌

Published Wed, Feb 21 2024 10:43 AM | Last Updated on Wed, Feb 21 2024 11:33 AM

Rakul Preet Singh Jackky Bhagnani wedding Pics go viral - Sakshi

హీరోయిన్‌ రకుల్ ప్రీత్ సింగ్ , నటుడు-నిర్మాత జాకీ భగ్నానీ పెళ్లి ముహూర్తం వచ్చేసింది. ఈరోజు గోవాలో ఫిబ్రవరి 21 న వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. దీనికి సంబంధించి  ప్రీ-వెడ్డింగ్ వేడుకలు, తరలి వెళుతున్న సెలబ్రిటీల ఫోటోలు  సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి.

రకుల్‌, జాకీ పెళ్లికి భగ్నానీ & సింగ్ కుటుంబం స్వాగతం పలుతుకున్న వేదిక దగ్గర్నించి, RJ లవ్‌బర్డ్స్‌ పేర్ల తొలి అక్షరాలను రాసిన కొబ్బరికాయ, గోవా చేరుకుంటున్న పలువురు సినీరంగ ప్రముఖుల ఫోటోలను సోషల్‌ మీడియాలో ఫ్యాన్స్‌ షేర్‌ చేస్తున్నారు. 

రకుల్ జాకీ వారి మెహందీ, సంగీత వేడుకలు ఘనంగా నిర్వహించారు. సంగీత్‌లో వరుణ్ 'కూలీ నంబర్ 1' లోని 'హస్న్ హై సుహానా'కి డ్యాన్స్ చేయగా,. వరుణ్‌తో పాటు శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా , ఇతర కుటుంబ సభ్యులు కూడా  స్టెప్పులేశారు.

అంతేకాదు జాకీ భగ్నాని తన లవ్‌ లేడీని ఓ పాటతో సర్ ప్రైజ్ చేయాలని ప్లాన్ చేశాడట. వారి ప్రేమకథను సూచించే  బిన్ తేరే అంటూ సాగే ఈ పాట వేడుకకు ఓ ప్రత్యేకతను తీసుకొచ్చిందట. ఈ పాటకు మయూర్ పూరి సాహిత్యం అందించగా, తనిష్క్ బాగ్చి కంపోజిషన్‌లో జహ్రా ఎస్ ఖాన్, రోమీ మతనిష్క్ బాగ్చి పాడారు. రకుల్‌కి గుండెల్లో ఎప్పటికీ పదిలంగా ఉండేలా ఈ పాటను ప్లాన్‌  చేశాడట. 

పంజాబీ వెడ్డింగ్‌లంటే చుడా వేడుక అతిముఖ్యమైంది. వధువు మేనమామ పాలతో శుద్ధి చేసిన గాజులను అందిస్తాడు. ఇద్దరు మేనమామలుంటే, ఎవరు ఎక్కువ గాజులు పెడతారనే అందమైన పోటీ ఉంటుంది ఇద్దరి మధ్యా. ఉదయం 'చుడా' వేడుక ఆ తర్వాత గోవా ITC గ్రాండ్ సౌత్ 'సాథ్ ఫేరా' ఉంటుందని సమాచారం. రకుల్ , జాకీ రెండు   సాంప్రదాయల ప్రకారం పెళ్లిళ్లు చేసుకుంటారని తెలుస్తోంది.

అంగరంగ వైభవంగా ఈ పెళ్లి వేడుకలో జాకీ భగ్నాని తండ్రి వాషు భగ్నాని సన్నిహిత మిత్రుడు రాజ్‌కుంద్రా, ఆయన భార్య నటి శిల్పా శెట్టి ఈ  వేడుకలో ప్రత్యేకంగా కనిపించనున్నారు. నటుడు వరుణ్ ధావన్, భార్య నటాషా దలాల్ ఇప్పటికే గోవాలో సందడి చేస్తున్నారు. కొన్నేళ్ల డేటింగ్‌ తరువాత, రకుల్ ప్రీత్ సింగ్ జాకీ భగ్నానీ తమ ప్రేమ బంధాన్ని ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా 2021,అక్టోబర్‌ అధికారంగా షేర్‌ చేసిన సంగతి తెలిసిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement